Tirupati Devasthanam: త్వరపడండి.. టీటీడీ అగరబత్తులు.. దేనితో తయారు చేస్తారో తెలుసా?

Tirupati Devasthanam: తిరుమల తిరుపతి దేవస్థానం మరో అడుగు వేసింది. భక్తుల కోరికలు నెరవేర్చే క్రమంలో వినూత్న కార్యక్రమాలు చేపట్టడం తెలిసిందే. ఈ నేపథ్యంలో టీటీడీ అగర్ బత్తీల వ్యాపారం సైతం చేయడానికి సంకల్పించింది. ఇందులో భాగంగా దీని కోసం ప్రత్యేకంగా ఓ యూనిట్ ను నెలకొల్పింది. యూనిట్ ను టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి సోమవారం లాంఛనంగా ప్రారంభించారు. అగర్ బత్తీల వ్యాపారంలో రాణించాలని భావిస్తోంది. భక్తులకు ఊరూరా దేవాలయాల్లో అందుబాటులో ఉండే విధంగా చర్యలు […]

Written By: Srinivas, Updated On : September 13, 2021 5:45 pm
Follow us on

Tirupati Devasthanam: తిరుమల తిరుపతి దేవస్థానం మరో అడుగు వేసింది. భక్తుల కోరికలు నెరవేర్చే క్రమంలో వినూత్న కార్యక్రమాలు చేపట్టడం తెలిసిందే. ఈ నేపథ్యంలో టీటీడీ అగర్ బత్తీల వ్యాపారం సైతం చేయడానికి సంకల్పించింది. ఇందులో భాగంగా దీని కోసం ప్రత్యేకంగా ఓ యూనిట్ ను నెలకొల్పింది. యూనిట్ ను టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి సోమవారం లాంఛనంగా ప్రారంభించారు. అగర్ బత్తీల వ్యాపారంలో రాణించాలని భావిస్తోంది. భక్తులకు ఊరూరా దేవాలయాల్లో అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకుంటున్నారు.

అగర్ బత్తీల కేటగిరీలో తందనాన, దివ్యపాద, అభయహస్త రకాలుగా తయారు చేశారు. 100 గ్రాముల బరువు ఉన్న అగర్ బత్తీ ధర రూ.45 గా నిర్ణయించారు. దీంతో టీటీడీ అగర్ బత్తీలన్నింటిని కూడా పుష్పాలతో తయారు చేస్తారు. దీనికోసం ప్రత్యేకంగా ఓ అగర్ బత్తీల యూనిట్ ను నెలకొల్పారు. రెండు తెలుగు స్టేట్లలో అగర్ బత్తీలను విక్రయించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అన్ని దేవాలయాల్లో భక్తులకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు.

టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, కార్యనిర్వహణాధికారి డాక్టర్ కేఎస్ జవహర్ రెడ్డి, ప్రత్యేకాధికారి ధర్మారెడ్డి భక్తుల కోరిక మేరకే అగర్ బత్తీల వ్యాపారం నెలకొల్పినట్లు పేర్కొన్నారు. శ్రీవారి సేవలో అగర్ బత్తీలు ఉపయోగపడతాయని తెలిపారు. ప్రతి ఇంటిలో పరిమళాలు వెదజల్లాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. దేశవ్యాప్తంగా అన్ని దేవాలయాల్లో పూజల కోసం అగర్ బత్తీలు వినియోగిస్తామని చెప్పారు.

టీటీడీ అధికారులు అగర్ బత్తీల వ్యాపారంలో మంచి ఫలితాలు సాధించనున్నట్లు పేర్కొంటున్నారు. మార్కెట్ లో ప్రవేశపెట్టడానికి తగినంత ఉత్పత్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. టీటీడీ ఎంపిక చేసిన కౌంటర్లలో విక్రయించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఉత్పత్తి భారీ ఎత్తున చేపట్టి వ్యాపారం విస్తృతం చేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది.