
Mahesh Ad Contravercy: మన దేశంలో రాజకీయ నేతలు, సినీ తారలకు బోలెడంత మంది అభిమానులు ఉంటారు. వారి ఏం చేసినా ఫాలో అవుతారు. ముఖ్యంగా సినిమా తారలంటే ప్రాణం పెడుతారు. వారి ఫస్ట్ షో చూడడం దగ్గర నుంచి హీరోలు పిలుపునిస్తే చాలు అభిమానులు చేసేస్తారు. అలాంటి హీరోలు తమ అభిమానులకు మంచి దారిలో పోనిస్తే తప్పేంలేదు. కానీ చెడు దారికి సూచిస్తే.. అనర్థమే కదా..?
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh babu) తాజా నటించిన ప్రకటన వివాదాస్పదమవుతోంది. ఆయన ఓ ‘పాన్’కు సంబంధించిన ఇలాచ్చి ప్రొడక్ట్ లో నటించాడు. అయితే పైకి అది ‘ఇలాచ్చి మౌత్ ఫ్రెషనర్’ ప్రోడక్ట్ గా కనిపిస్తుంది. అయితే ఈ కంపెనీ భారత్ లో నిషేధించిన గుట్కా ప్రోడక్ట్ అని అందరికీ తెలుసు.ఇలాచ్చి ముసుగులో పాన్ ను పబ్లిసిటీ చేసుకుంటుందన్న విమర్శలున్నాయి.
మద్యం బ్రాండ్లు, గుట్కా, జర్ధా, తంబాకు, పొగాకు సంబంధించినవి భారత్ ప్రభుత్వం నిషేధించింది. దీంతో వాటిని ప్రకటనల్లో వేరే పేర్లతో పబ్లిసిటీ చేసుకుంటారు. ఉదాహరణకు ప్రఖ్యాత మద్యం కంపెనీ ‘రాయల్ చాలెంజ్’ తమ బీర్లు, వైన్ ను టీవీ ప్రకటనల్లో ‘క్లబ్ సోడా’, వాటర్ బాటిల్స్ గా ఇస్తుంది.
ఈ క్రమంలోనే పాన్ గుట్కా కంపెనీలు ఇప్పుడు ‘ఇలాచ్చి’ పేరుతో ప్రకటనలు గుప్పిస్తున్నాయి. కానీ ఇలాచ్చి ఎక్కడా కనిపించదని.. అదంతా ‘గుట్కా ’యాడ్స్ యేనని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
https://twitter.com/Gunjan_Mishra_/status/1437338043178909700?s=20
ప్రజలను క్యాన్సర్ బారిన పడేలా చేస్తున్నాయని గుట్కా, తంబాకు, పొగాకులను భారత ప్రభుత్వం నిషేధించింది. కానీ ఇప్పటికీ దేశంలో చాటుమాటుగా ఇవి దొరుకుతూనే ఉన్నాయి. ఆయా కంపెనీలో ఇప్పుడు ‘ఇలాచ్చి’, లవంగాలు, మిరియాలు, మౌత్ ఫ్రెషనర్ పేరిట అమ్ముతున్నారు.
ఇలాంటి గుట్కా కంపెనీలకు సూపర్ స్టార్ మహేష్ బాబు నటించడం దుమారం రేపుతోంది. అభిమానులను గుట్కా తినమని.. వారిని క్యాన్సర్ బారిన పడమని మహేష్ చెబుతున్నాడా? అని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోల్స్ విమర్శలు వ్యక్తమవుతున్నాయి. హీరోలు తమ అభిమానులకు మంచి ప్రొడక్టులు పరిచయం చేయాలి కానీ.. ఇలా ఇలాచ్చి పేరిట గుట్కాలు ప్రచారం చేస్తారా? అని విమర్శిస్తున్నారు.
