Tirupathi : బ్యాంకుల్లో( banks ) దాచుకుంటే భరోసా ఉంటుందంటారు. వడ్డీ కలుస్తుందని చెబుతారు. తమ బ్యాంకులో డిపాజిట్లు చేయాలని కోరుతారు. అయితే ఇలా చేసిన పాపానికి ఓ బ్యాంకు ఉద్యోగి అయితే చుక్కలు చూపించాడు. ప్రజల సొమ్ముతో దర్జాగా బెట్టింగులు వేశాడు. ప్రజలు తాకట్టు పెట్టిన ఐదు కేజీల బంగారాన్ని దుర్వినియోగం చేసి.. ఏకంగా రెండు కోట్ల యాభై లక్షలు ఆన్లైన్ బెట్టింగ్ లో కట్టి అడ్డంగా దొరికిపోయాడు. తిరుపతి జిల్లా నాగలాపురం యూనియన్ బ్యాంకు లో వెలుగు చూసింది ఈ ఘరానా మోసం. ఇందుకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి.
* డిప్యూటీ మేనేజర్ నిర్వాకం
బ్యాంకు ఖాతాల్లో( bank accounts) సాధారణంగా నగదు జమ అవుతుంది. తాకట్టు పెట్టిన బంగారం కూడా సేఫ్ గా ఉంచడం బ్యాంకు ప్రధాన వీధి. అయితే అటు బ్యాంక్ ఖాతాల్లో నగదు లావాదేవీలు భారీగా జరుగుతుండడం, ఖాతాల్లో నగదు తేడా వస్తుండడంతో అనుమానం వచ్చిన అధికారులు విచారణ ప్రారంభించారు. దీనిలో భాగంగా డిప్యూటీ మేనేజర్ భారీ మొత్తంలో బ్యాంకు డబ్బును దారి మళ్ళించారని అనుమానం వారికి కలిగింది. లోతుగా పరిశీలన చేయగా అసలు విషయం బయటపడింది. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు. పోలీసుల ప్రాథమిక దర్యాప్తు ప్రకారం సంబంధిత ఉద్యోగి రోజుకు ఐదు లక్షల రూపాయల చొప్పున 50 రోజుల్లో.. మొత్తం రెండు కోట్ల యాభై లక్షలు ఆన్లైన్ కెసీనాలో పెట్టుబడి పెట్టినట్లు నిర్ధారణ జరిగింది. అయితే అతను ఈ మొత్తాన్ని తిరిగి సంపాదించాలనే ఉద్దేశంతో బెట్టింగుకు పాల్పడ్డాడా? లేకుంటే కావాలని కుట్రపూరితంగా ఈ చర్యలకు పాల్పడ్డాడా? అన్నదానిపై దర్యాప్తు కొనసాగుతోంది.
Also Read : తీసుకునేవారికి అలర్ట్.. ఈ విషయంలో మోసం చేస్తారు..
* శాఖాపరమైన దర్యాప్తు
మరోవైపు శాఖాపరమైన దర్యాప్తు( department enquiry ) కూడా కొనసాగుతోంది. ప్రజల ఆస్తులను దుర్వినియోగం చేయడం వంటి అభియోగాలపై విచారణ జరుగుతోంది. నిందితుడిని అరెస్టు చేసి అతని ఆస్తులు, బ్యాంకు లావాదేవీల పై లోతుగా పరిశీలన చేస్తున్నారు. ఈ ఘటనతో బ్యాంక్ ఖాతాదారులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. పాము తాకట్టు పెట్టిన బంగారం సురక్షితంగా ఉందా? లేదా? అని ఆరా తీస్తున్నారు. పొదుపు చేసుకునేందుకు, నగదు భద్రతకు బ్యాంకులను సంప్రదిస్తే.. ఇలా మోసాలకు పాల్పడుతుండడం పై ప్రజలు ఆందోళన చెందుతున్నారు.