MLC Elections AP: కూటమిలో( allians ) ఎమ్మెల్సీ ఎన్నికల సందడి ప్రారంభమైంది. ఏపీ నుంచి 5 ఎమ్మెల్సీ సీట్లు ఖాళీ అవుతున్నాయి. మార్చి 31న యనమల రామకృష్ణుడు, జంగా కృష్ణమూర్తి, తిరుమల నాయుడు, దువ్వారపు రామారావు, పరుచూరి అశోక్ బాబు పదవీ విరమణ చేయనున్నారు. ఈ ఐదుగురు ఎమ్మెల్యేల కోటా కింద ఎమ్మెల్సీలుగా ఎన్నికైన వారే. ఈ నేపథ్యంలో ఎన్నికలు అనివార్యంగా మారాయి. ఎలక్షన్ కమిషన్ షెడ్యూల్ ప్రకటించింది. మార్చి 10న పోలింగ్ జరగనుంది. ఈ ఐదు స్థానాలు కూటమికి ఏకపక్షంగా దక్కనున్నాయి. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కేవలం 11 స్థానాలకు పరిమితం కావడంతో ఆ పార్టీకి ఛాన్స్ లేదు. అయితే కూటమిలో మూడు పార్టీలు ఉండడంతో.. ఏ పార్టీకి ఎన్ని పదవులు వస్తాయి అన్నది తెలియడం లేదు.
Also Read: వంశీ కేసులో జగన్మోహన్ రెడ్డి.. పోలీసుల చేతికి కీలక ఆధారాలు!
* ఆ రెండు పార్టీలకు ఒక్కొక్కటి
అయితే తెలుగుదేశం( Telugu Desam) పార్టీకి ఎక్కువ స్థానాలు ఉండడంతో.. ఆ పార్టీకి మూడు ఎమ్మెల్సీ పదవులు దక్కే అవకాశం ఉందని ప్రచారం నడుస్తోంది. జనసేనకు ఒకటి, బిజెపికి ఒకటి కేటాయిస్తారని సమాచారం. అయితే ఇప్పటికే మెగా బ్రదర్ నాగబాబుకు జనసేన తరుపున ఎమ్మెల్సీ పదవి ఖాయమైనట్లు తెలుస్తోంది. ఏపీ మంత్రి వర్గంలోకి నాగబాబును తీసుకోనున్నట్లు చంద్రబాబు కొద్ది నెలల కిందట ప్రకటించారు. దీంతో నాగబాబుకు ఒక పదవి ఖాయం. ఇంకో వైపు బిజెపి నుంచి పివిఎన్ మాధవ్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. గతంలో ఆయన ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ఎన్నికల్లో టికెట్ దక్కకపోవడంతో ఆయనకు బిజెపి హై కమాండ్ ఛాన్స్ ఇస్తుందని తెలుస్తోంది.
* మూడు పదవులకు ఆశావాహులు అధికం
అయితే ఈ లెక్కన టిడిపికి కేవలం 3 ఎమ్మెల్సీ( MLC) పదవులు మిగులుతాయి. అయితే ఆశావహులు చాలామంది ఉన్నారు. ఇప్పుడు పదవి విరమణ పొందిన వారంతా తెలుగుదేశం పార్టీ నేతలే. అందులో కొందరు మళ్లీ అవకాశం దొక్కుతుందని భావిస్తున్నారు. మరోవైపు టిడిపి నుంచి ఒక ఆరుగురు నేతలు పోటీ పడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. దేవినేని ఉమామహేశ్వరరావు, బుద్దా వెంకన్న, బీద రవిచంద్ర, మోపిదేవి వెంకటరమణ, వంగవీటి రాధాకృష్ణ, మంతెన సత్యనారాయణ రాజు ఆశావహులుగా ఉన్నారు. అయితే మైలవరం నుంచి టిక్కెట్ వదులుకున్న మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుకు తప్పకుండా ఎమ్మెల్సీ పదవి దక్కుతుందని ప్రచారం జరుగుతోంది. మరోవైపు గతంలో ఎమ్మెల్సీగా ఉన్న బుద్ధా వెంకన్న సైతం ఆశావహుడిగా ఉన్నారు. మరో సీనియర్ నేత బీద రవిచంద్ర పేరు బిసి కోటాలో పరిగణలోకి తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. మోపిదేవి వెంకటరమణ సైతం రాజ్యసభ పదవి వదులుకున్నారు. ఆ సమయంలోనే ఎమ్మెల్సీ పదవి ఇస్తామని హామీ ఇచ్చినట్లు ప్రచారం నడుస్తోంది.
* ఇప్పటివరకు వర్మ రేసులో ఉన్న..
అయితే ఎమ్మెల్సీ పదవిలో ఇప్పటివరకు రేసులో ఉన్న వర్మను( Pithapuram Verma ) టిడిపి హై కమాండ్ పక్కకు తప్పించినట్లు ప్రచారం నడుస్తోంది. ఇటీవల జరిగిన పరిణామాలతోనే ఈ మార్పు చేసినట్లు సమాచారం. కాపు కోటలో వంగవీటి రాధాకృష్ణకు చాన్స్ ఇస్తారని ప్రచారం జరుగుతోంది. వంగవీటి రాధాకు సుదీర్ఘ కుటుంబ నేపథ్యం ఉంది. ఎన్నికల్లో టిడిపి గెలుపు కోసం పనిచేశారు. అందుకే ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇస్తే సముచితంగా ఉంటుందని ఒక అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది. అదే జరిగితే పిఠాపురం వర్మ మరి కొద్ది రోజులపాటు పదవి కోసం వేచి చూడాల్సిందే. మరి ఎలాంటి సంచలన నిర్ణయాలు ఉండబోతున్నాయో చూడాలి.