Bank loan: తీసుకునేవారికి అలర్ట్.. ఈ విషయంలో మోసం చేస్తారు..ఇల్లు కట్టుకోవడానికి, ఏదైనా పెద్ద మొత్తంలో వస్తువులు కొనుగోలు చేయడానికి ప్రస్తుత కాలంలో Bank loanను చాలా మంది తీసుకుంటున్నారు. కరోనా తరువాత ఆర్థిక పరిస్థితి మొత్తం మారిపోయింది. ఈ సమయంలో ఎవరి వద్ద డబ్బులు లేకపోవడంతో.. ఎవరూ ఇతరులకు ఇచ్చే పరిస్థితి లేకుండా పోయింది. ఇదే సమయంలో బ్యాంకులు సులభంగా లోన్ ఇవ్వడంతో చాలా మంది వీటిపై ఆధారపడుతున్నారు. అయితే బ్యాంకు లోన్ తీసుకున్నప్పుడు బాగానే ఉంటుంది. కానీ EMI చెల్లించే సమయంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అంతేకాకుండా ఈఎంఐ చెల్లించే సమయంలో వినియోగదారులకు తెలియకుండా కొన్ని బ్యాంకులు అదనంగా ఛార్జీలు వేస్తూ ఉంటారు. వీటిని వినియోగదారులు పెద్దగా గుర్తించరు. దీంతో Tenure లేదా Emi పెరిగిపోతూ ఉంటుంది. ఇలా ఎందుకు జరుగుతుందంటే?
Bank Loan తీసుకోవడం సులభంగా ఉంటుంది. కానీ దీనిని పొందే క్రమంలో చాలా మంది వినియోగదారులు కొన్ని విషయాలను పెద్దగా పట్టించుకోరు. ముఖ్యంగా లోన్ తీసుకునే సమయంలో వడ్డీ రేట్ ఫిక్స్ డ్ గా ఉందా? లేదా? అనేది తెలుసుకోవాలి. ఫిక్స్ డ్ వడ్డీ రేటు అయితే భవిష్యత్ లో రెపో రేటు పెరిగినా వడ్డీ రేటు అలాగే ఉంటుంది. దీంతో ఈఎంఐ గానీ, టెన్యూర్ గానీ పెరగవు. ఒకవేళ రెపో రేటు తగ్గినా.. స్థిరంగా ఉంటుంది. కానీ ఫ్లెక్సిబుల్ వడ్డీ రేటును ఎంచుకునే మాత్రం మార్కెట్ కు అనుగుణంగా వడ్డీ రేటు ఉంటుంది.
ఇటీవల ఆర్భీఐ రెపో రేటును తగ్గించింది. దీంతో బ్యాంకు వడ్డీ రేట్లు తగ్గాయి. ఇవి హోంలోన్ తీసుకునే వారికి భారీ ఊరటను కలిగించినట్లయింది. రెపో రేటు తగ్గించడం వల్ల బ్యాంకులు వినియోగదారులకు సంబంధించిన ఈఎంఐ లేదా టెన్యూర్ ను తగ్గించాల్సి ఉంటుంది. కానీ కొన్ని బ్యాంకులు మాత్రం అలా చేయకుండా.. ముఖ్యంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్లు రెపో రేటు తగ్గించినా.. పెంచినా బ్యాంకు వాళ్లు ఆ చార్జీలను వినియోగదారులపై మోపుతారు. దీంతో గడువు తీరినా లోన్ పూర్తి కాకుండా ఉంటుంది.
అయితే రెపో రేటు తగ్గిస్తే మాత్రం కచ్చితంగా ఈఎంఐని అలాగే ఉంచి టెన్యూర్ ను తగ్గించాల్సి ఉంటుంది. ఇలా చేయకపోవడం వల్ల వినియోగదారులు తీవ్రంగా నష్టపోతారు. దీంతో అదనంగా ఈఎంఐని చెల్లించాల్సి ఉంటుంది. మార్కెట్లో వడ్డీ రేట్లు తగ్గిన వెంటనే ఈఎంఐ తగ్గిందా? లేదా టెన్యూర్ తగ్గిందా? అనేది చూసుకోవాలి. అలా జరగకపోతే బ్యాంకుకు వెళ్లి సంప్రదించాలి. అప్పటికీ బ్యాంకు వారు సహకరించకపోతే అంబుడ్స్ మెన్ లో ఫిర్యాదు చేయొచ్చు. ఇలా చేస్తే వినియోగదారులు సమస్యను పరిష్కరించుకోవచ్చు. అయితే ముందుగానే బ్యాంకులోన్ తీసుకునే సమయంలో ఈ విషయాలను పక్కగా తెలుసుకోవాలి. అంతేకాకుండా వడ్డీ రేటును ఎలా ఎంచుకుంటున్నారో ఇతరుల వద్ద సలహాలు తీసుకోవాలి. భవిష్యత్ లో ఆదాయం పెరుగుతుంది.. అని భావిస్తే ప్లెక్సీబుల్ వడ్డీ రేటను మాత్రమే ఎంచుకోవాలి. ఒకేఆదాయం వచ్చే వారు ఫిక్స్ డ్ వడ్డీ రేటును ఎంచుకుంటే బాగుంటుందని అని నిపుణులు తెలుపుతున్నారు.