https://oktelugu.com/

Tirumala darshan : నేడు తిరుమల దర్శన టికెట్లు విడుదల.. ఎలా బుక్ చేసుకోవాలంటే?

Tirumala darshan జూన్ 24 సోమవారం టీటీడీకి సంబంధించిన టికెట్లను రిలీజ్ చేయనుంది.

Written By:
  • NARESH
  • , Updated On : June 24, 2024 / 09:45 AM IST

    Tirumala

    Follow us on

    Tirumala darshan : తిరుమల తిరుపతి దేవస్థానానికి నిత్యం కోట్లాది మంది భక్తులు తరలివస్తుంటాయి. అయితే శ్రీవారి దర్శనం సాధారణంగా కాదు. ఒకప్పుడు కాలినడకన, సెల్లార్ దర్శనం ద్వారా ఈజీగా అయ్యేది. కానీ రోజురోజుకు రద్దీ పెరుగుతుండడంతో టీటీడీ బోర్డు రూ.300 తో ప్రత్యేక దర్శనానికి ఏర్పాట్లు చేసింది. అయితే ఈ దర్శనం కూడా ఇప్పుడు మహా భాగ్యంగా మారింది. ఎందుకంటే ఈ దర్శనానికి సంబంధించిన టికెట్లు ఎప్పటికప్పుడు అమ్ముడుపోతున్నాయి. దీంతో దాదాపు మూడు నెలల ముందు నుంచే రూ.300 టికెట్లకు డిమాండ్ ఉంటుంది. అయితే సెప్టెంబర్ నెల కోటాకు సంబంధించిన టికెట్లను బుక్ చేసుకోవడానికి టీటీడీ అవకాశం కల్పించింది. ఆ వివరాల్లోకి వెళితే..

    తిరుమలకు వెళ్లాలనుకునేవారు ప్రీ ప్లాన్ గా ఉండాలి. వీటిలో ముఖ్యంగా దర్శనం, వసతి ఏర్పాట్లు చేసుకోవడం చాలా ముఖ్యం. దర్శనంతో పాటు గదులు దొరకడం చాలా కష్టంగా ఉంటుంది. ఇక్కడికి వచ్చే వారి సంఖ్య ఎక్కువగా ఉండడంతో తిరుమల తిరుపతి దేవస్తానం బోర్డు మూడు నెలల ముందు నుంచే టికెట్లను రిలీజ్ చేస్తుంది. ఇవి రిలీజ్ చేసిన కొద్ది సమయానికే అమ్ముడు పోతుంటాయి. హాలీడేస్ సందర్భంగా గత మార్చి నుంచి జూన్ వరకు తిరుమలకు కోట్లాది మంది భక్తులు వచ్చారు. అయితే సెప్టెంబర్ లో వెళ్లాలనుకునేవారికి టికెట్లను రిలీజ్ చేయనుంది.

    జూన్ 24 సోమవారం టీటీడీకి సంబంధించిన టికెట్లను రిలీజ్ చేయనుంది. ఇందులో రూ.300 ప్రత్యేక దర్శనం సంబంధించినవి ఉంటాయి. రూ.300 ప్రత్యేక దర్శనం టికెట్లకు నిత్యం డిమాండ్ ఉంటుంది. ఈ డిమాండ్ ను దృష్టిలో ఉంచుకొని మూడు నెలల ముందు నుంచే విక్రయిస్తున్నారు. వీటితో పాటు గదుల కోసం కూడా టికెట్లను రిలీజ్ చేయనున్నారు. వీటిని మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేయనున్నారు. వీటితో పాటు శ్రీవారి సేవా కోట టికెట్లను జూన్ 27న విడుదల చేయనున్నారు.

    ఈ టికెట్లను నేరుగా బుక్ చేసుకోవచ్చు. https://ttdevasthanams.ap.gov.inఅనే వెబ్ సైట్ ద్వారా నేరుగా టికెట్లు బుక్ చరేసుకోవచ్చు. సెప్టెంబర్ నెలలో సెలవులు ఎక్కువగా వస్తే ఈ టికెట్లు కూడా తొందరగా విక్రయాలు జరిగే అవకాశం ఉంది. ఒకవేళ శని, ఆదివారాలకు విపరీతమైన డిమాండ్ ఉంటుది.