Pawankalyan : పవన్ ఫాలోయింగ్ కు ఇదే మచ్చుతునక

ఇలా ట్విట్ చేసిన 20 నిమిషాల వ్యవధిలోనే దాదాపు 3900 రీట్విట్లు వచ్చాయి. అయితే ఇందులో ఎక్కువ మంది సానుకూలత వ్యక్తం చేయడం విశేషం. అటు పవన్ బీజేపీ ఏపీ ఇన్‌చార్జి, కేంద్ర మంత్రి మురళీధరన్‌ ఇంట్లో అల్పాహార సమావేశంలో పాల్గొన్నారు. రాష్ట్రంలో బీజేపీ బలోపేతం, జనసేనతో పొత్తులపై చర్చించినట్లు మురళీధరన్‌ ట్వీట్‌ చేశారు. మొత్తానికైతే పవన్ ఢిల్లీ పర్యటన సోషల్ మీడియాలో హోరెత్తింది. 

Written By: Dharma, Updated On : July 20, 2023 11:12 am
Follow us on

Pawankalyan : పవన్ ఫాలోయింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. సోషల్ మీడియాలో అన్వేషించి, శోధించే వారి సంఖ్య అధికం. ఒక విధంగా చెప్పాలంటే జనసేనకు మీడియా సపోర్టు లేకున్నా సోషల్ మీడియా మద్దతు అనంతం. పవన్ కు కోట్లాది మంది ఫాలోవర్స్ ఉన్నారు. గత నెలరోజులుగా వారాహి యాత్రలో పవన్ బిజీగా ఉన్నారు. ఇప్పుడు ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. దీంతో పవన్ కనిపిస్తే చాలు మీడియా వెంటాడుతోంది.. వెంటపడుతోంది. ఎల్లో మీడియా, నీలి మీడియాలతో పాటు కూలి మీడియా సైతం తమ కెమెరాలను పవన్ వైపు తిప్పక తప్పని పరిస్థితి

ప్రస్తుతం పవన్ ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల సమావేశాలకు ఢిల్లీ వెళ్లారు. పనిలో పనిగా అగ్రనేతలతో సమావేశమయ్యారు. ఏపీ రాజకీయాలను సెట్ చేసే పనిలో పడ్డారు. ముఖ్యంగా ఏపీలో నెలకొన్న తాజా పరిస్థితులను బీజేపీ నేతలకు వివరించే ప్రయత్నం చేశారు.  కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో దాదాపు 25 నిమిషాల పాటు భేటీ అయ్యారు. వైసీపీ సర్కారు అనుసరిస్తున్న చర్యలు, రాజకీయ పొత్తుల అంశాలను చర్చించారు. ఏపీ అభివృద్ధికి చేపట్టాల్సిన చర్యలను వివరించారు. అదే సమయంలో అమిత్ షాలో నిర్మాణాత్మకమైన సలహాలు, సూచనలు అందించారు.

అమిత్ షాను కలిసిన తరువాత పవన్ ట్విట్టర్ ద్వారా తన ఆనందాన్ని పంచుకున్నారు. ‘నిర్మాణాత్మక, నిర్ణయాత్మక, సుసంపన్న భవిష్యత్‌ అందించేందుకు అమిత్ షాతో జరిపిన చర్చలు దోహదపడతాయి’అని ఆశాభావం వ్యక్తం చేశారు. దీనికి కొద్దిసేపటి తరువాత అమిత్ షా ట్విట్ చేశారు. ‘పవన్‌ను కలిశానని.. రాష్ట్రాభివృద్ధి, ప్రజల సంక్షేమంపై అభిపాయ్రాలను పంచుకున్నామని, ఈ కలయిక చాలా ఆనందంగా ఉందని అమిత్ షా ట్విట్ చేశారు. ఇలా ట్విట్ చేసిన 20 నిమిషాల వ్యవధిలోనే దాదాపు 3900 రీట్విట్లు వచ్చాయి. అయితే ఇందులో ఎక్కువ మంది సానుకూలత వ్యక్తం చేయడం విశేషం. అటు పవన్ బీజేపీ ఏపీ ఇన్‌చార్జి, కేంద్ర మంత్రి మురళీధరన్‌ ఇంట్లో అల్పాహార సమావేశంలో పాల్గొన్నారు. రాష్ట్రంలో బీజేపీ బలోపేతం, జనసేనతో పొత్తులపై చర్చించినట్లు మురళీధరన్‌ ట్వీట్‌ చేశారు. మొత్తానికైతే పవన్ ఢిల్లీ పర్యటన సోషల్ మీడియాలో హోరెత్తింది.