Tirumala Laddu Issue: *తిరుపతి లడ్డూ వివాద పరిష్కారానికి ‘పవన్’ తీసుకున్న గొప్ప నిర్ణయం ఇదీ*

పవన్ వ్యాఖ్యల్లో రాజకీయాలు ఉండవు. ఇది స్పష్టమైన విషయమే. అయితే తాజాగా తిరుపతి లడ్డూ వివాదంలో నిర్ణయాత్మకమైన సూచన చేసినా.. ఆయనపై విమర్శలకు దిగుతుండడం విశేషం.

Written By: Dharma, Updated On : September 21, 2024 10:39 am

Tirumala Laddu Issue

Follow us on

Tirumala Laddu Issue: తిరుమల లడ్డూ వివాదం పతాక స్థాయికి చేరింది. దీనిపై దేశ విదేశాల్లో సైతం భక్తుల నుంచి నిరసన వ్యక్తం అవుతోంది. టీటీడీ పవిత్రతను దెబ్బతీసేలా ఈ చర్యలు ఉన్నాయంటూ అందరూ ముక్తకంఠంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది రాజకీయ అంశంగా మారిపోయింది.అయితే ఈ వివాదంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందన మాత్రం హిందూ సమాజంలో చర్చకు దారితీస్తోంది.ఆయన ఒక రాజకీయ నాయకుడు. ఆపై ఏపీ డిప్యూటీ సీఎం. అందుకే రాజకీయ కోణంలో ఎక్కువమంది చూస్తారు. బిజెపి వ్యతిరేకులకు అది తప్పుగా అనిపిస్తుంది కూడా. ఇప్పటికే పవన్ ట్విట్ కు నటుడు ప్రకాష్ రాజ్ స్పందించారు. తెరపైకి వచ్చి పవన్ కు కీలక సూచనలు చేశారు.పవన్ అధికారంలో ఉన్నారన్న విషయాన్ని గుర్తు చేశారు. మత వివాదాలు దేశంలో ఉన్నాయని..ఇక కొత్తగా ఈ వివాదాన్ని పెంచవద్దని కూడా విజ్ఞప్తి చేశారు.అధికారంలో ఉన్నారు కాబట్టి చర్యలకు ఉపక్రమించండి అంటూ సలహా ఇచ్చారు. కానీ ఈ కేసులో ఇప్పటికే చర్యలు ప్రారంభమయ్యాయి అన్న విషయం ప్రకాష్ రాజ్ కు తెలుసో? తెలియదో? కానీ పవన్ ఇటువంటి సమస్యల పరిష్కారానికి కీలక సూచనలు చేశారు. శాశ్వత పరిష్కార మార్గాలను సైతం ప్రస్తావించారు. అయితే అది హిందూ సమాజానికి చేరువ అవుతున్నాయి. వ్యతిరేకులకు మాత్రం అర్థం కాకుండా పోతున్నాయి.

* సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ప్రస్తావన
ఈ వివాదం తెరపైకి వచ్చిన నేపథ్యంలో పవన్ కళ్యాణ్ సనాతన ధర్మ రక్షణ బోర్డు ఏర్పాటు చేయాలని కోరారు. దీనిపై విస్తృతంగా చర్చ జరగాలని కూడా పిలుపునిచ్చారు. ప్రజా ప్రతినిధులు, హిందూ మఠాధిపతులు, న్యాయవాదులు, పౌర మీడియా సమాజంతో పాటు అన్ని వర్గాల వారిని భాగస్వామ్యం చేయాలని కోరారు. అయితే సనాతన ధర్మాన్ని అభిమానించేవారు ఆహ్వానించారు.సనాతన ధర్మానికి వ్యతిరేకంగా జరిగే కార్యక్రమాలను అడ్డుకోవాలని అభిమతంగా తెలుస్తోంది.

* జాతీయవాదం అధికం
వాస్తవానికి పవన్ లో జాతీయవాదం అధికం. పార్టీ ఆవిర్భావం నుంచి ఆ విషయం చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చారు. మంచి పర్యావరణ ప్రేమికుడు కూడా. హిందూ సనాతన ధర్మాన్ని కాపాడడం అంటే.. ఇతర మతాలను వ్యతిరేకించడం కాదు. ఈ విషయాన్ని కూడా పవన్ పలుమార్లు చెప్పుకొచ్చారు.కానీ ప్రకాష్ రాజు లాంటివారికి నచ్చలేదు. అయితే అటువంటి వారు పరిమితంగా ఉంటారు. వారి కంటే హిందూ సమాజం పెద్దదన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు అనే కాన్సెప్ట్ కొత్తగా ఉంది. అది పవన్ నోటి నుంచి రావడంతో విపరీతంగా వైరల్ అవుతుంది.

* బిజెపితో అంటగట్టే ప్రయత్నం
పవన్ కళ్యాణ్ ఎంతో ముందు చూపుతో ఈ ట్విట్ చేశారు. కానీ ఆయన ఓ రాజకీయ నేత కావడంతో ఇతరులకు అది ఇబ్బందికరంగా అనిపించింది. కానీ మతాల సమాహారమైన భారత దేశంలో.. హిందుత్వ వాదాన్ని బలంగా వినిపించింది బిజెపి. ఇప్పుడు పవన్ సనాతన ధర్మంపై మాట్లాడడంతో టార్గెట్ అవుతున్నారు. కేవలం బిజెపితో కలిసి నడుస్తున్నందునే పవన్ ఈ తరహా వ్యాఖ్యలు చేస్తున్నారని అనుమానిస్తున్నారు. కానీ పవన్ ఇప్పుడే కాదు.. పదేళ్ల కిందట నాటి నుంచి ఇదే వాదనలు వినిపిస్తున్నారు అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. ముందుగా చర్చ జరగాలి. తరువాత నిర్ణయం తీసుకోవాలన్నది పవన్ కోరిక. దానిని కూడా తప్పు పడితే ఏమనుకోవాలో వారికే ఎరుక.