Nagarjuna: అక్కినేని నాగార్జున గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నాగేశ్వరరావు నట వారుసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన నాగార్జున అప్పటినుంచి ఇప్పటివరకు వరుస సినిమాలను చేస్తూ ఇండస్ట్రీలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకునే ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. ఇక ఇలాంటి క్రమంలోనే ఆయన ఇప్పుడు పలు రకాల బాధ్యతలను కూడా కొనసాగిస్తూ ముందుకు సాగుతూ ఉండటం విశేషం. హీరో గానే కాకుండా పలు రకాల షోలకి పోస్టుగా వ్యవహరిస్తూ ఇప్పుడు విలన్ గా కూడా మారబోతున్నాడు… ఇక ఇప్పటికే లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో రజనీకాంత్ చేస్తున్న ‘కూలీ’ సినిమాలో విలన్ గా ప్రేక్షకులను మెప్పించడానికి నాగార్జున సిద్ధమైనట్టుగా తెలుస్తుంది. ఇక రీసెంట్ గా ఆయనకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు. ఇక ఈ విషయాలను తెలుసుకున్న అక్కినేని అభిమానులు మాత్రం కొంతవరకు నిరాశ చెందుతున్నట్టుగా తెలుస్తోంది.
ఎందుకంటే తన తోటి హీరోలైన వెంకటేష్,బాలకృష్ణ, చిరంజీవి లాంటి వారు వరుస సినిమాలు చేసుకుంటూ ముందుకు వెళ్తున్న క్రమంలో నాగార్జున కుబేర సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పలు సినిమాల్లో విలన్ గా నటించడం పట్ల వాళ్లు చాలావరకు ఇబ్బంది పడుతున్నట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే ఇప్పుడు తను హీరోగా చేసి మంచి విజయాలను అందుకోవాల్సిన అవసరమైతే ఉంది.
అటు నాగ చైతన్య, అఖిల్ ల పరిస్థితి చూస్తే మరి ధారుణంగా తయారైంది. వాళ్ళు ఒక్క సక్సెస్ కొట్టడానికే చాలా ఇబ్బంది పడుతున్నట్టుగా తెలుస్తోంది. మరి ఇలాంటి సందర్భంలో నాగార్జున సోలో హీరోగా చేసి మంచి విజయాలను అందుకుంటే అక్కినేని పేరు మరికాస్త ఇంప్రూవ్ అయ్యే అవకాశాలైతే ఉన్నాయి. అలాంటిది ఆయన హీరోగా వదిలేసి మిగతా హీరోల సినిమాల్లో విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించడం వల్ల అక్కినేని ఫ్యామిలీకి పెద్దగా ఇమేజ్ పెరిగే అవకాశాలైతే లేవు. కాబట్టి ఎలాగైనా సరే నాగార్జున స్టార్ హీరోగా మరోసారి తనను తాను ప్రూవ్ చేసుకోవాలంటే మాత్రం హీరోగా సినిమాలు చేయాల్సిందే అంటూ వాళ్ళ అభిమానులు తీవ్రస్థాయిలో సోషల్ మీడియాలో ఒక పోస్ట్ అయితే వైరల్ చేస్తున్నారు…
ఇక మొత్తానికైతే నాగార్జున అక్కినేని ఫ్యామిలీని మరింత ముందుకు తీసుకెళ్లడానికి నానా రకాలుగా ప్రయత్నాలైతే చేస్తున్నాడు… మరి అవన్నీ ఫలిస్తాయా లేదా అనేది తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. ఇక నాగార్జున ఇప్పుడు వచ్చే సినిమాలతో భారీ సక్సెస్ లను అందుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారు…