TDP Third List
TDP Third List: తెలుగుదేశం పార్టీ దూకుడు పెంచింది. మూడో జాబితాను ప్రకటించింది. 11 అసెంబ్లీ స్థానాలతో పాటు 13 పార్లమెంట్ స్థానాలకు సంబంధించి అభ్యర్థులను ఖరారు చేసింది. ఇప్పటికే 128 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన సంగతి తెలిసిందే.తొలి జాబితాలో 94, రెండో జాబితాలో 34 మంది అభ్యర్థులను ప్రకటించారు. ఇప్పుడు 11 మంది ఎమ్మెల్యే అభ్యర్థులను, 13 మంది ఎంపీ అభ్యర్థులను వెల్లడించారు. ఇంకా ఐదు అసెంబ్లీ, నాలుగు ఎంపీ స్థానాలు పెండింగ్ లో పెట్టారు.
తాజాగా ప్రకటించిన అసెంబ్లీ స్థానాలకు సంబంధించి.. పలాస గౌతు శిరీష, పాతపట్నం మామిడి గోవిందరావు, శ్రీకాకుళం గొండు శంకర్, ఎస్ కోట కోళ్ల లలిత కుమారి, కాకినాడ సిటీ వనమాడి వెంకటేశ్వరరావు, అమలాపురం అయితా బత్తుల ఆనందరావు, పెనమలూరు బోడె ప్రసాద్, మైలవరం వసంత వెంకట కృష్ణ ప్రసాద్, నరసరావుపేట చదలవాడ అరవింద బాబు, చీరాల మద్దులూరి మాల కొండయ్య యాదవ్, సర్వేపల్లి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పేర్లను ఖరారు చేశారు. అయితే సీనియర్లు అయిన కళా వెంకట్రావు, గంటా శ్రీనివాసరావు, బండారు సత్యనారాయణమూర్తి, దేవినేని ఉమా వంటి వారి విషయంలో ఇప్పటికీ స్పష్టత రాలేదు.
పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించి శ్రీకాకుళం కింజరాపు రామ్మోహన్ నాయుడు, విశాఖ మతుకుమిల్లి భరత్, అమలాపురం గంటి హరీష్, ఏలూరు పుట్ట మహేష్ యాదవ్, విజయవాడ కేశినేని చిన్ని, గుంటూరు పెమ్మసాని చంద్రశేఖర్, నరసరావుపేట లావు శ్రీకృష్ణదేవరాయలు, బాపట్ల కృష్ణ ప్రసాద్, నెల్లూరు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, చిత్తూరు దగ్గుమల్ల ప్రసాదరావు, కర్నూలు బస్తిపాటి నాగరాజు, నంద్యాల బైరెడ్డి శబరి, హిందూపురం బి.కె పార్థసారధి పేర్లు ఖరారు అయ్యాయి. దీంతో దాదాపు టిడిపి అభ్యర్థులు ఒక కొలిక్కి వచ్చినట్లు అయ్యింది.