https://oktelugu.com/

Arvind Kejriwal Arrest : లాలూ ప్రసాద్, జయలలితల సరసన అరవింద్ కేజ్రీవాల్

లాలూ ప్రసాద్, జయలలితల సరసన అరవింద్ కేజ్రీవాల్ ఉన్న తీరుపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు

Written By:
  • NARESH
  • , Updated On : March 22, 2024 / 12:06 PM IST

    Arvind Kejriwal Arrest : అరవింద్ కేజ్రీవాల్.. ఒకనాడు ఆయన పేరు తలుచుకుంటే క్రూసేడర్ ఆఫ్ కరప్షన్. ఈనాడు ఆయన పేరు కింగ్ పిన్ ఆఫ్ కరప్షన్. ఎంతలో ఎంత మార్పు.దశాబ్ధంలోనే అరవింద్ కేజ్రీవాల్ అవినీతిలో కూరుకుపోయారు.

    నాడు పార్టీ పెట్టిన కొత్తలో అరవింద్ కేజ్రీవాల్ కోసం అమెరికా నుంచి సెలవు పెట్టుకొని సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని వచ్చి ప్రజల కోసం ప్రచారం చేసి గెలిపించారు. కేజ్రీవాల్ అంటే పడి చచ్చారు.

    క్లీన్, అవినీతి లేని రాజకీయాలకు నాంది పలుకాలని యువకులందరూ అరవింద్ కేజ్రీవాల్ కు ఓటేశారు. గెలిపించారు. అన్నా హాజరే రాజకీయాల కోసం ఉద్యమాల కోసం నడపలేదు. అవినీతికి వ్యతిరేకంగా నడిపారు. యూపీఏ ప్రభుత్వంపై పోరాడారు. దానికి రైట్ హ్యాండ్ గా నిలబడ్డ కేజ్రీవాల్ రాజకీయాల్లోకి రానన్నారు. కానీ రాజకీయాల్లో ఫుల్ టైం వ్యక్తిగా మారి.. ఇప్పుడు అవినీతి సామ్రాట్ గా మారారు.

    కాంగ్రెస్ అంటేనే అవినీతి అన్న కేజ్రీవాల్.. కాంగ్రెస్ తో పొత్తు ఉండదన్నారు. ఈరోజు కాంగ్రెస్ తో కూటమి కట్టి ఢిల్లీ లిక్కర్ స్కాంలో అరెస్ట్ అయ్యారు.

    లాలూ ప్రసాద్, జయలలితల సరసన అరవింద్ కేజ్రీవాల్ ఉన్న తీరుపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు