https://oktelugu.com/

IPL 2024: పది జట్ల కొత్త జెర్సీలివే.. ఒక్కో దాని వెనుక ఒక్కో నేపథ్యం..

హైదరాబాద్ జట్టు జెర్సీని సమూలంగా మార్చింది. హైదరాబాద్ జట్టు యాజమాన్యానికి సౌత్ ఆఫ్రికా లీగ్ లో ఒక జట్టు ఉంది. దాని పేరు సన్ రైజర్స్ కేఫ్ ఈస్టర్న్.

Written By: , Updated On : March 22, 2024 / 12:01 PM IST
IPL 2024

IPL 2024

Follow us on

IPL 2024: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 17వ సీజన్ నేపథ్యంలో 10 జట్లు.. పది రకాల జెర్సీలను ఆవిష్కరించాయి. వాటిని ధరించి కెప్టెన్లు ఫోటోషూట్ లో కూడా పాల్గొన్నారు. అయితే హైదరాబాద్ , పంజాబ్ జట్లు మాత్రమే తమ జెర్సీలలో పూర్తిస్థాయి మార్పులు చేశాయి. అయితే ఈ జెర్సీలలో కొన్ని బాగున్నాయని.. మిగతావి బాగోలేదని అభిమానులు సోషల్ మీడియాలో వ్యాఖ్యలు చేస్తున్నారు.

ఢిల్లీ

ఈ జట్టుకు రిషబ్ పంత్ నాయకత్వం వహిస్తున్నాడు. ఈ సీజన్ లో కూడా నీలం, ఎరుపు రంగు కలబోతతో జెర్సీని రూపొందించారు. ముందు భాగంలో ఢిల్లీ మెట్రో మార్గం డిజిటల్ డిజైన్ రూపంలో ఉంది. ఈ ఒక్క మార్పే ఢిల్లీ జట్టు చేసింది.

హైదరాబాద్

హైదరాబాద్ జట్టు జెర్సీని సమూలంగా మార్చింది. హైదరాబాద్ జట్టు యాజమాన్యానికి సౌత్ ఆఫ్రికా లీగ్ లో ఒక జట్టు ఉంది. దాని పేరు సన్ రైజర్స్ కేఫ్ ఈస్టర్న్. ఇటీవల సీజన్ లో ఈ జట్టు కప్ సాధించింది. ఈ నేపథ్యంలో ఆ జట్టు ధరించిన ఆకృతినే.. కొత్త జెర్సీలో రూపొందించారు. కొత్త ఆకృతి లోని జెర్సీ జట్టులో ఆశావహ దృక్పథాన్ని పెంపొందిస్తుందని సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు యజమాని కావ్య అభిప్రాయపడుతోంది.

చెన్నై

చెన్నై జట్టు పేరు మదిలోకి రాగానే పసుపు రంగు గుర్తుకు వస్తుంది. ఈసారి కూడా పసుపు రంగు జెర్సీలోనే ఆ జట్టు ఆడనుంది. అయితే ఈసారి డిజైన్ లో పెద్దగా మార్పులు చేయలేదు.

గుజరాత్

గిల్ ఆధ్వర్యంలోని ఈ జట్టు జెర్సీలో పెద్దగా మార్పులు లేవు. మునుపటి డిజైన్ నే ఈ జట్టు కొనసాగించింది. ఈసారి కూడా వారు గ్రే రంగు జెర్సీలో కనిపించనున్నారు.

పంజాబ్

పంజాబ్ జట్టు జెర్సీలో చాలా వరకు మార్పులు చేసింది. ఎరుపు రంగులో మంటల డిజైన్ రూపొందించింది. జెర్సీ ముందు భాగంలో గతంలో సింహం లోగో ఉండేది. ఈసారి దానిని తొలగించారు.

ముంబై

ముంబై జట్టుకు ఈసారి కొత్త కెప్టెన్ హార్దిక్ పాండ్యా వచ్చాడు. అయితే జెర్సీలో ఈ జట్టు పెద్దగా మార్పులు చేయలేదు. రాయల్ నీలిరంగులో ఉన్న జెర్సీలనే ఈ జట్టు ఆటగాళ్లు ధరించనున్నారు. అయితే డిజైన్ లో చిన్న మార్పు చేసి.. జెర్సీపై “ఎమ్” ఆకృతిని రూపొందించింది.

బెంగళూరు

2008 నుంచి 2013 వరకు బెంగళూరు నలుపు, ఎరుపు రంగుల మిశ్రమంతో రూపొందించిన జెర్సీని ధరించింది. అయితే ఈసారి ఆ రంగులకు బదులు నీలం, ఎరుపు రంగుల కలబోతతో జెర్సీ ని రూపొందించింది. జట్టు పేరుతో పాటు లోగో కూడా మార్చింది.

లక్నో

కేఎల్ రాహుల్ ఈ చెట్టుకు నాయకత్వం వహిస్తున్నాడు. అయితే ఈసారి ఈ జట్టు జెర్సీ లో మార్పులు చేయలేదు. ముదురు నీలం రంగు తో రూపొందించిన జెర్సీలను ధరించి ఈ జట్టు ఆటగాళ్లు బరిలోకి దిగనున్నారు.

కోల్ కతా

ఈసారి కూడా కేకేఆర్ జట్టు పర్పుల్ రంగు జెర్సీలో కనిపించనుంది. జెర్సీ ముందు భాగం డిజైన్ లో చిన్న చిన్న మార్పులు చేశారు. పర్పుల్ రంగు తో పాటు బంగారు వర్ణాన్ని జత చేశారు.

రాజస్థాన్

ఈ జట్టు రాజస్థాన్ రాజధాని జైపూర్ కు సింబాలిక్ గా గులాబీ రంగు జెర్సీలో ఆడనుంది. వెనుక భాగంలో నీలిరంగును జత చేశారు. జెర్సీ ముందు భాగం డిజైన్ లో చిన్న మార్పులు చేశారు.