Free Gas scheme : ఆంధ్రప్రదేశ్‌లో కొలువుదీరిన కొత్త ప్రభుత్వం హామీల అమలుకు చర్యలు చేపట్టింది. ఐదు నెలలుగా ఆర్థిక పరిస్థితుల గురించి తెలుసుకున్న కొత్త సర్కార్.. ఇక హామీల అమలుకు కార్యాచరణ సిద్ధం చేసింది. ఇందులో భాగంగా దీపావళి నుంచే హామీలు అమలు చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా మొదటగా ఏడాదికి మూడు ఉచిత సిలిండర్ల హామీని అమలు చేయాలని నిర్ణయించింది. మహిళల పేరిట ఈ ఉచిత సిలిండర్లు అందిస్తారు. ఈ పథకాన్ని దిపావళి పండుగ రోజు సీఎం చంద్రబాబు నాయకుడు ప్రారంభించనున్నారు. ఈ పథకంలో ప్రభుత్వంపై ఏడాదికి రూ.2,684 కోట్ల భారం పడుతుందని సీఎం వెల్లడించారు.
ఉచిత పథకానికి అర్హతలు ఇవే..
ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకానికి ప్రధాన మంత్రి ఉజ్వల్ గ్యాస్ పథకం లబ్ధిదారులు కూఏడా అర్హులే. ఈ పథకం కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరులకే వర్తిస్తుంది. బీపీఎల్ క ఉటుంబాలు, తెల్లరేషన్ కార్డు ఉన్నవారికే పథకం వర్తిస్తుంది. అయితే అర్హతలను కూడా ప్రభుత్వం ప్రకటించింది. లబ్ధిదారులు ముందుగా డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. రెండు రోజుల్లో ఆడబ్బులను ఖాతాల్లో జమ చేస్తారు. ఈ పథకానికి ఆధార్ కార్డు, తెల్ల రేషన్ కార్డు, ఫోన్ నంబర్, కరెంటు బిల్లు, స్థానికత ధ్రువీకరించే సర్టిఫికెట్, బ్యాంకు అకౌంట్ వివరాలు ఉండాలి.
ఆన్‌లైన్‌లో దరఖాస్తు..
ఇక ఉచిత గ్యాస్ సిలిండర్ పథకానికి లబ్ధిదారులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. పేరు, చిరునామా వివరాలు సరిగా నమోదు చేయాలి. డాక్యుమెంట్లు అప్‌లోడ్ చేయాలి. అర్హుల జాబితా స్థానిక గ్రామ/వార్డు సచివాలయాల్లో ప్రదర్శిస్తారని తెలుస్తోంది.
ప్రభుత్వంపై 2,684 కోట్ల భారం..
మూడు ఉచిత సిలిండర్ల పథకం అమలుతో ఏటా ప్రభుత్వంపై రూ.2,684 కోట్ల భారం పడుతుంది. ఐదేళ్లలో రూ.13,423 కోట్ల భారం పడుతుంది. గ్యాస్ సిలిండర్ల ధరలు పెంచితే భారం మరింత పెరుగుతుంది. లబ్ధిదారులు ముందుగా గ్యాస్‌ని డబ్బులు చెల్లించి తీసుకోవాల్సి ఉంటుంది. తర్వాత లబ్ధిదారుల ఖాతాలో ప్రభుత్వం నగదు జమ చేస్తుంది.
నాలుగు నెలలకు ఒకటి..
ఇక ఉచిత సిలిండ్‌ను నాలుగు నెలలకు ఒకటి మాత్రమే ఇస్తారు. అంటే ఒకసారి ఉచిత సిలిండర్ తీసుకుంటే మళ్లీ నాలుగు నెలల వరకు ఉచిత సిలిండర్ ఇవ్వరు. నాలుగు నెలల తర్వాతనే మళ్లీ ఫ్రీగా పొందే అవకాశం ఉంటుంది. ప్రస్తుం సిలిండర్ ధర రూ.876 ఉంది. సబ్సిడీలో భాగంగా లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేస్తారు.