Homeజాతీయ వార్తలుShani Shingnapur: ఇళ్లకు తలుపులు లేకపోయినా దొంగలే పడరు!

Shani Shingnapur: ఇళ్లకు తలుపులు లేకపోయినా దొంగలే పడరు!

Shani Shingnapur: అఖండ భారత దేశానికి వందల ఏళ్ల చరిత్ర ఉంది. ప్రకృతి వైపరీత్యాలు, యుద్ధాలు.. శత్రువుల దాడి కారణంగా మన చరిత్ర కనుమరుగైంది. ప్రపంచంలో ఏ దేశానికి లేని వైచిత్యం.. భిన్నత్వం మన సొంతం. ఇక ఆచార వ్యవహారలు కూడా ప్రపంచ దేశాలు చేతులు ఎత్తి మొక్కేలా ఉంటాయి. అలాంటి ఓ భిననమైన ఆచారం మహారాష్ట్రలో ఇప్పటికీ అమలులో ఉంటుంది. ప్రపంచంలో టెక్నాజలీ పెరుగుతున్న కొద్దీ నేరాలు పెరుగుతున్నాయి. మహారాష్ట్రలోని ఆ ఊరిలో దొంగతనాలు జరగవు. విచిత్రం ఏమిటంటే ఆ ఊరిలో ఎవరి ఇంటికీ తలుపులు, కిటీకీలు ఉండవు. ఆ గ్రామమే శనిసింగణాపూర్‌. మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్‌ జిల్లాలోని అద్భుత గ్రామం. ఇక్కడి ఇళ్లు, దుకాణాలు, బ్యాంకులు కూడా తలుపులు ఉండవు.

దేవునిపైనే భారం..
స్వయంభూ శని విగ్రహం ఇక్కడ భూమి నుంచి ఆవిర్భవించింది. నల్ల రాయి రూపంలో ఉంది. కలియుగ ప్రారంభం నుంచి ఉనికిలో ఉందని గ్రామస్తులు నమ్ముతారు. ఒకరోజు శనీశ్వరుడు గొర్రెల కాపరి కలలో శని దేవుడు ప్రత్యక్షమై, గ్రామాన్ని తానే కాపాడతానని చెప్పాడు. దీంతో అప్పటి నుంచి ఇళ్లకు తలుపులు ఏర్పాటు చేసుకోవడం మానేశారు. ఇళ్లు ఓపెన్‌ డిజైన్‌తో గోడల మధ్య గదులు విభజించారు. ఇది వాతావరణానికి సహజంగా ఉంటుంది. బ్యాంకులు, పోలీస్‌ స్టేషన్‌ కూడా సాంకేతికంగా మాత్రమే ఉన్నాయి. పూర్తి నమ్మకంతో జీవిస్తారు. వందల సంవత్సరాలుగా ఈ ఆచారం కొనసాగుతోంది.

Also Read: మోదీ ఇజ్రాయెల్‌ టూర్‌.. వ్యూహాత్మక మలుపు

సామాజిక, ఆధ్యాత్మిక ప్రభావం
శని దేవుని కర్మఫల భయం నేరాలను అదుపు చేస్తోంది. పరస్పర విశ్వాసం గ్రామ ఐక్యతను పెంచింది. 2013లో ఒకే దొంగతనం జరిగి వివాదం తెచ్చినా, గ్రామస్తులు దైవం శిక్షిస్తుందని నమ్ముతారు. శని సింగణాపురం షిర్డీ నుంచి 70 కి.మీ. దూరంలో ఉంటుంది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version