Secret Camera : సీక్రెట్ కెమెరా కలకలం.. వందల వరకు వీడియోలు.. రోడ్డెక్కిన విద్యార్థినులు

కృష్ణా జిల్లాలోని గుండ్లవేలూరు ఇంజినీరింగ్ కాలేజీలో సీక్రెట్ కెమెరాల కలకలం రేగింది. దాదాపు 300 వీడియోలు నిందితుల వద్ద ఉన్నాయని విద్యార్థినులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం అర్ధరాత్రి మొదలైన ఆందోళన శుక్రవారం ఉదయం వరకు కొనసాగింది. దీనిపై పోలీసులు, ప్రభుత్వం సీరియస్ గా ఉందని తెలుస్తోంది.

Written By: Mahi, Updated On : August 30, 2024 1:08 pm

Secret Camera

Follow us on

Secret Camera: ఆడవారు ఆడవారికే శత్రువులుగా మారుతున్న వేళ ఇక భద్రత ఎక్కడి నుంచి, ఎవరి నుంచి కలుగుతుందన్న ప్రశ్నలు కలుగుక మానవు కదా.. తనతో కిలిసి స్నేహం చేసిన అమ్మాయి డబ్బు కోసం తన శరీరాన్ని పణంగా పెడితే ఆ అమ్మాయిల బాధ వర్ణనాతీతమే. ఇదే ఘటన ఒక కాలేజీ హాస్టల్ లో జరిగింది. బాయ్ ఫ్రెండ్, డబ్బుల కోసం తెగించిన ఒక అమ్మాయి తన స్నేహితుల నగ్న వీడియోలను అమ్ముకొని సొమ్ము చేసుకుంంది. దీంతో తమ బాధ ఎవరితో చెప్పుకోవాలని నిలదీస్తున్నారు ఆ బాధిత అమ్మాయిలు.. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 300 వరకు పైగా ఇలాంటి వీడియోలు ఉన్నాయని తెలుసుకున్న అమ్మాయిలుు ఆర్తనాదాలు పెడుతున్నారు. నిందితులను తమ కళ్ల ఎదుటే ఉరి తీయాలని వాపోతున్నారు. అసలు వివరాల్లోకి వెళ్తే.. కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు కు చెందిన ఇంజినీరింగ్‌ కళాశాలలో సీక్రెట్‌ కెమెరాల కలకలం బయటపడింది. గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత విద్యార్థినులు ఆందోళనకు దిగారు. ఎంటని తెలుసుకున్న యాజమాన్యానికి ఒళ్లు గగుర్పొడితే విషయం తెలిసింది. బాలికల హాస్టల్‌ వాష్‌ రూమ్‌లో సీక్రెట్‌ కెమెరాలు పెట్టారని ఆరోపించారు. శుక్రవారం తెల్లవారు జామున 3.30 గంటల వరకు హైడ్రామా కొనసాగింది. సదరు వీడియోలను అమ్ముకుంటున్నాడని బీటెక్‌ విద్యార్థిపై సహచర విద్యార్థులు దాడి చేవారు. విషయం తెలుసుకొని పోలీసులు కాలేజీ హాస్టల్‌కు చేరుకున్నారు.

పోలీసులను విద్యార్థునిలు అదుపు చేశారు. ఫైనల్‌ ఇయర్‌ విద్యార్థి విజయ్‌ని ప్రశ్నించారు. అతడి సెల్ ఫోన్, ల్యాప్‌ట్యాప్‌ స్వాధీనం చేసుకున్నారు. కెమెరా ఏర్పాటు చేసేందుకు విజయ్‌కి ఆ కాలేజీ హాస్టల్ లో ఉండే మరో విద్యార్థిని సహకరిస్తోందంటూ పలువురు ఆరోపిస్తున్నారు. బాలికల హాస్టల్ లో హిడెన్‌ కెమెరా గుర్తించారంటూ ఆ కాలేజీ అమ్మాయిులు ‘ఎక్స్‌’ వేదికగా పోస్టులు పెట్టారు అవి కాస్తా వైరల్ గా మారాయి. వారం క్రితమే ఘటన వెలుగు చూసినా యాజమాన్యం మాత్రం పట్టించుకోలేదు.

అయితే ఈ ఘటనకు కారణమైన ఫైనల్ ఇయర్ విద్యార్థి విజయ్, ఆమెకు సహకరించిన విద్యార్థిని మధ్య ఎలాంటి ఒప్పందం కుదిరిందని, వారి ఉన్న సంబంధం, ఆర్థిక లావా దేవీల గురించి పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇది 300 మంది విద్యార్థినులకు సంబంధించిన విషయం కావడంతో పోలీసులు కేసును సున్నితంగా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. త్వరలో పూర్తి వివరాలను వెల్లడిస్తారని తెలుస్తోంది.

ఈ వీడియోలు ఎక్కడ అప్ లోడ్ కాకుండా ఒక వేళ అయితే సోషల్ మీడియా నుంచి తొలగించాలని విద్యార్థినులు పోలీసులను అభ్యర్థిస్తున్నట్లు తెలుస్తుంది. అయితే దీనిపై పూర్తి విచారణ జరిపి నిందితులకు శిక్ష పడేలా చూస్తామని, సైబర్ పోలీసులతో వీడియోలను తొలగిస్తామని హామీ ఇచ్చినట్లు తెలిసింది. ఈ ఘటన శుక్రవారం ఉదయానికి ఆంధ్రప్రదేశ్ కు పాకడంతో ఆందోళన మొదలైంది.

విచారణకు ఆదేశించిన మంత్రి లోకేశ్
విద్యార్థినులు, మహిళలకు ఎలాంటి ఇబ్బంది కలిగినా కఠిన శిక్షలు ఉంటాయని ప్రభుత్వాలు చెప్తూనే ఉన్నాయి. అయినా దాడులు ఆగడం లేదు. ఇంజినీరింగ్ కళాశాలలో అర్ధరాత్రి విద్యార్థినిల ఆందోళనపై ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ వివరాలు తెలుసుకున్నారు. ఘగటను తీవ్రంగా తీసుకుంటామని నిందితులకు శిక్షపడేలా చూస్తామని ఆయన హామీ ఇచ్చారు. పూర్తి దర్యాప్తును వేగంగా నిర్వహించాలని ఆయన పోలీస్ సిబ్బందిని ఆదేశించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కాలేజీల్లో ర్యాగింగ్, వేధింపులు లేకుండా యాజమాన్యాలు చర్యలు తీసుకోవాలన్నారు.