https://oktelugu.com/

Saripodhaa Sanivaaram Collection: ‘సరిపోదా శనివారం’ మొదటి రోజు వసూళ్లు..బ్రేక్ ఈవెన్ కి ఈ వసూళ్లు సరిపోవు అంటున్న ట్రేడ్!

నైజాం ప్రాంతం లో ఉండే ఆడియన్స్ లో నాని కి మంచి క్రేజ్ ఉంది. అలాంటి ప్రాంతంలో టాక్ వస్తే ఇక ఏ రేంజ్ లో ఉంటుందో ఊహించుకోవచ్చు. ఆ అంచనాలకు తగ్గట్టుగానే ఈ సినిమా మొదటిరోజు 2 కోట్ల 75 లక్షల రూపాయల షేర్ వసూళ్లు వచ్చాయి.

Written By:
  • Vicky
  • , Updated On : August 30, 2024 / 01:03 PM IST

    Saripodhaa Sanivaaram

    Follow us on

    Saripodhaa Sanivaaram Collection: నేచురల్ స్టార్ నాని హీరో గా నటించిన ‘సరిపోదా శనివారం’ చిత్రం నిన్న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదలై మొదటి ఆట నుండే బ్లాక్ బస్టర్ హిట్ టాక్ ని సొంతం చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. థియేట్రికల్ ట్రైలర్ తో విపరీతంగా అంచనాలను పెంచేసిన ఈ చిత్రం, ఆ అంచనాలను అందుకోవడం లో సక్సెస్ అయ్యింది. ఓపెనింగ్స్ కూడా బాగానే వచ్చాయి కానీ, ఆశించిన స్థాయిలో అయితే రాలేదని ట్రేడ్ పండితుల అభిప్రాయం. A సెంటర్స్ లో మంచి ఓపెనింగ్స్ వచ్చాయి కానీ, క్రింది సెంటర్స్ లో మాత్రం మ్యాట్నీ నుండి బాగా డ్రాప్ అయ్యాయి. నాని కి క్లాస్ ఆడియన్స్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండడం, సినిమా కూడా వాళ్లకు నచ్చే విధంగా ఉండడంతో A సెంటర్స్ ఓపెనింగ్స్ అదిరాయి. ఓవరాల్ గా ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం ఎంత వసూళ్లను రాబట్టిందో ఇప్పుడు మనం చూద్దాం.

    నైజాం ప్రాంతం లో ఉండే ఆడియన్స్ లో నాని కి మంచి క్రేజ్ ఉంది. అలాంటి ప్రాంతంలో టాక్ వస్తే ఇక ఏ రేంజ్ లో ఉంటుందో ఊహించుకోవచ్చు. ఆ అంచనాలకు తగ్గట్టుగానే ఈ సినిమా మొదటిరోజు 2 కోట్ల 75 లక్షల రూపాయల షేర్ వసూళ్లు వచ్చాయి. అలాగే సీడెడ్ ప్రాంతం లో 74 లక్షల రూపాయల షేర్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమా, ఉత్తరాంధ్ర లో 77 లక్షలు, తూర్పు గోదావరి జిల్లాలో 33 లక్షల రూపాయిలు, పశ్చిమ గోదావరి జిల్లాలో 32 లక్షలు, గుంటూరు జిల్లాలో 32 లక్షలు, కృష్ణ జిల్లాలో 41 లక్షలు, నెల్లూరు జిల్లాలో 24 లక్షల రూపాయల షేర్ వసూళ్లను రాబట్టింది. ఓవరాల్ గా ఆంధ్ర ప్రదేశ్ తెలంగాణ కలిపి 5 కోట్ల 88 లక్షల రూపాయల షేర్ వసూళ్లు వచ్చాయి. ఇది నాని ‘దసరా’ చిత్రం ఓపెనింగ్స్ లో సగం కూడా కాదు. ‘దసరా’ చిత్రానికి రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి 14 కోట్ల రూపాయల షేర్ వసూళ్లు వచ్చాయి, అలాగే ఆయన హీరో గా నటించిన MCA చిత్రానికి 7 కోట్ల 14 లక్షల రూపాయల షేర్ వసూళ్లు రాగా, ‘సరిపోదా శనివారం’ చిత్రం 5 కోట్ల 88 లక్షల రూపాయల షేర్ వసూళ్లతో నాని కెరీర్ లో టాప్ 3 గా నిల్చింది.

    తెలుగు రాష్ట్రాల నుండి కాకుండా, ఈ సినిమాకి కర్ణాటక, చెన్నై మొదలగు ప్రాంతాలను కలుపుకొని 1 కోటి 10 లక్షల రూపాయల షేర్ వసూళ్లు రాగా, ఓవర్సీస్ లో ఏకంగా 4 కోట్ల 40 లక్షల రూపాయల షేర్ వసూళ్లు వచ్చాయి. మొత్తం మీద ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకి 11 కోట్ల 38 లక్షల రూపాయల షేర్ వసూళ్లు వచ్చాయి. 42 కోట్ల రూపాయిల ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ ని జరుపుకున్న ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే మరో 30 కోట్లు రాబట్టాలి. అంత రాబట్టాలంటే ఈ ఓపెనింగ్ వసూళ్లు సరిపోవని ట్రేడ్ పండితులు అంటున్నారు, వీకెండ్ లో ఎంత వసూళ్లను రాబడుతుందో చూడాలి.