Homeఆంధ్రప్రదేశ్‌YSR Congress : ఉత్తరాంధ్ర వైసీపీకి కొత్త బాస్ ఎవరు.. రేసులో ఆ ముగ్గురు!

YSR Congress : ఉత్తరాంధ్ర వైసీపీకి కొత్త బాస్ ఎవరు.. రేసులో ఆ ముగ్గురు!

YSR Congress : వైసిపి ( YSR Congress ) ఉత్తరాంధ్ర కోఆర్డినేటర్ ఎవరు? ఎవరిని నియమిస్తారు? విజయసాయిరెడ్డి రాజీనామాతో ప్రస్తుతం ఆ పదవి ఖాళీగా ఉంది. ఇంతవరకు భర్తీ చేయలేదు. అయితే వైసిపి ఆవిర్భావం నుంచి ఈ ప్రాంతానికి రీజినల్ కోఆర్డినేటర్ పదవి దక్కడం లేదు. అందుకే స్థానికులకే ఇవ్వాలన్న ప్రధాన డిమాండ్ ఇప్పుడు వస్తోంది. విజయసాయిరెడ్డి రాజీనామా చేసిన వెంటనే ఉత్తరాంధ్ర నేతలు సంబరపడిపోయారు. సంబరాలు చేసుకున్నారు. ఇక ఆ పదవి తమదేనంటూ భావించారు. అయితే హై కమాండ్ మాత్రం రకరకాల సమీకరణలను పరిగణలోకి తీసుకుంటుంది. దీంతో ఈ పదవి కోసం లోకల్ వర్సెస్ నాన్ లోకల్ అన్నట్టు పరిస్థితి మారింది. కానీ అతి త్వరలో ఈ నియామకానికి సంబంధించి ఉత్తర్వులు రానున్నట్లు తెలుస్తోంది.

* ధర్మాన బ్రదర్స్ పేరు ప్రముఖంగా..
అయితే ఉత్తరాంధ్ర( North Andhra) రీజనల్ కోఆర్డినేటర్ పదవిని స్థానిక నేతలకు ఇస్తే మాత్రం ముగ్గురు పోటీ పడుతున్నారు. అందులో మాజీ మంత్రులు బొత్స సత్యనారాయణ, గుడివాడ అమర్నాథ్, ధర్మాన ప్రసాదరావు పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ప్రధానంగా ధర్మాన ప్రసాదరావు పేరు తెరపైకి వచ్చింది. ఆయన ఈ ఎన్నికల ఫలితాల తరువాత సైలెంట్ అయ్యారు. పార్టీ కార్యక్రమాలకు హాజరుకావడం లేదు. అధినేత జగన్ ఇచ్చిన పిలుపులకు కూడా స్పందించడం లేదు. అటువంటి నేతకు ఉత్తరాంధ్ర కోఆర్డినేటర్ పదవి ఇస్తే న్యాయం చేయగలరా? అన్న అనుమానాలు ఉన్నాయి. అయితే ఆయన సోదరుడు, మాజీమంత్రి ధర్మాన కృష్ణ దాస్ పేరు కూడా తెరపైకి వచ్చింది. కానీ ఎందుకో హై కమాండ్ వీరిద్దరి విషయంలో వెనక్కి తగ్గింది.

* అమర్నాథ్ పేరు వచ్చినా
విశాఖకు చెందిన మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ( Gudivada Amarnath) పేరు ప్రముఖంగా వినిపించింది. విశాఖ కేంద్రంగా ఉండడంతో ఆయన అయితే సరిపోతారని ఒక అంచనాకు వచ్చింది హై కమాండ్. అయితే ఆయన పార్టీ శ్రేణులతో అంతగా మమేకం కాకపోవడం మైనస్ గా మారింది. కేవలం ప్రత్యర్థులపై రాజకీయ విమర్శలు చేయడంలో ముందంజలో ఉంటారు. కానీ నేతలతో పాటు క్యాడర్ను అంతగా కోఆర్డినేట్ చేయలేరు అన్న విమర్శ ఉంది. అందుకే ఆయనను పక్కకు తప్పించినట్లు తెలుస్తోంది.

* బొత్స పేరు ఫిక్స్
మరోవైపు బొత్స సత్యనారాయణ కు( botsa Satyanarayana ) ఉత్తరాంధ్ర ఇన్చార్జి పదవి ఇస్తారని తెగ ప్రచారం నడుస్తోంది. అయితే ఉత్తరాంధ్రలో బొత్స ప్రభావితం చేయగలరు. ఆయన ఈ పదవిపై ఎప్పటినుంచో ఆశలు పెట్టుకున్నారు. కానీ అధినేత జగన్ మాత్రం ఉభయగోదావరి జిల్లాల బాధ్యతలు అప్పగించారు. ఉత్తరాంధ్రలో బొత్స సామాజిక వర్గం అధికం. ఆపై ఉమ్మడి జిల్లాలపై పట్టు ఉంది. గతంలో విజయనగరం తో పాటు శ్రీకాకుళం జిల్లాల ఇన్చార్జిగా కూడా వ్యవహరించారు. అందుకే బొత్స పేరు ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. అయితే బొత్స కు ఇస్తే ఉత్తరాంధ్రలో తన సొంత అజెండాతో ముందుకు వెళ్తారు అన్న భయం జగన్మోహన్ రెడ్డిలో ఉంది. ఇప్పటికే ఆయనకు విశాఖ స్థానిక సంస్థల నుంచి ఎమ్మెల్సీగా ఛాన్స్ ఇచ్చారు. మరోసారి ఇన్చార్జ్ పదవి ఇస్తే ఆయన తమను డామినేట్ చేస్తాడు అన్న భయం ఉంది. అందుకే చివరి నిమిషంలో కడప ఎంపీ అవినాష్ రెడ్డి పేరు తెరపైకి తెచ్చిన ఆశ్చర్యపోనవసరం లేదని వైసిపి వర్గాల్లో ప్రచారం నడుస్తోంది. చూడాలి ఏం జరుగుతుందో?

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Exit mobile version