HomeతెలంగాణHyderabad : హైదరాబాద్‌లో కోటి లోపు ఇళ్లకే అంత డిమాండ్‌ ఎందుకొచ్చింది అంటే..!

Hyderabad : హైదరాబాద్‌లో కోటి లోపు ఇళ్లకే అంత డిమాండ్‌ ఎందుకొచ్చింది అంటే..!

Hyderabad :  హైదరాబాద్‌లో స్థిరాస్థి వ్యాపారం మళ్లీ పుంజుకుంటోంది. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడినాక క్రయ విక్రయాలు నిలిచిపోయాయి. మరోవైపు హైడ్రా ఏర్పాటుతో భూములు, ఇళ్ల విక్రయాలు గణనీయంగా తగ్గాయి. దీంతో ప్రభుత్వానికి రిజిస్ట్రేషన్‌ ఆదాయం తగ్గిపోయింది. దీంతో ప్రభుత్వం హైడ్రా దూకుడుకు కల్లె వేసింది. దీంతో ఇప్పుడిప్పుడే మళ్లీ స్థిరాస్తి వ్యాపారం కుదుట పడుతోంది. భూములు, ఇళ్ల విక్రయాలు పుంజుకుంటున్నాయి. ఈ క్రమంలో రిజిస్ట్రేషన్‌ ఆదాయం కూడా పెరిగింది. హైదరాబాద్‌లో నివాస గృహాల మార్కెట్‌ స్థిరంగా ఉన్నట్లు స్థిరాస్తి కన్సెల్టింగ్‌ సేవల సంస్థ ‘స్క్వేర్‌ యార్డ్స్‌’ తాజా నివేదిక తెలిపింది. గతేడాది 75,512 ఇళ్లు/ప్లాట్లు/విల్లాల అమ్మకాలు ననమోదైనట్లు వివరించింది. 2023లో అమ్ముడైన 74,495 ఇళ్లతో పోలిస్తే ఒక శాతం అధికమని తెలిపింది. విలువ పరంగా చూస్తే రూ.39,949 కోట్ల నుంచి 13 శాతం పెరిగి రూ.45,190 కోట్కు చేరిందని వెల్లడించింది. గతేడాది అమ్ముడైన ఇళ్లు/ప్లాట్ల సగటు విలువ రూ.60 లక్షలు.

హైడ్రా ఎఫెక్ట్‌..
హైదరాబాద్‌లో ఇళ్ల కొనుగోలు విషయంలో కొనుగోలుదారులు ఈసారి చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. హైడ్రా నేపథ్యంలో నిబంధనలు పూర్తిగా తెలుసుకున్నాక, వివరాలు సమగ్రంగా పరిశీలించిన తర్వాత, వాస్తవాలు నిర్ధారించుకుని తుది నిర్ణయానికి వస్తున్నారు. దీంతో అమ్మకాలు కాస్త తగ్గినట్లు నివేదిక తెలిపింది. 2024 అక్టోబర్‌–డిసెంబర్‌ త్రైమాసికంలో ఇళ్ల అమ్మకాలు 18 శాతం తగ్గాయని పేర్కొంది.

రూ.కోటి లోపు ఇళ్లు ఎక్కువగా..
ఇక హైదరాబాలో కొనుగోలు దారులు 1,000 నుంచి 1,500 చదరవపు అడుగుల విస్తీర్ణం, రూ.50 లక్షల నుంచి రూ.1కోటి మధ్య ధర ఉన్న ఇళ్లు/ప్లాట్లు కొనుగోలు చేసేందుకే ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. కోటి దాటితే అమ్మో అంటున్నారు. ఇతర ప్రాంతాలో పోలిస్తే పశ్చిమ హైదరాబాద్‌లో ఇళ్ల ధరలు అధికంగా ఉన్నాయి. క్రయవిక్రయాలు ఈ ప్రాంతంలోనే ఎక్కువగా జరుగుతుఆన్నయి. సమీప భవిష్యత్‌లో ఇళ్ల నిర్మాణాలు, క్రయవిక్రాయలు పెరిగే అవకాశం ఉంది. ఐటీ పార్కులు, జీసీసీలు, డేటా సెంటర్ల ఏర్పాటు, రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన మౌలిక సదుపాలయాల ప్రాజెక్టులతో ఇళ్లకు గిరాకీ పెరిగిందని నివేదిక వెల్లడించింది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Exit mobile version