https://oktelugu.com/

AP Pensions: ఏపీలో వారి పింఛన్లు కట్.. ప్రభుత్వం సంచలన నిర్ణయం!

ఏపీ ప్రభుత్వం( AP government) మరో సంచలన నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది. ముఖ్యంగా బోగస్ పింఛన్లు అన్నవి లేకుండా చేయాలని భావిస్తోంది.

Written By:
  • Dharma
  • , Updated On : January 15, 2025 / 10:20 AM IST

    AP Pensions

    Follow us on

    AP Pensions: బోగస్ పింఛన్లపై( bogus pentions) ప్రభుత్వం దృష్టి పెట్టింది. కోతే లక్ష్యంగా పావులు కదుపుతోంది.కూటమి ప్రధాన హామీల్లో పింఛన్ల పెంపు ఒకటి. అధికారంలోకి వచ్చిన వెంటనే నాలుగు వేల రూపాయలకు పింఛన్ మొత్తం పెంచుతానని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఆ హామీ మేరకు పింఛన్ మొత్తాన్ని పెంచి అమలు చేస్తున్నారు. అయితే కొత్త పింఛన్ల జోలికి మాత్రం ఇంతవరకు వెళ్ళలేదు. ఇప్పుడున్న వారిలో చాలామంది అనర్హులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ప్రభుత్వానికి నివేదించారు. ముఖ్యంగా దివ్యాంగులకు సంబంధించి పింఛన్ల విషయంలో భారీగా అనర్హులు ఉన్నట్లు గుర్తించారు. అందుకే వైకల్య శాతాన్ని గుర్తించేందుకు ప్రత్యేక తనిఖీ చేస్తున్నారు. ప్రత్యేక వైద్యుల బృందం లబ్ధిదారుల ఇంటికి వెళ్లి వారి వైకల్య శాతాన్ని పరిశీలిస్తోంది. ఆరు దశల్లో పింఛన్ లబ్ధిదారుల వైద్య నిర్ధారణ పరీక్షలు జరిపి.. అనర్హులు ఉంటే తొలగించాలని భావిస్తోంది ప్రభుత్వం.

    * ఫిర్యాదుల వెల్లువ
    గత ఐదేళ్ల వైసిపి( YSR Congress ) హయాంలో వికలాంగ పింఛన్లకు సంబంధించి పెద్ద ఎత్తున అనర్హులకు అందించారని ఆరోపణలు ఉన్నాయి. దీనిపై ఫిర్యాదులు కూడా వచ్చాయి. దీంతో పైలెట్ ప్రాజెక్టుగా భావిస్తూ ఎంపిక చేసిన సచివాలయాల్లో ప్రత్యేక సర్వే చేసింది ప్రభుత్వం. పెద్ద ఎత్తున బోగస్ పింఛన్లు వెలుగులోకి వచ్చాయి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా తనిఖీ చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రత్యేక వైద్య బృందాలను రంగంలోకి దించింది. అనర్హుల ఏరివేత టార్గెట్ చేసుకొని ఈ తనిఖీ కొనసాగుతోంది.

    * తప్పుడు ధ్రువపత్రాలు
    ఎక్కడికక్కడే వైద్యులు వైకల్య శాతాన్ని పెంచుతూ సదరం సర్టిఫికెట్లు ( Sadharan certificate )జారీ చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. అప్పట్లో వైసీపీ నేతల ఒత్తిడితో కొందరు వైద్యులు, వైద్యాధికారులు సదరం సర్టిఫికెట్లు జారీ చేశారు. అందులో వైకల్య శాతాన్ని అధికంగా రాశారు. తాజాగా తనిఖీల్లో అదే అంశం బయటపడుతోంది. మంచానికే పరిమితమైన దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు ప్రభుత్వం మందుల ఖర్చు కింద నెలకు 15 వేల రూపాయలు అందిస్తోంది. అయితే ఈ రకం పింఛన్ల విషయంలో భారీగా అనర్హులు ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు పక్షవాతం వంటి వ్యాధులతో బాధపడుతూ ఇంటి వద్ద ఉంటున్న వారికి పదివేల రూపాయలు అందిస్తున్నారు. ఈ భాగంలో సైతం బోగస్ పింఛన్లు ఉన్నట్లు తెలుస్తోంది. 6000 రూపాయల పింఛన్ తీసుకుంటున్న వికలాంగుల విషయంలో కూడా అనర్హులు ఉన్నట్లు సమాచారం. వీటన్నింటిపై ఫుల్ క్లారిటీ రానుంది.

    * ఇతర రాష్ట్రాల్లో ఉన్నవారికి..
    మరోవైపు చాలామంది లబ్ధిదారులు ఇతర రాష్ట్రాల్లో( out of States) ఉంటున్నారు. ఇతర దేశాల్లో ఉన్నవారు సైతం పింఛన్లు పొందుతున్నట్లు తెలుస్తోంది. అటువంటి వారిపై ప్రత్యేక సర్వే చేపట్టారు. కేరళ తర్వాత అత్యధికంగా విదేశాల్లో ఉంటున్న వారిలో ఏపీ వారు అధికం. అందుకే ఇలా విదేశాలకు వెళ్లి ఉపాధి పొందుతున్న చాలామంది పింఛన్లు పొందుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అందుకే ఆ జాబితాల నుంచి అనర్హుల పేర్లు తొలగించేందుకు ప్రభుత్వం సిద్ధపడుతున్నట్లు తెలుస్తోంది.