ఈ మధ్య కాలంలో అమాయక ప్రజలను టార్గెట్ చేసి మోసగాళ్లు చేస్తున్న మోసాలకు అడ్డూఅదుపు లేకుండా పోయింది. మాయమాటలు చెప్పి ఆశ చూపి కొందరు కేటుగాళ్లు నమ్మిన వాళ్లను నిలువునా ముంచేస్తున్నారు. వాళ్లు చేసిన మోసాలు వెలుగులోకి వస్తే మరో కొత్త మార్గంలో ప్రజలను బురిడీ కొట్టిస్తున్నారు. మనుషుల నమ్మకాలనే పెట్టుబడిగా మార్చుకుని మోసాలకు పాల్పడుతున్నారు. ఏపీలో ఒక ముఠా మాయ సొరకాయల పేరుతో భక్తులను మోసం చేస్తోంది.
Also Read: పది పైసలకే టేస్టీ బిర్యానీ.. కిలోమీటర్ల మేర క్యూ కట్టిన జనం..?
తాజాగా కర్నూలు జిల్లాలో వెలుగులోకి వచ్చిన మోసం గురించి తెలిస్తే ఇలా కూడా మోసం చేస్తారా..? అని ఆశ్చర్యం కలగక మానదు. కర్నూలు జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఒకటైన శ్రీశైలంలో కొందరు మోసగాళ్లు సాధారణ సొరకాయలకు భిన్నంగా ప్రత్యేక ఆకారంలో ఉండే సొరకాయలను అమ్మసాగారు. భక్తులకు వాళ్లు సొరకాయలలో ఎన్నో ప్రత్యేక శక్తులు ఉన్నాయని.. ఈ సొరకాయలు మాయ సొరకాయలని.. నల్లమల అడవుల్లో పెరిగే ఈ సొరకాయలు కొంటే సంపద వృద్ధి చెందుతుందని నమ్మించారు.
ఆత్మకూరు ఎస్సై నాగేంద్ర తెలిపిన వివరాల ప్రకారం ఒక్కొక్కరి నుంచి మోసగాళ్లు లక్షల రూపాయల నుంచి 2 కోట్ల రూపాయల వరకు వసూలు చేసినట్లు తెలుస్తోంది. సొరకాయలను కొనుగోలు చేసి మోసపోయిన వారిలో ఏపీకి చెందిన వారితో పాటు తెలంగాణకు చెందిన వారు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. శ్రీశైలం అన్నపూర్ణ దేవి ఆశ్రమానికి ఈ మోసాలకు లింకులు ఉన్నాయని సమాచారం.
Also Read: ఈ సంవత్సరం బడులు తెరవడం కష్టమేనా..?
పోలీసులు సెక్షన్ 420 కింద కేసు నమోదు చేసుకుని 21 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసుతో సంబంధం ఉన్న మరికొంత మంది నిందితులు పరారీలో ఉండగా పోలీసులు వారి కోసం గాలిస్తున్నారు. పాముల ముందు ఊదే నాగస్వరం ఆకారంలో ఉండే సొరకాయల పేరుతో మోసగాళ్లు మోసాలకు పాల్పడ్డారు.