Ex MLA Raapaaka Varaprasad : జనసేనలో చేరేందుకు నేతలు క్యూ కడుతున్నారు. ముఖ్యంగా టిడిపి ఆప్షన్ లేని వారు జనసేన వైపు మొగ్గు చూపుతున్నారు. 2029 నాటికి నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుందని భావిస్తున్నారు. అందులో భాగంగా జనసేనకు సీట్లు పెరుగుతాయని అంచనాకు వస్తున్నారు. ఆ భావనతోనే ఎక్కువమంది జనసేన వైపు ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల్లో వైసిపి దారుణ పరాజయం చవిచూసింది. ఆ పార్టీకి భవిష్యత్తు లేదని భావిస్తున్న వారు పక్క చూపులు చూస్తున్నారు. ఇప్పటికే చాలామంది బయటకు వచ్చారు. కూటమి పార్టీల్లో చేరారు. మరికొందరు చేరేందుకు సిద్ధంగా ఉన్నారు. అయితే జనసేనలో చేరే వైసిపి నేతల విషయంలో చాలా రకాల అభ్యంతరాలు వస్తున్నాయి. ఇప్పటికే ప్రకాశం జిల్లాకు చెందిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి రాకను సొంత జిల్లా నేతలు వ్యతిరేకిస్తున్నారు. అందుకే ఆయన సాదాసీదాగానే పార్టీలో చేరారు. ఎటువంటి ఆర్భాటం చేయలేదు. మరో మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను సైతం జనసేనలో కార్యక్రమంలో అనేక రకాల అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. తాజాగా మాజీ ఎమ్మెల్యేరాపాక వరప్రసాద్ జనసేనలో చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రచారం సాగుతోంది.ఈ నేపథ్యంలో ఓ సభలో జనసైనికులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ నినాదాలు చేశారు.పార్టీనాయకత్వానికి కీలక సూచనలు చేశారు. రాపాకను పార్టీలో చేర్చుకోవద్దని కోరారు.
* ఏకైక శాసనసభ్యుడిగా..
2019 ఎన్నికల్లో జనసేన ఒకే ఒక స్థానాన్ని గెలుచుకుంది.పవన్ కళ్యాణ్ రెండు చోట్ల పోటీ చేశారు.కానీ నిరాశ ఎదురయింది. అయితే రాజోలు నుంచి రాపాక వరప్రసాద్ జనసేన తరఫున గెలిచారు. దీంతో ఐదేళ్లపాటు అసెంబ్లీలో పార్టీ వాయిస్ వినిపిస్తారని జన సైనికులు ఆశించారు. అయితే కొద్ది రోజులకే ఆయన వైసీపీకి దగ్గరయ్యారు. గత ఐదేళ్లుగా వైసీపీ ఎమ్మెల్యే గానే కొనసాగారు. ఎన్నికల్లో అమలాపురం పార్లమెంట్ స్థానం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. అప్పటినుంచి సైలెంట్ గా ఉన్నారు. జనసేనలో చేరతారని ప్రచారం సాగింది. అయితే రాజోలులో జరిగిన ఓ సభకు రాపాక వరప్రసాద్ హాజరయ్యారు. అదే సమావేశానికి జనసేన ఎమ్మెల్యే కూడా వచ్చారు. దీంతో ఒక్కసారిగా జనసైనికులు రెచ్చిపోయారు. రాపాక వరప్రసాద్ ను ఎట్టి పరిస్థితుల్లో జనసేనలో చేర్పించుకోవద్దని కోరారు.
* జగన్ మెప్పు పొందేందుకు
జనసేన ఎమ్మెల్యే గా ఉన్న రాపాక వరప్రసాద్ వైసీపీలో చేరారు.జగన్ మెప్పు పొందేందుకు పవన్ కళ్యాణ్ పై కూడా విమర్శలు చేశారు.అనుచిత కామెంట్స్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి.ఇప్పుడు వాటన్నింటినీ గుర్తు చేసుకుంటున్నారు జనసైనికులు. పవన్ పిలిచి మరీ టిక్కెట్ ఇచ్చి గెలిపించుకుంటే.. పార్టీని విడిచిపెట్టిన రాపాక వరప్రసాద్ విషయంలో కఠినంగా ఉండాలనిజనసైనికులు కోరుతున్నారు.మొత్తానికైతేరాపాక వరప్రసాద్ విషయంలో జనసేన జన సైనికుల అభిప్రాయాన్ని తీసుకోకుంటే మాత్రం.. ఇబ్బందికర పరిస్థితులు తలెత్తే అవకాశం ఉంది.