AP Rain Alert: తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు ప్రారంభమయ్యాయి. రుతుపవనాల విస్తరణతో వర్షాలు కురుస్తున్నాయి. ఏపీలో మాత్రం మిశ్రమ వాతావరణం కొనసాగుతోంది. కొన్ని ప్రాంతాల్లో వర్షాలు పడుతుండగా.. మరికొన్నిచోట్ల ఎండలు మండిపోతున్నాయి. భారీ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ తరుణంలోనే వాతావరణ శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. ఏపీలో ఐదు రోజులపాటు వర్షాలు కొనసాగులు ఉన్నాయని స్పష్టం చేసింది. ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో అక్కడక్కడ వర్షాలు కురుస్తున్నాయి. కొన్నిచోట్ల భారీ వర్షాలు కురిస్తే.. మరి కొన్నిచోట్ల తేలికపాటి వర్షాలు పడుతున్నాయి.
పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం జిల్లాలో అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. నిన్న రాత్రి నుంచి విజయవాడలో ఎడతెరిపి లేకుండా వర్షాలు పడుతున్నాయి. అటు తెలంగాణలో సైతం పలు జిల్లాల్లో వర్షం పడింది. గ్రేటర్ హైదరాబాద్ నగరంలో అక్కడక్కడ వర్షం కురుస్తోంది. ఏపీలో మరో ఐదు రోజులపాటు వర్షాలు పడనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణలో సైతం మరో రెండు రోజుల పాటు వర్షాలు కొనసాగుతాయని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ద్రోణి ప్రభావంతో ఉత్తరాంధ్ర జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. అటు కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాలకు సైతం వర్షాలు విస్తరించి ఉన్నాయి. రాబోయే ఐదు రోజుల్లో తేలిక పార్టీ నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది.
కోస్తాంధ్రలో నేడు, రేపు మాస్టర్ నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. ప్రధానంగా పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖ జిల్లాలో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. శ్రీకాకుళం, విజయనగరం, అనకాపల్లి,కాకినాడ, కోనసీమ, ఉభయగోదావరి, ఏలూరు, కృష్ణ, గుంటూరు,ఎన్టీఆర్, బాపట్ల, పల్నాడు, ప్రకాశం,నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, సత్యసాయి, వైయస్సార్, అన్నమయ్య,చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు సముద్ర తీర ప్రాంతాలతో పాటు లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ చెబుతోంది.