Pawankalyan : నాడు విలీన ప్రతిపాదన.. నేడు ఎన్డీఏ బాధ్యతలు.. పవన్ కోరుకున్నది అదే

ఇప్పుడు ఎన్నికలు సమీపించడంతో ఏపీ అవసరాలతో పాటు విపక్ష కూటమి దూకుడుతో పవన్ కు ఎనలేని గౌరవం అందుతోంది. పార్టీని విలీనం చేయమని కోరిన అమిత్ షాయే.. ఇప్పుడు దక్షణాది రాష్ట్రాల ఎన్డీఏ కన్వీనర్ బాధ్యతలు అప్పగించడం నిజంగా గొప్ప విషయమే కదా.. పవన్ కోరుకున్నది అదే కదా?  

Written By: Dharma, Updated On : July 20, 2023 11:43 am
Follow us on

Pawankalyan : ఏపీ పొలిటికల్ సర్కిల్ లో ఓ వార్త చక్కెర్లు కొడుతోంది. ఎన్డీఏలో పవన్ కు కీలక బాధ్యతలు అప్పగించేందుకు మోదీ, షా ద్వయం నిర్ణయించినట్టు సమాచారం. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల సమావేశానికి పవన్ హాజరైన సంగతి తెలిసిందే. తొలిరోజు సమావేశం అనంతరం పవన్ బీజేపీ అగ్రనేతలతో సమావేశమవుతూ వస్తున్నారు. ఏపీ రాజకీయాలతో పాటు దేశ వ్యాప్తంగా ఎన్డీఏ బలోపేతానికి తీసుకోవాల్సిన అంశాలపై వారితో చర్చిస్తున్నారు. అయితే ఏపీతో పాటు దక్షిణాది రాష్ట్రాల బాధ్యతను పవన్ కు అప్పగించాలని అగ్రనేతలు సీరియస్ గా ఆలోచిస్తున్నట్టు సమాచారం.

ప్రస్తుతం విపక్ష కూటమి స్ట్రాంగ్ గా మారుతోంది. ఎట్టి పరిస్థితుల్లో మోడీని మూడోసారి గట్టెక్కనివ్వమని గట్టిగానే చెబుతోంది. కాంగ్రెస్ పార్టీ తమకు ప్రధాని పదవి అక్కర్లేదని కాక రేపుతోంది. 26 పార్టీతో బలంగా కనిపిస్తున్న విపక్ష ‘ఇండియా’ కూటమి బీజేపీని కాస్తా కలవరపాటుకు గురిచేస్తోంది. అందుకే మోదీ, షా ద్వయం ఎన్డీఏ భాగస్వామ్య పార్టీల సమావేశాన్ని ఏర్పాటుచేసింది. దేశ వ్యాప్తంగా ఎన్డీఏ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలు గురించి చర్చించారు. అందులో భాగంగా చేర్పులు, మార్పులు చేయాలని డిసైడయ్యారు. ఎన్డీఏ భాగస్వామ్య పార్టీల్లో బలమైన నాయకులను గుర్తించి కీలక బాధ్యతలు కట్టబెడుతున్నారు.

పవన్ కు దక్షిణాదిలో ఐదు రాష్ట్రాల బాధ్యతలు అప్పగించనున్నట్టు తెలుస్తోంది. ఏపీ, తెలంగాణ, కర్నాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాల బాధ్యతలను అప్పగించి ఎన్డీఏను బలోపేతం చేయాలన్నది మోదీ, షా ద్వయం టార్గెట్. అయితే దక్షాణాది రాష్ట్రాల ఎన్డీఏ కన్వీనరా? లేక ప్రచార కమిటీ కన్వీనరా? అన్నది ఇంతవరకూ స్పష్టత లేదు. అయితే ఏదో ఒకటి ఖాయమన్నట్టు సమాచారం. ఇప్పుడు ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల్లో చరిష్మ ఉండే నాయకుల్లో పవనే కనిపిస్తున్నారు. దీంతో ఆయన ఎంపిక భారతీయ జనతా పార్టీకి అనివార్యంగా మారింది. విపక్ష కూటమిని ఎదుర్కొనే పరిస్థితిలో బీజేపీ నాయకులెవరూ లేకపోవడంతో ఆ స్థానాన్ని పవన్ కు అప్పగించనున్నట్టు సమాచారం.

రాజకీయాలు అన్నాక ఎత్తూ పల్లాలే ఉంటాయి. ఒడిదుడుకులు ఉంటాయి. అయితే ఇప్పటివరకూ గెలుపు రుచి చూడని పవన్ విషయంలో అది కాస్తా అధికమే. 2018లో జనసేనను బీజేపీలో విలీనం చేయాలని ఇదే అమిత్ షా కోరినట్టు వార్తలు వచ్చాయి. 2019 ఎన్నికల సమయంలో బీజేపీ నుంచి విడిపోయిన పవన్ ఇదే చెప్పుకొచ్చారు. అంతవరకూ ఎప్పుడుపడితే అప్పడు అపాయింట్మెంట్ ఇచ్చే అమిత్ షా .. 2019 ఎన్నికల తరువాత ఇవ్వడం మానేశారు. 2020లో బీజేపీతో పొత్తు కుదిరినా పవన్ కు అంతంతమాత్రమే ప్రయారిటీ దక్కేది. అయితే ఇప్పుడు ఎన్నికలు సమీపించడంతో ఏపీ అవసరాలతో పాటు విపక్ష కూటమి దూకుడుతో పవన్ కు ఎనలేని గౌరవం అందుతోంది. పార్టీని విలీనం చేయమని కోరిన అమిత్ షాయే.. ఇప్పుడు దక్షణాది రాష్ట్రాల ఎన్డీఏ కన్వీనర్ బాధ్యతలు అప్పగించడం నిజంగా గొప్ప విషయమే కదా.. పవన్ కోరుకున్నది అదే కదా?