Homeక్రీడలుDoping Test : డోపింగ్ టెస్ట్ అంటే భయపడుతున్న భారత క్రికెటర్లు.. జాబితాలో కోహ్లీ.. ఎందుకిలా?

Doping Test : డోపింగ్ టెస్ట్ అంటే భయపడుతున్న భారత క్రికెటర్లు.. జాబితాలో కోహ్లీ.. ఎందుకిలా?

Doping Test :  భారత క్రికెట్ జట్టులోని కీలక ఆటగాళ్లు డోపింగ్ టెస్ట్ కు దూరంగా ఉంటున్నారు. డోపింగ్ టెస్ట్ అంటేనే చాలామంది ఆటగాళ్లు హడలిపోతున్నారు. ఇందులో బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ పొందిన ఆటగాళ్లు ఉండడం సర్వత్ర చర్చనీయాంశంగా మారింది. సమాచార హక్కు చట్టం కింద ఒక వ్యక్తి ఈ వివరాలను అడగగా.. డోపింగ్ టెస్ట్ కు దూరంగా ఉంటున్న ఆటగాళ్లు వివరాలు బయటకు వచ్చాయి. డోపింగ్ టెస్ట్ కు ఆటగాళ్లు ఎందుకు దూరంగా ఉంటున్నారు..? డోపింగ్ టెస్ట్ చేయించుకోకుండా ఉన్న ఆటగాళ్లను ఎందుకు క్రికెట్ ఆడని ఇస్తున్నారు అన్న ప్రశ్నలు ప్రస్తుతం క్రికెట్ వర్గాలను వేధిస్తున్నాయి.

క్రీడాకారులు ఏదైనా పోటీలో పాల్గొనేందుకు వెళ్లే ముందు  స్టెరాయిడ్స్ తీసుకుంటారేమోనన్న ఉద్దేశంతో డోపింగ్ టెస్ట్ నిర్వహిస్తుంటారు. స్టెరాయిడ్స్ తీసుకునే క్రీడాకారుడు శరీరంలో హిమోగ్లోబిన్ లెవెల్స్ భారీగా పెరుగుతుంటాయి. దీనివల్ల సదరు క్రీడాకారుడి పెర్ఫార్మన్స్ ఆటోమేటిక్ గా పెరిగిపోతుంది. దీనివల్ల అతడి కాన్ఫిడెన్స్ పెరగడంతోపాటు ఒళ్ళు నొప్పులు వంటి సమస్యలు కూడా వేధించవు. ఇలా డోపింగ్ కు పాల్పడి క్రీడల్లో పాల్గొనే వారికి చెక్ చెప్పేందుకు వరల్డ్ యాంటీ డోపింగ్ ఏజెన్సీని ఏర్పాటు చేశారు. ఎవరైనా డోపింగుకు పాల్పడ్డారన్న విషయం తెలిస్తే ఈ ఏజెన్సీ వెంటనే వారికి పరీక్షలు నిర్వహించి తేలుస్తుంది. ఈ పరీక్షల్లో డోపింగుకు పాల్పడినట్లు తేలితే కఠిన చర్యలు తీసుకుంటారు డొపింగ్ ఏజెన్సీ అధికారులు. అయితే, భారత క్రికెట్ జట్టుకు చెందిన పలువురు క్రీడాకారులు గత కొన్నాళ్లుగా డోపింగ్ టెస్ట్ చేయించుకోవడమే లేదు. ఇదే ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. 2021 – 22 మధ్య నేషనల్ యాంటీ డొపింగ్ ఏజెన్సీ (నాడా) తగినన్ని డోప్ పరీక్షలు నిర్వహించలేదని ప్రపంచ డోపింగ్ నిరోధక ఏజెన్సీ (వాడా) ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే డోప్ టెస్ట్ చేయించుకున్న అథ్లెట్లు, ఆటగాళ్ల వివరాలు తెలుసుకునేందుకు ఓ జాతీయ ఛానల్ సమాచార హక్కు చట్టం కింద నాడాను కోరగా సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
ఆరుసార్లు డోపింగ్ టెస్ట్ చేయించుకున్న రోహిత్ శర్మ..
నాడా ఇచ్చిన నివేదిక ప్రకారం 2021 – 22 మధ్య రెండేళ్ల కాలంలో 5961 మంది భారత క్రీడాకారులకు డోపింగ్ పరీక్షలు నిర్వహించారు. వీరిలో 114 మంది భారత క్రికెటర్లు కాగా, 1717  మంది అథ్లెట్లు, ఇతర క్రీడాకారులు ఉన్నారు. అయితే క్రికెట్ ఆటగాళ్ల విషయానికొస్తే రోహిత్ శర్మ గడిచిన రెండేళ్లలో అత్యధికంగా ఆరుసార్లు చేయించుకున్నాడు. టీమిండియా కెప్టెన్గా రోహిత్ 2021 టి20 వరల్డ్ కప్ తర్వాత బాధ్యతలు తీసుకున్నాడు. గాయాల వల్ల రోహిత్ శర్మ అనేక మ్యాచులకు దూరమయ్యాడు. అదే సమయంలో కరోనా బారిన పడ్డాడు. కరోనా నుంచి కోలుకునేందుకు మందులు వాడిన తర్వాత డోప్ టెస్ట్ కు శాంపుల్స్ ఇవ్వడం తప్పనిసరి కావడంతో ఆరుసార్లు రోహిత్ శర్మ హాజరుకావాల్సి వచ్చింది. క్రికెటర్లలో అత్యధిక సార్లు డొపింగ్ టెస్ట్ చేసుకున్న ఆటగాడిగా రోహిత్ శర్మ నిలిచాడు. అదే సమయంలో రిషబ్ పంత్, సూర్య కుమార్ యాదవ్, చటేశ్వర పూజార వంటి ఏడుగురు ఆటగాళ్లు ఒక్కసారి మాత్రమే డోప్ టెస్ట్ చేయించుకున్నారు. వీరు కూడా గాయాల బారిన పడిన తరువాత ఈ శాంపిల్స్ ఇచ్చారు.
డోప్ టెస్ట్ కు దూరంగా ఉన్న ఈ కీలక ఆటగాళ్లు..
బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ లో ఉన్న 25 మంది క్రికెటర్లలో 12 మంది డోప్ టెస్ట్ కు శాంపుల్స్ ఇవ్వలేదు. వీరిలో విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యా, మహమ్మద్ షమీ, మహమ్మద్ సిరాజ్, ఉమేష్ యాదవ్, సార్థుల్ ఠాకూర్, అర్షదీప్ సింగ్, శ్రేయాస్ అయ్యర్, దీపక్ హుడా, సంజు సాంసన్, శ్రీకర్ భరత్, వాషింగ్టన్ సుందర్ ఉన్నారు. ఇక భారత మహిళా క్రికెటర్లలో కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్, వైస్ కెప్టెన్ స్మృతి మందాన గరిష్టంగా మూడుసార్లు శాంపుల్స్ ఇచ్చిన వారిలో ఉన్నారు. అసలు టెస్టులు ఎందుకు చేయించుకోవడం లేదు అంటూ క్రికెటర్ల పై అభిమానులు ఈ వివరాలు తెలిసిన తరువాత అసహనం వ్యక్తం చేస్తున్నారు. డొపింగ్ టెస్ట్ అంటే ఎందుకు భారత క్రికెటర్లు భయపడుతున్నారు అర్థం కావడం లేదని, డోపింగ్ టెస్ట్ చేయించుకొని వారిని ఎందుకు క్రికెట్ ఆడని ఇస్తున్నారు అంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు.
Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Exit mobile version