Hidden truth behind EVMs: ఎన్నికలు(elections ) వచ్చిన ప్రతిసారి ఈవీఎంలపై అనుమానాలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. గెలిచిన పార్టీలు ఈవీఎంలను స్వాగతిస్తున్నాయి. ఓడిన పార్టీలు మాత్రం ఈవీఎంలతోనే ప్రత్యర్థులు గెలిచారని గగ్గోలు పెడుతున్నాయి. ఏపీలో 2019లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏకపక్షంగా విజయం సాధించింది. 175 నియోజకవర్గాలకు గాను 151 చోట్ల గెలుపొందింది. అప్పుడు ఓడిపోయిన పార్టీగా ఉన్న తెలుగుదేశం పార్టీ ఈవీఎంలపై అనుమానం వ్యక్తం చేసింది. కానీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మాత్రం అసలు సిసలైన విజయం గా చెప్పుకుంది. 2024 ఎన్నికలకు వచ్చేసరికి సీన్ మారింది. టిడిపి కూటమి ఏకపక్ష విజయం సాధించింది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయేసరికి ఈవీఎంలపై సందేహం వ్యక్తం చేసింది. అయితే ఇప్పుడు ఏకంగా ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల పనితీరుపై వైసిపి నేతల బృందం కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది.
Also Read: కేసీఆర్ తో టిఫిన్ చేసినం.. మల్లా రెడ్డి మళ్లీ ఏసాడు
ఫలితాల తర్వాత ఫిర్యాదులు..
అయితే ఈవీఎంలపై(electronic voting machines ) అనుమానం ఆది నుంచి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి వ్యక్తమౌతూనే వచ్చింది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరుపున ఒంగోలు నుంచి పోటీ చేసిన బాలినేని శ్రీనివాస్ రెడ్డి, విజయనగరం ఎంపీ స్థానానికి పోటీ చేసిన బెల్లాన చంద్రశేఖర్, బొబ్బిలి అసెంబ్లీకి పోటీ చేసిన చిన అప్పలనాయుడు ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేశారు. అయితే ప్రజలు కూడా దీనిని తేలికగా తీసుకున్నారు. ఓడిపోయిన పార్టీ కనుక ఎన్నైనా చెబుతుందని సందేహించారు. అయితే ఇప్పుడు కొన్ని ఆధారాలతో సహా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. పోలైన ఓట్లు.. లెక్కించిన ఓట్లు మధ్య తేడా ఉండడాన్ని ప్రస్తావించారు. ఈవీఎంల పనితీరుపై కూడా సందేహం వ్యక్తం చేశారు.
Also Read: అందర్నీ స్మరించి.. ఒక్కరిని మరిచిన చంద్రబాబు.. కారణమేంటి?
ప్రత్యేకంగా ఆహ్వానించిన ఈసీ
గతంలో ఈవీఎంల పనితీరుపై ఎన్నికల కమిషన్ కు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSR Congress party)ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ పార్టీ నేత వైవి సుబ్బారెడ్డి, లోక్సభ పక్ష నేత మిధున్ రెడ్డి, మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ తదితరులు ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘంతో సమావేశం అయ్యారు. 2024 ఎన్నికల్లో చివరి గంటల్లో అకాస్మాత్తుగా పోలింగ్ శాతం పెరగడం.. అసాధారణంగా ఓటర్లు పెరగడం తదితర అంశాలను ఈసీ దృష్టికి తీసుకెళ్లారు. ఈవీఎంలపై ఉన్న టెక్నికల్ అనుమానాలపై ఈసీకి వివరించారు. ఓటర్ జాబితా, పోలింగ్ సరళి వంటి అంశాలపై చర్చించారు. కొన్ని నియోజకవర్గాల్లో ఈవీఎంల ఓట్లకు, వీవీ ప్యాట్లను పోల్చి చూడాలని చెప్పారు. ఈవీఎంలలో బ్యాటరీలపై సందేహాలు వ్యక్తం చేశారు. ఏపీలో సాయంత్రం 6 గంటల తర్వాత ఎక్కువ నియోజకవర్గాల్లో పోలింగ్ పెరిగిన విషయాన్ని గుర్తు చేశారు. మొత్తానికి అయితే ఆధారాలతో సహా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. మరి అటు నుంచి ఎటువంటి స్పందన వస్తుందో చూడాలి.