Narayanpet: ప్రియుడి మోజులో భర్తల్ని భార్యలు చంపుతున్న ఘటనలు పెరుగుతున్నాయి. నారాయణపేట కోటకొండకు చెందిన అంజిలప్ప తన భార్య రాధ చేతిలో హత్యకు గురైన విషయం తాజాగా పోలీసుల విచారణలో బయటపడింది. రాధకు ఓ యువకుడితో వివాహేతర సంబంధం ఏర్పడింది. అతడితో ఆమె ఫొన్ మాట్లాడుతుండటం చూసి భర్త మందలించాడు. ఈ క్రమంలో గత నెల 23న మద్యం మత్తులో ఉన్న భర్తను భార్య గొంతు నులిమి చంపినట్లు విచారణలో తేలింది.