Ram Gopal Varma: రాంగోపాల్ వర్మ.. గొప్ప క్రియేటివ్ డైరెక్టర్. తన స్క్రీన్ ప్లే,కథలతో సినిమాలు రూపొందించారు. కలెక్షన్ల వర్షం కురిపించారు. బాలీవుడ్లో సైతం తన ప్రభావం చాటుకున్నారు. అయితే క్రమేపి ఆయన రూటు మారింది. రాజకీయ నేపథ్యం ఉన్న సినిమాలు, నేతల బయోగ్రఫీలు తీస్తూ తనను తాను తగ్గించుకున్నారు.అయినా సరే కొంతమందికి ఆయన తీసిన సినిమాలు, ఇంకొంతమందికి ఆయన మాట్లాడే మాటలు, ప్రతి విషయాన్ని లాజిక్ తో జస్టిఫై చేసే ఆయన పరిజ్ఞానానికి చాలామంది అభిమానులు ఉన్నారు. అందుకే రామ్ గోపాల్ వర్మ సినిమాలు తీయడం మానేసినప్పటికీ నిత్యం యూట్యూబ్, టీవీలో చెప్పే మాటలకు కొందరు ఆకర్షితులవుతుంటారు. వాస్తవానికి ఎటువంటి రాజకీయ ప్రభావం లేనప్పుడు రామ్ గోపాల్ వర్మ అంటే మేధావి వర్గంగా భావించారు. ఎప్పుడైతే వైసిపికి వకల్తా పుచ్చుకున్నారో అప్పటినుంచి ఆయనలో తేడా కుట్టింది. కొన్ని కామెంట్లతో పాటు ట్విట్లు సభ్య సమాజం సిగ్గుపడేలా చేశాయి. ఏవేవో కొన్ని పిచ్చి పిచ్చి సినిమాలు పీసీ జనాలపైకి వదిలారు. అవి మరింత పలుచన చేశాయి. అంతటితో ఆగకుండా వైసిపికి మద్దతుగా నిత్యం ట్విట్టర్ కు పని చెప్పేవారు. వైసీపీ కార్యకర్తల మారిపోయి ట్విట్టర్ హ్యాండిల్ నడిపారు. చివరికి మార్ఫింగ్ ఫోటోలను పోస్ట్ చేసుకునే స్థాయికి దిగజారారు. అయితే గత ఐదు సంవత్సరాలుగా ఆయన ఏం చేసినా చెల్లింది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. తనకు అండగా నిలిచే ప్రభుత్వం లేదు. ఇప్పుడు ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నారు రామ్ గోపాల్ వర్మ.
* వివాదాలు కొత్త కాదు
అయితే వివాదాలు అనేవి రామ్ గోపాల్ వర్మకు కొత్త కాదు.ఇలాంటి నోటీసులు చాలా సార్లు ఎదుర్కొన్నారు.కోర్టుల చుట్టూ తిరిగారు. కానీ ఇప్పుడు ఏపీ పోలీసులు ఇచ్చిన నోటీసులు మామూలు కావు. దాని వెనుక ఉన్న కఠిన చర్యలు రామ్ గోపాల్ వర్మ కు తెలియనిది కావు. అందుకే ఆయన ముందు జాగ్రత్తలు తీసుకున్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన మరుక్షణం గతాన్ని మరిచిపోయేలా వ్యవహరించారు. ఫుల్ సైలెంట్ అయ్యారు. ఏపీ రాజకీయాలకు సంబంధించి ఒక్క నెగిటివ్ ట్విట్ కూడా ఆయన అకౌంట్లో ఇప్పుడు కనిపించదు. సినిమా వ్యవహారాలు, అమెరికా ఎన్నికల చుట్టూ ఆయన ట్వీట్లు నడుస్తున్నాయి.
* అధికార మదంతోనే
రాంగోపాల్ వర్మ అధికార మదంతో తెగ రెచ్చిపోయారు. చంద్రబాబు పైనే వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారు. ఆయనను నెగిటివ్ క్యారెక్టర్ లో చూపించి ప్రజల్లో పలుచన చేయాలని భావించారు. సోషల్ మీడియాలో సైతం పదేపదే టార్గెట్ చేస్తూ వచ్చారు. పవన్ కళ్యాణ్ ను సైతం తక్కువ చేసి మాట్లాడారు. నోటికి అడ్డు అదుపు లేకుండా కామెంట్స్ చేసేవారు.అయితే నిత్యం ఏదో ఒక వివాదంతో సోషల్ మీడియాలో రెచ్చిపోయే ఆర్జీవి.. గత ఐదు నెలలుగా మాత్రం సైలెంట్ అయ్యారు. ఆయన అరెస్ట్ కు పక్కా ప్లాన్ చేసినట్లు సమాచారం.