spot_img
Homeఆంధ్రప్రదేశ్‌Nara Lokesh latest comments: విడాకులు అప్పుడే.. తేల్చేసిన లోకేష్!

Nara Lokesh latest comments: విడాకులు అప్పుడే.. తేల్చేసిన లోకేష్!

Nara Lokesh latest comments: ఏదైనా రాజకీయ పార్టీకి, అందులో ఉన్న నేతల మధ్య విభేదాలు సహజం. పార్టీలు అంటేనే పదవులు, టిక్కెట్లు, నియోజకవర్గంలో పట్టు కోసం తలెత్తే కీచులాటలు. ప్రతి పార్టీలో ఉంటాయి. ఒక పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి- రోజా.. ఒక కాకాని గోవర్ధన్ రెడ్డి – అనిల్ కుమార్ యాదవ్ ల మధ్య వైసీపీలోనే విభేదాలు ఉన్నట్లు ప్రచారంలో ఉంది. వారే కాదు టిడిపిలోనూ.. జనసేన లోను నేతల మధ్య విభేదాలు సహజం. ఇటువంటి రాజకీయ కాంబినేషన్లు అన్ని పార్టీల్లోనూ ఉంటాయి. ఒక పార్టీలో నాయకులే ఎవరి రాజకీయ ప్రయోజనాలు వారు చూసుకుంటున్నారు. అటువంటిది ఏపీలో మూడు పార్టీల ఉమ్మడి ప్రభుత్వం నడుస్తోంది. టిడిపి, జనసేన, బిజెపి ఇలా మూడు భిన్నమైన సిద్ధాంతాలు, ఆలోచనలతో ముందుకెళ్లే పార్టీల మధ్య.. తప్పకుండా విభేదాలు అనేవి సహజం. అయితే తమ మధ్య లేవు అంటే ఎవరూ నమ్మరు. మంత్రి నారా లోకేష్ కూడా దీనిపైనే ఉన్నది ఉన్నట్లు మాట్లాడేశారు.

సమస్యలు పరిష్కరించుకుందాం..
తెలుగుదేశం ( Telugu Desam)పార్టీ బూత్ స్థాయి కార్యకర్తల సమావేశంలో మంత్రి నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. మూడు పార్టీలు కలిసి పనిచేస్తున్నప్పుడు కొన్ని అభిప్రాయ బేధాలు వస్తుంటాయి. వాటిని మనం కూర్చుని మాట్లాడుకుని పరిష్కరించుకుందాం. అంతేతప్ప మిత్రపక్షాల మధ్య విడాకులు ఉండవు. మిస్ ఫైర్ లు అంతకంటే ఉండవు. అంతకుమించి క్రాస్ ఫైరింగులు కూడా ఉండవు అని తేల్చి చెప్పారు మంత్రి నారా లోకేష్. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కూటమి విడిపోవడం కోసం ఆలోచన చేస్తుంటే పవన్ కళ్యాణ్ తో పాటు లోకేష్ తమ మధ్య బంధాన్ని పెంచుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా నారా లోకేష్ ఇదే తరహా వ్యాఖ్యానాలు చేశారు.

టిడిపి శ్రేణులకు హితవు
మరో మూడు సార్లు కూటమి కొనసాగుతుందని పవన్ కళ్యాణ్ ప్రతిసారి తేల్చి చెప్తున్నారు. దానిని గుర్తు చేశారు లోకేష్( Nara Lokesh). పవనన్న స్వయంగా మనం మరో 15 ఏళ్ల పాటు ఇలాగే కలిసి మెలిసి పనిచేద్దామని చెబుతున్నారు. మనం మూడు పార్టీల మధ్య చిచ్చు పెట్టడానికి టీం 11 కెప్టెన్ నిరంతరంగా శ్రమిస్తున్నారని పరోక్షంగా జగన్ పై విమర్శలు చేశారు లోకేష్. ఎంత మాత్రం మనం ఆయనకు అవకాశం ఇవ్వకూడదు అని సొంత పార్టీ శ్రేణులకు తేల్చి చెప్పారు. గ్రామ, మండల, నియోజకవర్గస్థాయిలో విభేదాలు ఉంటే కూర్చొని మాట్లాడుకోవాలని సూచించారు లోకేష్. మరో 15 సంవత్సరాల పాటు మనమే అధికారంలో ఉండడం కూడా అంతే అవసరం అని కూడా తేల్చి చెప్పారు. ఎక్కడ జనసేనతో ఇబ్బందులు వద్దు అంటూ తేల్చి చెప్పారు నారా లోకేష్. ప్రస్తుతం ఆయన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Most Popular

Sujeeth Director: డైరెక్టర్ సుజిత్ ని చూసి వణికిపోతున్న పవన్ ఫ్యాన్స్.. ఇలా అయితే కష్టమే..

Sujeeth Director: డైరెక్టర్ సుజిత్ తో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి అనుబంధం మామూలుది కాదు. ఒక సాధారణ పవన్ కళ్యాణ్ వీరాభిమాని గా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన సుజిత్ ,...

Jr NTR: నిరాశలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్.. ఆ సినిమా రద్దు అయ్యినట్టేనా!

Jr NTR: ప్రస్తుతం మన టాలీవుడ్ లో రెబల్ స్టార్ ప్రభాస్ తర్వాత , క్రేజీ కాంబినేషన్స్ ని సెట్ చేసుకున్న హీరో ఎవరైనా ఉన్నారా అంటే , అది జూనియర్...

Chiranjeevi: చిరంజీవి విషయంలో లైట్ తీసుకున్న స్టార్ డైరెక్టర్స్…

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేయాలనే కోరిక ప్రతి ఒక్కరికి ఉంటుంది. ప్రతి దర్శకుడు ఇండస్ట్రీకి రావడానికి ముందే చిరంజీవి సినిమాలను చూసి వచ్చినవారే కాదా విశేషం.. ఇండస్ట్రీ లో సక్సెస్...

Vijay Deverakonda Vs Naveen Polishetty: విజయ్ దేవరకొండ vs నవీన్ పోలిశెట్టి… పోటీ మామూలుగా లేదుగా…

Vijay Deverakonda Vs Naveen Polishetty: సినిమా ఇండస్ట్రీలో ఉన్న హీరోల మధ్య ఎంత మంచి ఫ్రెండ్షిప్ ఉన్నప్పటికి సినిమాల విషయంలో వాళ్ళ మధ్య తీవ్రమైన పోటీ అయితే ఉంటుంది. పర్సనల్ విషయాల్లో...

Nagababu Jabardasth: ‘జబర్దస్త్’ లోకి రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత నాగబాబు ఒక్కో ఎపిసోడ్ కి తీసుకునే రెమ్యూనరేషన్...

Nagababu Jabardasth: గత 13 సంవత్సరాల నుండి ఎలాంటి విరామం లేకుండా ఈటీవీ లో దిగ్విజయంగా సాగుతున్న షో ఏదైనా ఉందా అంటే , అది 'జబర్దస్త్' మాత్రమే. ఈ బిగ్గెస్ట్...
Oktelugu Epaper
Exit mobile version