Site icon OkTelugu

Vizag Kapu leaders rally: నాడు ముద్రగడ.. నేడు అంబటి.. సేమ్ సీన్!

Vizag Kapu leaders rally

Vizag Kapu leaders rally

Vizag Kapu leaders rally: ఏదైనా ఒక్కసారి చేస్తేనే వర్క్ అవుట్ అవుతుంది. పదే పదే అదే మాట అంటే ప్రజలు వినరు. తెలంగాణలో కెసిఆర్( KCR) ని తీసుకుందాం. రెండుసార్లు తెలంగాణ సెంటిమెంట్తో ఎన్నికలకు వెళ్లి గెలిచారు. కానీ మూడోసారి మాత్రం సెంటిమెంట్ తగ్గించి.. జాతీయ భావాలతో వెళ్లారు. అయినా సరే అక్కడి ప్రజలు గుర్తించలేదు. ఏపీలో కూడా అటువంటి సీన్ ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన నాటి నుంచి ఎన్నో రకాల ప్రయోగాలు చేశారు. అందులో కులప్రయోగం ఒకటి. 2014లో కాపులకు రిజర్వేషన్లు ఇస్తానని ప్రకటించారు చంద్రబాబు. ఆ ఒక్క అంశాన్ని పట్టుకొని ముద్రగడ పద్మనాభం పెద్ద ఉద్యమమే చేశారు. అది అంతిమంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి లాభం చేకూర్చింది. కానీ అదే ముద్రగడ పద్మనాభం వైయస్సార్ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యమాన్ని వదిలేశారు. అదే ముద్రగడ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరినా మొన్నటి ఎన్నికల్లో కాపులు ఇటువైపు చూడలేదు.

ముద్రగడపై కేసులతో..
కాపు రిజర్వేషన్ ఉద్యమాన్ని పతాక స్థాయికి తీసుకెళ్లారు ముద్రగడ పద్మనాభం( mudragada Padmanabham ). 2016 జనవరి 31న తుని కేంద్రంగా ముద్రగడ నేతృత్వంలో కాపు గర్జన సభ ఏర్పాటు చేశారు. చివరకు ఆ ఉద్యమం రైలు తగలబెట్టే వరకు వచ్చింది. ముద్రగడపై కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో జగన్మోహన్ రెడ్డి రాజకీయంగా తీసుకున్న కొన్ని రకాల నిర్ణయాలు కాపులను ఆకర్షించాయి. నాడు ముద్రగడపై తెలుగుదేశం ప్రభుత్వం పెట్టిన కేసులను కాపు కులం పై జరిగిన దాడిగా చిత్రీకరించడంలో జగన్మోహన్ రెడ్డి సక్సెస్ అయ్యారు. తద్వారా అప్పట్లో టిడిపి పొలిటికల్ గా భారీ డ్యామేజ్ కు గురైంది.

చంద్రబాబు పై వ్యతిరేక ప్రచారం..
అయితే తాజాగా అంబటి రాంబాబు( ambati Rambabu) అరెస్టు ఎపిసోడ్ ను కాపులపై జరుగుతున్న దాడిగా చిత్రీకరించేందుకు మరోసారి ప్రయత్నాలు మొదలుపెట్టారు. కాపులంటే చంద్రబాబుకు ఎందుకంత కక్ష? కాపు సామాజిక వర్గం నేతల మీద టిడిపి దాడులు ఏంటి? నాడు ముద్రగడపై అలా? నేడు అంబటి రాంబాబు పై ఇలా? అంటూ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ విశాఖ నుంచి సంఘీభావ యాత్ర మొదలు పెట్టేసారు. 300 కార్లతో యాత్రగా బయలుదేరారు. అయితే నాడు ముద్రగడ మాదిరిగా అంబటి రాంబాబు ఎపిసోడ్ వర్కౌట్ కాదు. కూటమి పార్టీల తరఫున ఉన్న కాపు నేతలు మౌనం మరోసారి డ్యామేజ్ కు గురి చేసే అవకాశం ఉంది. ముద్రగడ రిజర్వేషన్ ఉద్యమాన్ని.. అంబటి రాంబాబు వ్యాఖ్యలను ఒకే గాటిలో కట్టలేం. కానీ ఎలాగైనా కాపులను మరోసారి తనవైపు తిప్పుకోవాలన్న జగన్మోహన్ రెడ్డి ఆలోచనలను కూటమి కాపు ఎమ్మెల్యేలు, మంత్రులు గుర్తించాల్సిన అవసరం ఉంది. తిప్పి కొట్టాల్సిన పరిస్థితి ఉంది.

Exit mobile version