Thalliki Vandanam Scheme: ప్రభుత్వం ఈ నెలలోనే తల్లికి వందనం లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలలో డబ్బులు జమ చేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు తల్లికి వందనం పథకం కింద మార్గదర్శకాల ఖరారు పైన ఏపీ అధికారులు దృష్టి సారించారు. ఈ పథకానికి సంబంధించి అర్హులైన లబ్ధిదారుల వివరాలపైన ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బడ్జెట్లో కూడా తల్లికి వందనం పథకానికి సంబంధించి ప్రభుత్వం నిధులను కేటాయించింది. తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తల్లికి వందనం పథకానికి సంబంధించి ఒక కీలక నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది. ఈనెల 12వ తేదీన అన్ని పాఠశాలలో తిరిగి ప్రారంభం కానున్నాయి. ఈ క్రమంలో ప్రభుత్వం తల్లికి వందనం పథకాన్ని ఈ నెలలోనే అమలు చేయాలని నిర్ణయం తీసుకుంది. అయితే ఈ పథకం కింద డబ్బులు పొందాలంటే అర్హులైన వాళ్ళు ఈ రెండు ముఖ్యమైన లింకింగ్ ప్రాసెస్ ను తప్పనిసరిగా పూర్తి చేయాలని ఇప్పటికే అధికారులు స్పష్టం చేశారు. అర్హులైన లబ్ధిదారులు తమ బ్యాంకు ఖాతాలో ఆధార్ నెంబర్తో లింక్ చేయాలి. అలాగే లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలో ఎన్పీసీఐ తో లింక్ చేయాలని ఇప్పటికే అధికారులు సూచించారు. ఈ ఏడాది స్కూల్ కి వెళ్ళిపోతున్న ప్రతి విద్యార్థి తల్లి ఖాతాలో తల్లికి వందనం నిధులు జమ కానున్నాయి. 2024-25 విద్యా సంవత్సరంలో ప్రభుత్వం అంచనా వేసిన లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాదాపుగా 81 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నట్లు సమాచారం.
Also Read: వారు ఔట్.. ఐపీఎల్ లో కోచ్ ల నుంచి ప్లేయర్ల దాకా ఏరివేత మొదలుపెట్టిన జట్లు..
వీళ్లందరిలో 69.16 లక్షల మంది ప్రాథమికంగా తల్లికి వందనం పథకానికి అర్హులుగా విద్యాశాఖ అధికారులు తేల్చినట్లు తెలుస్తుంది. తల్లికి వందనం పథకం కోసం దాదాపు రూ.10,300 కోట్లు అవసరం అవుతాయని ప్రాథమికంగా అధికారులు అంచనా వేశారు. అలాగే విద్యార్థులందరికీ తప్పనిసరిగా 75% హాజరు నిబంధన కొనసాగుతుంది. ఈ పథకానికి 2025-26 బడ్జెట్లో నిధులను కేటాయింపులో భాగంగా ప్రభుత్వం ప్రస్తుతం కసరత్తులు చేపట్టింది. దీనికి సంబంధించి అనేక విధి విధానాల పైన కూడా అధ్యయనం చేస్తున్నారు.
గత ప్రభుత్వం చేపట్టిన మార్గదర్శకాలను కూడా అధికారులు సమీక్షిస్తున్నారు. ఈ పథకం ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు, తెల్ల రేషన్ కార్డు లేని వారికి అలాగే 3 యూనిట్ల విద్యుత్ వినియోగించే వారికి, కారు కలిగిన వారికి అలాగే అర్బన్ ప్రాంతంలో 1000 చదరపు అడుగులు స్థలం కలిగి ఉన్నవారికిఅందడం లేదు అని తెలుస్తుంది. గతంలో విద్యుత్ వినియోగం, కారు ఉండడం వంటి నిబంధనాలను వ్యతిరేకించిన కూటమి ప్రభుత్వం ప్రస్తుతం వీటికి మినహాయింపును ఇస్తారా లేదా కొనసాగిస్తారా అనే విషయం మీద క్లారిటీ రావాల్సి ఉంది.
Also Read: ముద్రగడకు భయపడిన కూటమి.. కారణం అదే!