Yanamala Ramakrishna
Yanamala Ramakrishna :తెలుగుదేశం ( Telugu Desam) పార్టీలోనే ఆ సీనియర్ ప్రస్థానం ముగిసినట్టేనా? ఆయన రిటైర్మెంట్ తీసుకోవాల్సిందేనా? అనివార్యమా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి పనిచేసిన చాలామంది నేతలు క్రియాశీలక రాజకీయాలకు దూరమయ్యారు. ఒకరిద్దరూ నేతలు మాత్రమే యాక్టివ్ గా ఉన్నారు. మరికొందరు తమ వారసులను రాజకీయాల్లోకి దించారు. పార్టీలోనే అవకాశాలు కల్పించారు. అయితే మరి కొంతమంది నాయకులు మాత్రం తమకు గౌరవప్రదమైన పదవీ విరమణ కోరుకుంటున్నారు. అటువంటి వారిలో యనమల రామకృష్ణుడు ఒకరు. కూటమి అధికారంలోకి రావడంతో కీలక పదవి ఆశించారు. కానీ అది దక్కే ఛాన్స్ మాత్రం కనిపించడం లేదు. దీంతో పొలిటికల్ గా సైలెంట్ గా ఉన్నారు. అయితే తన ఈ పరిస్థితికి నారా లోకేష్ కారణమని ఆగ్రహంగా ఉన్నట్లు ప్రచారం నడుస్తోంది.
* టిడిపిలో ఎనలేని ప్రాధాన్యం
తూర్పుగోదావరి జిల్లాలో తెలుగుదేశం పార్టీ అంటే ముందుగా గుర్తుకొచ్చే పేరు యనమల రామకృష్ణుడు( yanamala ramakrishnaudu ). పార్టీ పవర్ లో ఉంటే కీలక మంత్రి పదవిలో ఉండేవారు యనమల. పార్టీ ప్రతిపక్షంలో ఉన్న ఏదో ఒక పదవి ఆయనకు ఉండేది. తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన ప్రతిసారి కీలక మంత్రిత్వ శాఖను యనమల తగ్గించుకునేవారు. 1994లో మాత్రం అసెంబ్లీ స్పీకర్ అయ్యారు. అటు తరువాత ప్రతి టిడిపి ప్రభుత్వంలో ఆయన క్యాబినెట్ మంత్రి. ఈసారి మాత్రం ఆ అవకాశం లేకుండా పోయింది. అయితే ఇందుకు లోకేష్ కారణమని ఆగ్రహంగా ఉన్నారు యనమల. ఈసారి క్యాబినెట్లో యువనాయకత్వానికి అత్యంత ప్రాధాన్యం ఇచ్చారు. పైగా యనమల రామకృష్ణుడు వారసురాలిగా ఆయన కుమార్తె దివ్య తెరపైకి వచ్చారు. అప్పటివరకు సోదరుడు కృష్ణుడు వెన్నుదన్నుగా నిలుస్తూ వచ్చారు. అయితే 2004 ఎన్నికల నాటి నుంచి రామకృష్ణుడు సొంత నియోజకవర్గం తునిలో టిడిపి ఓడిపోతూ వచ్చింది. అందుకే టిడిపి నాయకత్వం ఈసారి రామకృష్ణుడు కూతురు దివ్యకు అవకాశం ఇచ్చింది. ఆమె గెలిచింది కానీ మంత్రి పదవి దక్కలేదు. అదే సమయంలో తూర్పుగోదావరి జిల్లాలో యనమల రామకృష్ణుడి ప్రభావం తగ్గింది.
* ఒకవైపు పవన్, మరోవైపు సతీష్
ప్రస్తుతం తూర్పుగోదావరి ( East Godavari ) జిల్లా పిఠాపురం ఎమ్మెల్యేగా పవన్ కళ్యాణ్ ఉన్నారు. డిప్యూటీ సీఎం గా కూడా వ్యవహరిస్తున్నారు. జిల్లాలో ఇప్పుడు ఆయన మాట చెల్లుబాటు అవుతోంది. మరోవైపు తెలుగుదేశం పార్టీ పరంగా సానా సతీష్ ప్రముఖంగా వ్యవహరిస్తున్నారు. ఆయన టిడిపి తరఫున రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఒక విధంగా చెప్పాలంటే లోకేష్ కు అత్యంత విధేయుడు. యనమల రామకృష్ణుడికి చెక్ చెప్పాలని
భావించి లోకేష్ సానా సతీష్ కు ప్రమోట్ చేశారన్నది టిడిపి వర్గాల్లో జరుగుతున్న ప్రచారం. పైగా కూటమి అధికారంలోకి వచ్చి 9 నెలలు అవుతోంది. కానీ ఇంతవరకు యనమల రామకృష్ణుడికి ఎటువంటి పదవి లేకుండా పోయింది. దీనంతటికీ కారణం లోకేష్ అన్నది ప్రధాన ఆరోపణ.
* చంద్రబాబుతో గ్యాప్ చంద్రబాబుతో( Chandrababu) సైతం యనమల రామకృష్ణుడుకు చాలా గ్యాప్ వచ్చినట్లు సమాచారం. అమరావతి వెళ్లి చంద్రబాబును కలిసింది కూడా చాలా తక్కువే నట. ప్రైవేటు వ్యవహారాలు చూసుకునేందుకు మాత్రమే రామకృష్ణుడు విజయవాడ వస్తున్నారట. అయితే రాజ్యసభ సీటు కానీ.. మంత్రి పదవి కానీ దక్కాలని యనమల రామకృష్ణుడు భావిస్తున్నారు. కానీ టిడిపి హై కమాండ్ మాత్రం ఇచ్చే అవకాశం లేదని తెలుస్తోంది. అందుకే యనమల అలక వహించినట్టు ప్రచారం నడుస్తోంది. అయితే ఆయన అలక అసంతృప్తి వైపు దారితీస్తుందా.. లేకుంటే పదవి ఇచ్చి చంద్రబాబు ఆయన ఆగ్రహాన్ని తగ్గిస్తారా? అన్నది చూడాలి.
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Read MoreWeb Title: Tdp senior leader yanamala ramakrishnudu is angry with lokeshs behavior
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com