Pradeep : బుల్లితెర పై తన అద్భుతమైన యాంకరింగ్ తో అశేష ప్రేక్షాభిమానం పొందిన ప్రదీప్(Anchor Pradeep), ఈమధ్య కాలం లో యాంకరింగ్ కి దూరంగా ఉంటూ వస్తున్న సంగతి తెలిసిందే. బుల్లితెరకు ఆయన దూరమై దాదాపుగా రెండేళ్లు పూర్తి కావొస్తుంది. ప్రదీప్ లేని లోటు బుల్లితెర పై స్పష్టంగా కనిపిస్తుంది. ఆయన రీ ఎంట్రీ కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. కానీ ప్రదీప్ టార్గెట్ కేవలం బుల్లితెర కాదు, వెండితెర అని స్పష్టంగా అర్థం ఆవుతుంది. ఆయన మొదటి చిత్రం ’30 రోజుల్లో ప్రేమించడం ఎలా?’. ఒక పక్క టీవీ షోస్ చేసుకుంటూనే మరో పక్క ఈ చిత్రాన్ని పూర్తి చేశాడు. ఈ సినిమాలోని ‘నీలి నీలి ఆకాశం’ పాట ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. సినిమా కూడా కమర్షియల్ గా హిట్ అయ్యింది. ఈ చిత్రం తర్వాత ప్రదీప్ ‘అక్కడ అమ్మాయి..ఇక్కడ అబ్బాయి’ చిత్రం చేశాడు.
Also Read : ప్రదీప్ మాచిరాజుకు ఆ కుర్ర యాంకర్ అంత నచ్చిందా… బంపర్ ఛాన్స్ ఇచ్చాడుగా!
ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలోనే ఆయన టీవీ షోస్ చేయడం ఆపేసాడు. షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఈ నెల 11న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా ప్రదీప్ ఈ మూవీ ప్రొమోషన్స్ లో ఫుల్ బిజీ గా మారిపోయాడు. ప్రొమోషన్స్ భాగంగా ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో ఆయన మాట్లాడిన మాటలు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. ఆయన మాట్లాడుతూ ‘నా చిన్ననాటి స్నేహితులతో కలిసి చేసిన చిత్రమిది. ఈ సినిమాకు నేను ఒక్క రూపాయి రెమ్యూనరేషన్ కూడా తీసుకోలేదు. ఎందుకంటే నేను కూడా ఈ చిత్రం లో కాస్త పెట్టుబడి పెట్టి ఉన్నాను. రెండేళ్ల నుండి షోస్ కూడా చేయలేదు కాబట్టి, ఆర్థికంగా చాలా ఇబ్బందులను ఎదురుకోవాల్సి వచ్చింది, కానీ మ్యానేజ్ చేసుకున్నాను’ అంటూ చెప్పుకొచ్చాడు.
ఇది ఇలా ఉండగా ‘అక్కడ అమ్మాయి..ఇక్కడ అబ్బాయి'(Akkada Ammayi..Ikkada Abbayi) అనే టైటిల్ పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) మొదటి సినిమాకు సంబంధించినది అనే విషయం తెలిసిందే. దీనిపై ప్రదీప్ స్పందిస్తూ ‘పవన్ కళ్యాణ్ గారి సినిమా స్టోరీ కి, మా స్టోరీ కి అసలు సంబంధమే ఉండదు. సినిమా కథ వింటున్నప్పుడే నాకు ఈ టైటిల్ మదిలో తోచింది, వెంటనే డైరెక్టర్ కి చెప్పాను. అయితే పవన్ కళ్యాణ్ గారి సినిమా టైటిల్ కావడంతో కాస్త భయంతో పని చేసాము. ఎక్కడా కూడా తగ్గకుండా చాలా సీరియస్ గా తీసుకొని ఈ చిత్రాన్ని పూర్తి చేసాము. కచ్చితంగా కళ్యాణ్ గారి అభిమానులకు కూడా ఈ చిత్రం నచ్చుతుంది’ అని చెప్పుకొచ్చాడు. ఇకపోతే ఈ సినిమాలో హీరోయిన్ గా దీపికా పిల్లి నటిస్తుంది. గతంలో ప్రదీప్, దీపికా పిల్లి కలిసి ఢీ షో చేసారు. ఇప్పుడు వాళ్ళ కాంబినేషన్ లోనే సినిమా రావడం గమనార్హం.
Also Read : టీడీపీ ఎమ్మెల్యే తో యాంకర్ ప్రదీప్ పెళ్లి ఫిక్స్..ముహూర్తం కూడా ఖరారు..ఇంతకీ ఆ లేడీ ఎమ్మెల్యే ఎవరంటే!