TDP Leader Kidnap Attempt : రాయలసీమ( Raayalaseema) అంటేనే ఒకప్పుడు ఫ్యాక్షన్ రాజకీయాలకు చిరునామా. నిత్యం దాడులు, ప్రతి దాడులతో మార్మోగేది. హత్యలు కూడా జరిగేవి. కానీ అక్కడి ప్రజల్లో చైతన్యం రావడం.. ప్రభుత్వాలు అడ్డుకట్ట వేయడంతో వాటికి చెక్ పడింది. అయితే అప్పుడప్పుడు కొందరు నేతల వైఖరితో ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. ఇప్పటికీ కొందరు నాయకుల మధ్య విభేదాలు వివాదాలకు కారణమవుతున్నాయి. తాజాగా నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలం చిన్న కందుకూరులో ఓ మహిళను కిడ్నాప్ చేయడానికి కొంతమంది ప్రయత్నించారు. ఓ రాజకీయ నేత అనుచరులు హల్చల్ సృష్టించారు. దీంతో గ్రామస్తులు ఆ మహిళకు అండగా నిలబడ్డారు. అందరూ ఏకతాటిపైకి వచ్చి ఎదురు తిరిగేసరికి.. కిడ్నాప్ కోసం వచ్చిన వారు అక్కడి నుంచి పరారయ్యారు. ఈ ఘటన రాయలసీమ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. మళ్లీ పాత సంస్కృతి ప్రారంభమైందా? అన్న అనుమానం కలుగుతోంది.
Also Read : ‘వెన్నుపోటు దినం’.. వైయస్సార్ కాంగ్రెస్ లో ఆసక్తికర చర్చ!
* ఇద్దరి మధ్య మనస్పర్ధలు..
చిన్న కందుకూరు( Chinna kandukuru ) గ్రామానికి చెందిన బాధిత మహిళ భర్త ఎనిమిదేళ్ల కిందట చనిపోయాడు. దీంతో అదే గ్రామానికి చెందిన నాయకుడు ఒకరు ఆమెకు దగ్గరయ్యారు. అయితే ఇటీవల వారి మధ్య మనస్పర్ధలు వచ్చాయి. దీంతో ఇద్దరూ దూరంగా ఉంటూ వస్తున్నారు. అయితే సదరు మహిళ తనతో మాట్లాడడం లేదని ఆగ్రహించిన ఆ నేత.. కొంతమందితో కలిసి వచ్చి ఆమెను కిడ్నాప్ చేసే ప్రయత్నం చేశాడు. కుటుంబ సభ్యులతో పాటు స్థానికులు అడ్డుకున్నారు. అయితే వారు కత్తులతో బెదిరించేసరికి.. గ్రామస్తులంతా కర్రలతో ఎదురు తిరిగారు. దీంతో వారు అక్కడి నుంచి పరారయ్యారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు వెళ్లింది. ఓ ఏడుగురుపై కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది.
* వ్యక్తిగతం అంటున్న గ్రామస్తులు..
అయితే ఇది పూర్తిగా వ్యక్తిగత, కుటుంబ వ్యవహారం. దీనికి రాజకీయ రంగు పులమడంతో వివాదం మరింత పెరుగుతోంది. ముఖ్యంగా అధికార పార్టీకి చెందిన ఓ మహిళ ఎమ్మెల్యే పేరును ప్రత్యర్థులు ప్రచారం చేయడం ప్రారంభించారు. అయితే ఇది వ్యక్తిగత, కుటుంబ వ్యవహారమని గ్రామస్తులు చెబుతున్నారు. దీనికి రాజకీయాలతో సంబంధం లేదని తేల్చి చెబుతున్నారు. అయితే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా మాత్రం అధికార పార్టీకి వ్యతిరేకంగా ప్రచారం చేస్తోంది. అయితే ఈ ఘటనపై పోలీస్ కేసు నమోదు కావడం.. ఓ ఏడుగురుపై కేసు నమోదు చేసి అరెస్టు చేయడం విశేషం. అయితే రాయలసీమలో గతంలో ఎన్నడూ లేని సంస్కృతి వెలుగు చూస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా ఫ్యాక్షన్ రాజకీయాలకు దూరంగా రాయలసీమ గ్రామాలు ఉంటున్నాయి. మళ్లీ పాత సంస్కృతిని పరిచయం చేస్తుండడం మాత్రం ఆందోళన కలిగిస్తోంది.
పట్టపగలే మహిళాను కిడ్నాప్ చేయడానికి యత్నించిన టీడీపీ నాయకులు
ఆళ్లగడ్డ నియోజకవర్గంలోని దొర్నిపాడు మండలం అర్జునాపురానికి చెందిన మహిళాను కిడ్నాప్ చేయాలని యత్నించిన టీడీపీ నాయకులు.. గ్రామస్తులు అడ్డుకోవడంతో, కత్తులతో బెదిరించిన టీడీపీ నాయకులు
గ్రామస్తులు గుమిగూడడంతో,… pic.twitter.com/koIxhQJoRf
— greatandhra (@greatandhranews) June 5, 2025