Gollapalli Amulya: ఏపీలో( Andhra Pradesh) వరకట్న వేధింపుల కేసులో ఏకంగా ఓ టిడిపి నాయకురాలు బాధితురాలు కావడం సంచలనం రేపుతోంది. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గ టిడిపి ఇన్చార్జ్ గొల్లపల్లి అమూల్యకు వరకట్న వేధింపులు కలకలం రేపాయి. అదనపు కట్నం కోసం భర్త తరచూ వేధిస్తున్నాడని.. ఆయనపై చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆశ్రయించారు అమూల్య. దీంతో పోలీసులు అమూల్య భర్త దొమ్మేటి సునీల్ పై కేసు నమోదు చేశారు. వీరిది ప్రేమ వివాహం. చదువుకునే రోజుల్లో సునీల్ తనను ప్రేమిస్తున్నానని.. పెళ్లి చేసుకుని బాగా చూసుకుంటానని నమ్మించాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. 2009 మార్చి 4న పెద్దల సమక్షంలో తమకు వివాహం అయిందని.. అప్పటినుంచి కట్నం కోసం వేధిస్తున్నాడంటూ ఫిర్యాదులో పేర్కొనడం విశేషం.
Also Read: ప్రమాదపుటంచున ఏపీ.. దూసుకొస్తున్న ‘మొంథా’!
* రాజోలు టిడిపి నియోజకవర్గ ఇన్చార్జిగా..
గొల్లపల్లి అమూల్య( Gollapalli Amulya ) మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు. గత నెలలోనే రాజోలు నియోజకవర్గ టిడిపి ఇన్చార్జిగా హై కమాండ్ నియమించింది. అయితే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జిగా అమూల్య తండ్రి సూర్యారావు ఉన్నారు. తండ్రి కూతుళ్లు ప్రధాన పార్టీల ఇంచార్జిలుగా ఉండడం విశేషం. రాజోలు నియోజకవర్గం టిడిపి ఇన్చార్జిగా బాధ్యతలు చేపట్టిన కొద్ది రోజులకే ఇలా భర్త సునీల్ పై వరకట్ట వేధింపులు కేసు పెట్టడం చర్చనీయాంశంగా మారింది.
* సుదీర్ఘ నేపథ్యం..
మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు( Gollapalli Surya Rao ) ది సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం. 1989లో టిడిపిలో చేరి అల్లవరం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2004లో అదే అల్లవరం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. రాజశేఖర్ రెడ్డి క్యాబినెట్లో మంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టారు. 2014 ఎన్నికలకు ముందు టిడిపిలో చేరి రాజోలు నుంచి పోటీ చేసి గెలిచారు. 2019లో టిడిపి నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2024లో పొత్తులో భాగంగా రాజోలు సీటును జనసేనకు కేటాయిస్తారని తెలిసి వైసీపీలో చేరిపోయారు. ఆ పార్టీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. సూర్యారావు ప్రస్తుతం రాజోలు వైసీపీ ఇన్చార్జిగా కొనసాగుతున్నారు. ఇంతలోనే సూర్యారావు కుమార్తె అమూల్యను రాజోలు ఇన్చార్జిగా టిడిపి నియమించింది. అయితే ఇప్పుడు అమూల్య వరకట్న వేధింపులకు బాధితురాలుగా మిగలడం విశేషం.