Homeఆంధ్రప్రదేశ్‌TDP Mahanadu 2026: 20 తీర్మానాలు.. 65 మంది వక్తలు.. మహానాడు విశేషాలు ఇవే!

TDP Mahanadu 2026: 20 తీర్మానాలు.. 65 మంది వక్తలు.. మహానాడు విశేషాలు ఇవే!

TDP Mahanadu 2026: టిడిపి హైబ్రిడ్ మహానాడు మరికొద్ది సమయంలో ప్రారంభం కానుంది. ఈసారి మహానాడు ఎన్నో రకాల ప్రత్యేకతలను సంతరించుకుంది. సంప్రదాయ విధానానికి భిన్నంగా హైబ్రిడ్ విధానంలో నిర్వహిస్తున్నారు. ఇప్పటికే తెలుగుదేశం పార్టీలో యువ రక్తం ఎక్కించారు. మరోవైపు మహిళా నాయకత్వానికి ప్రోత్సాహం అందిస్తున్నారు. స్త్రీ శక్తిని ప్రధాన ఇతివృత్తంగా ఎంచుకోవడం విశేషం. స్త్రీ శక్తి థీమ్ తో జరుపుతామని ఇప్పటికే నాయకత్వం ప్రకటించింది. అందుకు తగ్గట్టుగానే మహానాడు వేదికపై మహిళలతోపాటు యువతకు ప్రాధాన్యం కల్పించింది. వక్తల ఎంపికలో యువతతో పాటు మహిళలకు ప్రాధాన్యం ఇవ్వడం విశేషం.
* అత్యంత కీలకమైన రాజకీయ తీర్మానం ప్రవేశపెట్టే బాధ్యతను కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనితకు అప్పగించారు.
* పార్టీ కోసం అంకితభావంతో పనిచేసిన నలుగురు మహిళా నేతలు వసుంధర, మాధవి, శిరీష, కళావతి లను సత్కరిస్తారు.
* కొత్తగా పొలిట్ బ్యూరోలో స్థానం సంపాదించిన ద్వితీయ శ్రేణి నాయకురాలు గంటెడ శ్రీదేవి.. సామాజిక సమతూకంలో భాగంగా ట్రాన్స్ జండర్ ప్రతినిధి నీరజ రానిలను సన్మానించనున్నారు.
* మారుతున్న కాలానికి అనుగుణంగా యువ ఓటర్లు, క్యాడర్ను ఆకట్టుకునే విధంగా సీఎం చంద్రబాబు జెన్ జి యువతతో ప్రత్యేకంగా ఇంటరాక్షన్ నిర్వహించనున్నారు. యువత ఆలోచనలను తెలుసుకునే ప్రయత్నం చేయనున్నారు.
* మొత్తం 20 తీర్మానాలు, 65 మంది వక్తలతో సమయపాలన పాటిస్తూ.. సరికొత్త డిజిటల్ విధానంలో సాగనున్న ఈ మహానాడు టిడిపి శ్రేణుల్లో జోష్ నింపుతుందని నాయకత్వం బలంగా నమ్ముతోంది.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular