Spurious Liquor: వైఎస్ఆర్ కాంగ్రెస్( YSR Congress ) హయాంలో పెద్ద ఎత్తున నాసిరకం మద్యం చలామణి అయిందన్న ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం మద్యం కుంభకోణంలో అంశం ఇదే. నాసిరకం మద్యం కంపెనీల నుంచి భారీగా కమిషన్లు దండుకున్నారు అన్నది ఈ కుంభకోణం వెనుక ఉన్న అసలు రహస్యం. దాదాపు 3,500 కోట్ల రూపాయలు పక్కదారి పట్టించారని తేలింది. దీనిపైనే విచారణ సాగుతోంది. మరోవైపు వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జరిగిన ఓ ఘటనకు సంబంధించి కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా.. 2022 మార్చిలో ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం లో కల్తీసారాకు 22 మంది బలి అయ్యారు. అయితే అప్పట్లో ఈ కేసు విచారణ ముందుకు సాగలేదు. తాజాగా కూటమి ప్రభుత్వం సమగ్ర దర్యాప్తు కోసం ఏకంగా ఓ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసింది. దీంతో విచారణ మరింత వేగవంతం అయ్యే పరిస్థితి కనిపిస్తోంది.
Also Read: చంద్రబాబుకు బిల్ గేట్స్ లేఖ
* విచారణలో జాప్యం..
అప్పట్లో ఓ 22 మంది అనుమానాస్పద స్థితిలో చనిపోయారు. అయితే బాధ్యత కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్లో కేసు వేశారు. కానీ దర్యాప్తు సజావుగా జరగలేదు. తీవ్ర జాప్యం జరుగుతూ వచ్చింది. తాజాగా కూటమి ప్రభుత్వం ఈ ఘటనపై దృష్టి పెట్టింది. టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేసింది. వీలైనంత త్వరగా కేసు విచారణ ముగించాలని ఆదేశాలు ఇచ్చింది. అప్పట్లో కల్తీ సారా తోనే వీరంతా చనిపోయారు అన్న అనుమానాలు ఉన్నాయి. కానీ ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని భావించి అప్పట్లో విచారణను తొక్కి పెట్టారు. అందుకే ఇప్పుడు టాస్క్ ఫోర్స్ విచారణతో నిజా నిజాలు నీకు తేలే అవకాశం కనిపిస్తోంది.
* అప్పట్లో సారా వైపు మొగ్గు..
వైయస్సార్ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత నూతన మద్యం పాలసీని ప్రవేశపెట్టింది. ప్రభుత్వమే నేరుగా మద్యం దుకాణాలను నడిపింది. అప్పటివరకు ఉన్న ప్రీమియం బ్రాండ్లు( premium brands ) కనిపించకుండా పోయాయి. దేశంలో ఎక్కడా వినని.. చూడని మద్యం బ్రాండ్లు ఏపీలో కనిపించాయి. ధరలు కూడా 100% పెంచేశారు. దీంతో అప్పట్లో మందుబాబులు సారా తాగడం ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా సారా అమ్మకాలు గణనీయంగా పెరిగాయి. పట్టణం గ్రామం అన్న తేడా లేకుండా అన్నిచోట్ల సారావిక్రయాలు జరిగాయి. ఈ క్రమంలోనే జంగారెడ్డి గూడెంలో సారా తాగి 21 మంది చనిపోయారు. కానీ అప్పట్లో ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని భావించి విచారణలో చాలా రకాలుగా జాప్యం జరిగింది. మృతుల కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్లలో కేసులు పెట్టిన ఆశించిన స్థాయిలో మాత్రం విచారణ జరపలేదు. ఇప్పుడు టాస్క్ ఫోర్స్ ఏర్పాటుతో విచారణ వేగవంతం అయ్యే అవకాశం ఉంది. కేసు కొలిక్కి వచ్చే పరిస్థితి కనిపిస్తోంది.
* కుదిపేస్తున్న మద్యం కుంభకోణం..
ప్రస్తుతం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని మద్యం కుంభకోణం( liquor scam ) కుదిపేస్తోంది. కీలక వ్యక్తులతో పాటు నేతలు అరెస్టు అవుతున్నారు. బెయిల్ కోసం వారు చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. మరోవైపు కీలక నేత అరెస్టు ఉంటుందని ప్రచారం జరుగుతోంది. సరిగ్గా ఇటువంటి సమయంలోనే వైయస్సార్ కాంగ్రెస్ హయాంలో జరిగిన కల్తీ సారా మరణాలపై విచారణ ప్రారంభం అవుతుండడం విశేషం. ఈ విచారణ కూడా వైసీపీ నేతలతో పాటు అప్పట్లో పనిచేసిన అధికారుల గుండెల్లో ప్రకంపనలు రేపుతోంది.