NTR and Rajamouli : రాజమౌళి దేశం మెచ్చిన దర్శకుడు. ఆయనతో ఓ మూవీ చేసే ఛాన్స్ కోసం ప్రతి హీరో ఎదురు చూస్తాడు. దాదాపు పాతికేళ్ల కెరీర్లో రాజమౌళి కేవలం 12 సినిమాలు చేశాడు. బాహుబలి, బాహుబలి 2, ఆర్ ఆర్ ఆర్ చిత్రాల కోసం ఆయన ఎనిమిదేళ్లు కేటాయించారు. చేసిన కొద్ది చిత్రాల్లో అత్యధికంగా ఎన్టీఆర్ తో 4 సినిమాలు చేశాడు రాజమౌళి. చెప్పాలంటే వీరిద్దరి కెరీర్లో ఒకే సమయంలో మొదలైంది. హీరోగా ఎన్టీఆర్ మొదటి చిత్రం నిన్ను చూడాలని. ఈ మూవీ అంతగా ఆడలేదు. రెండో చిత్రంగా స్టూడెంట్ నెంబర్ వన్ చేశాడు.
స్టూడెంట్ నెంబర్ వన్ రాజమౌళికి ఫస్ట్ మూవీ. స్టూడెంట్ నెంబర్ వన్ మంచి విజయం అందుకుంది. వీరి కాంబోలో వచ్చిన రెండో చిత్రం సింహాద్రి. ఎన్టీఆర్ కెరీర్లో సింహాద్రి బిగ్గెస్ట్ హిట్ అని చెప్పాలి. వరుసగా రెండో చిత్రం ఎన్టీఆర్ తో చేశాడు రాజమౌళి. అనంతరం యమదొంగ, ఆర్ ఆర్ ఆర్ చిత్రాలు ఎన్టీఆర్ తో చేశాడు. పరాజయాల్లో ఉన్న ఎన్టీఆర్ ని సక్సెస్ ట్రాక్ ఎక్కించిన చిత్రం యమదొంగ. రాజమౌళి సలహా మేరకు ఎన్టీఆర్ స్లిమ్ అయ్యాడు. నయా లుక్ లో మెస్మరైజ్ చేశాడు.
Also Read : హాలీవుడ్ రేంజ్ లో ఒక గొప్ప రికార్డ్ ని క్రియేట్ చేసిన రాజమౌళి,ఎన్టీయార్…
ఇక ఆర్ ఆర్ ఆర్ సంచనాల గురించి ఎంత చెప్పినా తక్కువే. వరల్డ్ వైడ్ రూ. 1200 కోట్ల గ్రాస్ ఈ మూవీ రాబట్టింది. ఆర్ ఆర్ ఆర్ లోని నాటు నాటు సాంగ్ గోల్డెన్ గ్లోబ్, ఆస్కార్ వంటి ప్రతిష్టాత్మక అవార్డులు అందుకుంది. మిగతా హీరోలతో పోల్చితే ఎన్టీఆర్ తో రాజమౌళి ఎక్కువ సినిమాలు చేయడానికి కారణం.. ఆయనలోని టాలెంట్, కో ఆర్డినేషన్, డెడికేషన్ కారణం. ఎన్టీఆర్ తో పని చేసేందుకు రాజమౌళి ఇష్టపడతాడు. తాను కోరుకున్నది ఇచ్చే హీరోగా ఎన్టీఆర్ ని భావిస్తాడు. వ్యక్తిగతంగా కూడా వీరు చాలా క్లోజ్.
అయితే ఎన్టీఆర్ ని మొదటిసారి చూసిన రాజమౌళి చాలా నిరాశ చెందాడు అట. నా ఫస్ట్ మూవీకి ఇలాంటి హీరోనా అనుకున్నాడట. ఈ విషయాన్ని ఓ సందర్భంలో స్వయంగా చెప్పాడు. స్టూడెంట్ నెంబర్ వన్ కి హీరోగా ఎవరెవరినో ఊహించుకుంటే, ఎన్టీఆర్ వద్దకు ప్రాజెక్ట్ వెళ్లిందట. ఎన్టీఆర్ కట్ అవుట్ చూసి రాజమౌళి నిరాశ చెందాడు అట. నా మొదటి సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకుంటే, ఇలాంటి హీరో దొరికాడు ఏంటి? సరేలే కుంటి గుర్రంతో రేసు గెలిస్తే, గొప్ప విషయం కదా.. అనుకుని ముందుకు వెళ్ళాడట. అయితే ఎన్టీఆర్ డైలాగ్ డెలివరీ, యాక్టింగ్, డాన్సులు చూశాక తన అభిప్రాయం మారిపోయిందని, ఆయన అద్భుతమైన నటుడు అని రాజమౌళి చెప్పుకొచ్చాడు.
Also Read : ఎన్టీఆర్ ఇచ్చిన పార్టీలో బాలయ్య డ్యాన్స్.. వోడ్కా తాగేసి రాజమౌళి రచ్చ