Special Hostels: ఏపీ ప్రభుత్వం( AP government ) దూకుడు మీద ఉంది. దూకుడుగా నిర్ణయాలు తీసుకుంటోంది. అందులో భాగంగా ప్రజల కోసం ఉచితంగా హాస్టల్స్ ను ఏర్పాటు చేసింది. అక్కడ బెడ్, ఫుడ్ పూర్తిగా ఉచితమే. ఈ మేరకు విజయవాడలో వీటిని ఏర్పాటు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. నగరానికి ఉపాధి, ఉద్యోగం కోసం వచ్చిన వారికి ప్రభుత్వం వసతి గృహాలు అందిస్తోంది. మొత్తం నాలుగు చోట్ల 100 పడకల గృహాలు ఉన్నాయి. ఆధార్ కార్డు చూపిస్తే ఉచితంగా వసతి, భోజనం, స్నానాల గదులు అందుబాటులో ఉంటాయి. పని కోసం నగరానికి వచ్చిన వారికి ఇది మంచి అవకాశం. ఉద్యోగ, ఉపాధి నిమిత్తం నగరానికి వచ్చేవారు ఇబ్బందులు పడుతుంటారు. అటువంటి వారి కోసమే ఈ వసతి గృహాలు పనిచేస్తున్నాయి.
Also Read: పిల్లలను కనండి.. బాబు కోరిక వైరల్!
* ప్రభుత్వ మంచి ఆలోచన
చాలామంది నిరాశ్రయులు ప్రైవేటు లాడ్జిల్లో( private Lodges) వసతి పొందేందుకు ఇబ్బంది పడుతుంటారు. వారికోసం ప్రభుత్వం మంచి ఆలోచనతో ఈ వసతి గృహాలను అందుబాటులోకి తెచ్చింది. ఆశ్రయం లేని నిరుద్యోగుల కోసం మున్సిపల్ కార్పొరేషన్ నాలుగు చోట్ల వసతి గృహాలు ఏర్పాటు చేసింది. కేవలం ఆధార్ కార్డు ఉంటే చాలు.. రూపాయి ఖర్చు లేకుండా ఆశ్రయం పొందవచ్చు. అక్కడ భోజనం, టీవీ, యోగా లాంటి సౌకర్యాలు కూడా అందుబాటులో ఉన్నాయి. అయితే ఇటువంటి వసతి గృహాలు అందుబాటులోకి వచ్చినట్లు ఎవరికి తెలియదు. సరైన ప్రచారం లేకపోవడంతో చాలామంది ప్రైవేట్ లాడ్జిల్లో డబ్బులు చెల్లించి ఉంటున్నారు.
* విజయవాడలో నాలుగు చోట్ల..
ఏపీలో కూటమి ప్రభుత్వం( Alliance government ) జాతీయ పట్టణ జీవనోపాధుల పథకం కింద ఈ వసతి గృహాలను ఏర్పాటు చేసింది. విజయవాడలోని విద్యాధరపురం, రాణి గారి తోట, గాంధీనగర్, వెహికల్ డిపో ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేశారు. ఒక్కో వసతి గృహంలో వంద పడకలు అందుబాటులో ఉన్నాయి. ఇక్కడకు వచ్చినవారు ఆధార్ కార్డు చూపిస్తే చాలు అన్ని వసతులు కల్పిస్తారు. అలాగని రోజుల తరబడి అక్కడే ఉంటాం అంటే కుదరదు. ఉపాధితో పాటు ఏదైనా ఉద్యోగం దొరికే వరకు మాత్రమే అక్కడ ఉండొచ్చు.
* అన్ని రకాల వసతులు..
ఈ వసతి గృహాల్లో( hostels ) పడుకునేందుకు వీలుగా మంచం, దుప్పట్లు అందజేస్తారు. మరుగుదొడ్లతో పాటు స్నానాల గదులు ఉంటాయి. ఉదయం టిఫిన్, రాత్రి భోజనం కూడా అందిస్తారు. ఖాళీ సమయంలో చూసుకునేందుకు టీవీ సదుపాయం కూడా ఉంది. ఎవరికైనా ఆసక్తి ఉంటే ధ్యానం, యోగ సైతం నేర్పిస్తారు. అత్యవసర సమయంలో వైద్య సేవలు కూడా అందుబాటులో ఉంటాయి. అయితే ప్రజలకు అవగాహన లేక వినియోగించుకోవడం లేదు. దీంతో ఈ వసతి గృహాలు ఖాళీగా కనిపిస్తున్నాయి. ప్రభుత్వం ప్రచారం చేస్తే దీనిపై అవగాహన పెరిగే అవకాశం ఉంది.