CM Chandrababu: ఒకరు ముద్దు.. ఇద్దరు కంటే అధికం వద్దు.. జనాభా విషయంలో ఇప్పటివరకు ప్రభుత్వం ఇస్తున్న నినాదం ఇది. కానీ ఏపీ సీఎం చంద్రబాబు( AP CM Chandrababu) మాత్రం అందుకు విరుద్ధంగా ఉన్నారు. ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లలను కణాలని రాష్ట్ర ప్రజలకు పిలుపునిస్తున్నారు. జనాభా ఎంత పెరిగితే రాష్ట్రానికి అంత మంచిదని చెబుతున్నారు. రాష్ట్ర జనాభా తగ్గితే ప్రమాదకరమని.. పెరగాలంటే ప్రతి ఒక్కరూ పిల్లలను ఎక్కువగా కణాలని పిలుపునిస్తున్నారు. తాజాగా ఈరోజు కృష్ణాజిల్లాలో జరిగిన బాబు జగజీవన్ రామ్ జయంతి కార్యక్రమానికి హాజరైన సీఎం చంద్రబాబు ఈ కీలక వ్యాఖ్యలు చేశారు.
Also Read: కొలికపూడిని కనీసం పట్టించుకోని బాబు.. వీడియో వైరల్
* గత కొద్ది రోజులుగా ఇవే కామెంట్స్..
ఏపీ సీఎం చంద్రబాబు గత కొద్దిరోజులుగా జనాభా పెరుగుదల విషయంలో సంచలన కామెంట్స్ చేస్తూ వచ్చారు. జనాభా పెరుగుదల, ఎక్కువమంది పిల్లలను కనడం పై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ వచ్చారు. ఉత్తరప్రదేశ్( Uttar Pradesh), బీహార్లలో అధిక జనాభా ఉండడం సమస్య కాదని.. స్వాగతించాల్సిన విషయమని చెప్పుకొచ్చారు. అధిక జనాభా ఉండడం ప్రయోజనకరమని చెబుతున్నారు చంద్రబాబు. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో వయోధిక వృద్ధుల సంఖ్య అధికంగా ఉంటుందని.. యూరప్ చైనా జపాన్లలో వృద్ధుల సంఖ్య ఎక్కువ అని అన్నారు. దక్షిణాది రాష్ట్రాలు కూడా జనాభా పెరుగుదలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఎక్కువమంది పిల్లలను కనాలని కూడా అన్నారు.
* ఉద్యోగ, ఉపాధి అవకాశాలు తగ్గుముఖం
సాధారణంగా రెండు జీతాలు ఒక్క సంతానం చాలని ఎక్కువ మంది అభిప్రాయపడుతుంటారు. అది తప్పుడు అభిప్రాయం అన్నది చంద్రబాబు వాదన. పిల్లలను కనక పోవడం వల్ల యువత( youth people) సంఖ్య తగ్గుముఖం పడుతోందని ఒక అంచనా ఉంది. తద్వారా ఉద్యోగ ఉపాధ్యాయ అవకాశాలు తగ్గుతాయని.. యువత అనేది నిరంతరాయంగా ఉత్పత్తి జరిగితేనే ఉద్యోగ,ఉపాధి అవకాశాలు పెరిగే అవకాశం ఉంది. జనాభా తగ్గడం వల్ల యువత సంఖ్య కూడా తగ్గుముఖం పడుతోందని.. అది దేశానికే ప్రమాదకరమన్నది చంద్రబాబు అభిప్రాయం. ఉత్తరాది రాష్ట్రాలతో పోలిస్తే దక్షిణాది రాష్ట్రాల్లో జనాభా చాలా తక్కువ. దానివల్ల కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ప్రయోజనాలు కూడా ఆశించిన స్థాయిలో దక్కడం లేదు.
* ఆర్థిక, రాజకీయ కారణాలతో..
సాధారణంగా ఆర్థిక సంఘం( financial grants ) నిధులను జనాభాకు అనుసరించి కేటాయిస్తారు. కానీ దక్షిణాది రాష్ట్రాల్లో జనాభా తగ్గడం వల్ల ఆర్థిక సంఘం నిధులు కూడా తగ్గిపోతున్నాయి. యువత లేక ఉద్యోగ ఉపాధి అవకాశాలు తగ్గుముఖం పడుతున్నాయి. తాజాగా నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ కూడా ప్రారంభమైంది. జనాభా ప్రాతిపదికన పునర్విభజన చేస్తుండడంతో.. దక్షిణాది రాష్ట్రాల్లో నియోజకవర్గాల పెంపు అంతంత మాత్రమే. ఇక్కడితో పోల్చుకుంటే ఉత్తరాది రాష్ట్రాల్లో నియోజకవర్గాలు ఎక్కువగా పెరుగుతున్నాయి అన్నది దక్షిణాది పాలకుల అంచనా. ఈ పరిణామాలన్నింటినీ గమనించిన చంద్రబాబు రాష్ట్రంలో జనాభా పెరుగుదల ఉండాలని చెబుతున్నారు. ఇటీవల చాలా వేదికల్లో ఇదే చెప్పారు. తాజాగా చంద్రబాబు చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
ఏపీలో 2035 నాటికి జనాభా పెరగకపోతే ఊరిలో పిల్లలు ఉండరు, ముసలి వాళ్ళే ఉంటారు.. తర్వాత ఊర్లు కూడా ఉండవు
అందరూ చనిపోతే ఊర్లు ఏం ఉంటాయి – ఏపీ సీఎం చంద్రబాబు pic.twitter.com/iCMpiJ0gVe
— Telugu Scribe (@TeluguScribe) April 5, 2025