IPL 2025: సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు పై హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతీకారం తీర్చుకుందా? అనే అనుమానాలు ఇప్పుడు పెట్టమవుతున్నాయి.. వాస్తవానికి హైదరాబాద్ మైదానంపై 200 కంటే తక్కువ కాకుండా పరుగులు నమోదు అవుతాయి. గతంలో జరిగిన మ్యాచులు ఇదే నిరూపించాయి. అయితే ఆదివారం జరిగిన మ్యాచ్లో మాత్రం ముందుగా బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ తీవ్రంగా ఇబ్బంది పడింది. అసలు ఆడుతోంది హైదరాబాద్ జట్టైనా అనే అనుమానం కలిగింది… అయితే సోషల్ మీడియాలో దీనిపై రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి.. గత సంప్రదాని కంటే భిన్నంగా ఈ పిచ్ ను స్లో వికెట్ గా రూపొందించారా? అని సన్ రైజర్స్ హైదరాబాద్ అభిమానులు తమ అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు.
Also Read: సన్ రైజర్స్ ను దెబ్బకొట్టిన హైదరాబాదీ!
ఇదే వేదికపై ఆదివారం జరిగిన మ్యాచ్లో గుజరాత్ జట్టుపై హైదరాబాద్ అన్ని విభాగాలలో విఫలమైంది. 7 వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఈ మ్యాచ్ కోసం స్లో పిచ్ తయారు చేయడంతో అభిమానులు ఆశ్చర్యపోయారు. విశ్లేషకులు అవాక్కయ్యారు.. హైదరాబాద్ కెప్టెన్ కమిన్స్ సైతం ఆగ్రహం వ్యక్తం చేశాడు..” ఈ పిచ్ ను స్లో వికెట్ గా రూపొందించారు. గతనికంటే భిన్నంగా పిచ్ ను తీర్చిదిద్దారు అసలు వికెట్ ఇంత స్లోగా ఉంటుందని కలలో కూడా ఊహించలేదు. ఇది ఏ మాత్రం హైదరాబాద్ సాంప్రదాయ పిచ్ కాదు. చాటింగ్ చేయడం చాలా ఇబ్బందిగా మారింది. అందువల్లే మ్యాచ్ పై పట్టు సాధించడం కుదరలేదు. ఆశించినంత సులభంగా స్పిన్ కూడా దక్కలేదు. పరుగులు తక్కువగా చేయడం వల్ల గుజరాత్ ముందు భారీ లక్ష్యాన్ని ఉంచలేకపోయాం. గుజరాత్ జట్టు కూడా బ్యాటింగ్ అద్భుతంగా చేసింది..డ్యూ ప్రభావం కూడా మ్యాచ్ ఫలితాన్ని మాకు వ్యతిరేకంగా ఉంచిందని” కమిన్స్ వ్యాఖ్యానించడం విశేషం.. వాస్తవానికి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ డాంబర్ రోడ్డు లాంటి బ్యాటింగ్ ట్రాక్లను ఏర్పాటు చేస్తుంది.. కానీ ఈసారి స్లో వికెట్ గా రూపొందించడం అనుమానాలకు కారణమవుతోంది. స్లో వికెట్ మీద హైదరాబాద్ ఆటగాళ్లు అంతగా ఆడలేరు. అందువల్లే ఉద్దేశపూర్వకంగా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ స్లో వికెట్ గా పిచ్ ను రూపొందించిందని క్రికెట్ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీని ద్వారా సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు పై హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ రివెంజ్ తీర్చుకుందని నెటిజన్లు సోషల్ మీడియాలో ఆరోపిస్తున్నారు.
ఇదీ గొడవకు కారణం
ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో కాంప్లిమెంటరీ టికెట్ల విషయంలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్, సన్ ప్రజాస్ హైదరాబాద్ మధ్య వాగ్వాదం జరిగింది . ఇష్టంగా ఇచ్చే పాస్ ల విషయంలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ తమను బెదిరిస్తోందని.. తీవ్రంగా ఇబ్బంది పెడుతోందని సన్ రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం ఒక లేఖ రాసింది. దానిని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కు మెయిల్ చేసింది. ఆ లేఖ బయటపడడం సంచలనం కలిగించింది. దీనికి సంబంధించి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ వ్యవహారంలో కలగజేసుకున్నారు. విజిలెన్స్ విచారణకు ఆదేశించారు. దీంతో విజిలెన్స్ అధికారులు రంగంలోకి దిగడంతో ఒకసారి గా పరిస్థితి మారిపోయింది. ఆ తర్వాత హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ దేవరాజ్, సన్ రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం తో చర్చలు జరపడంతో కథ ముగిసింది..
అడ్వాంటేజ్ లేదు
ఇక ఈ గొడవను అటు సన్రైజర్స్ యాజమాన్యం.. ఇటు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సుహృద్భావ వాతావరణంలో ముగించారు. ఆ తర్వాత హైదరాబాద్ యాజమాన్యం.. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ గొడవ ముగిసిందని సంయుక్తంగా ప్రకటన చేశాయి. ఈ గొడవ ముగిసిన తర్వాత ఉప్పల్ మైదానంలో పిచ్ ను స్లో వికెట్ గా రూపొందించడంతో.. హైదరాబాద్ జట్టు ఓడిపోయింది. దీంతో ఇటీవల జరిగిన భాగవతం మళ్ళీ తెరపైకి వచ్చింది.. హైదరాబాద్ జట్టుకు ప్రధాన బలం బ్యాటింగ్ అని.. అలాంటి జట్టును దెబ్బతీసేందుకే స్లో వికెట్ రూపొందించారని క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు.. హైదరాబాద్ జట్టుకు సొంతమైదానంలో ఆడుతున్న అడ్వాంటేజ్ లేకుండా చేశారని విమర్శిస్తున్నారు. సన్ రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం ఆరోపణలు చేయడంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ జగన్ మోహన్ రావు మ్యాచ్లో నిర్వహించేందుకు దూరంగా ఉంటున్నారు. అయినప్పటికీ విమర్శలు ఏమాత్రం ఆగడం లేదు.