https://oktelugu.com/

TTD Laddu Issue: తిరుమల లడ్డూ వివాదం.. రంగంలోకి సిట్!

ప్రపంచవ్యాప్తంగా శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి. తిరుమల లడ్డులో జంతు కొవ్వు కలిసింది అన్న ఆరోపణలు వచ్చాయి. దీనిపై స్పందించిన దేశ అత్యున్నత న్యాయస్థానం సిట్ బృందాన్ని నియమించింది.

Written By: Dharma, Updated On : November 16, 2024 6:08 pm
TTD Laddu Issue(5)

TTD Laddu Issue(5)

Follow us on

TTD Laddu Issue: తిరుమల లడ్డూ వివాదం పై విచారణ ప్రారంభించింది సిట్. కొద్దిరోజుల కిందట తిరుమలలో జంతు కొవ్వు కలిసిందన్న ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ఎన్డీఏ శాసనసభ పక్ష సమావేశంలో సీఎం చంద్రబాబు లడ్డు గురించి ప్రస్తావించారు.వైసిపి ప్రభుత్వ హయాంలో టీటీడీ లడ్డూను సైతం కలుషితం చేశారని సంచలన ఆరోపణలు చేశారు.ఆ లడ్డులో జంతు కొవ్వు కలిసిందన్నది ప్రధాన ఆరోపణ. ఇది పెను దుమారానికి దారితీసింది. ప్రపంచ వ్యాప్తంగా శ్రీవారి భక్తులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఈ నేపథ్యంలో వైసిపి సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అంతకుముందే రాష్ట్ర ప్రభుత్వం అత్యున్నత ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ ను ఏర్పాటు చేసింది. కానీ వైసీపీ పిటిషన్ తో సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. సిబిఐ నేతృత్వంలోని ప్రత్యేక సీట్ ఏర్పాటు చేసింది న్యాయస్థానం. కేంద్రం నుంచి ఇద్దరు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇద్దరితోపాటు ఆహార కల్తీ నియంత్రణ అధికారిని ఆ బృందంలో నియమించాలని ఆదేశించింది. అయితే నెలలు గడుస్తున్నా విచారణ ప్రారంభం కాలేదు. ఎట్టకేలకు తాజాగా సిబిఐ నేతృత్వంలోని సిట్ బృందం తిరుమల చేరుకుంది. విచారణకు ఉపక్రమిస్తోంది.

* తిరుమలకు సిట్ బృందం
తాజాగా తిరుమల చేరుకుంది ఆ సిట్ బృందం. తమకు వసతులు చేకూర్చాలని టీటీడీని కోరింది. తమకు సహకారం అందించేందుకు మరో 30 మంది అధికారులను కావాలని అడిగింది. ఇందులో నలుగురు డిఎస్పీలు, 8 మంది సీఐలు, ఇద్దరు ఎస్ఐలతో పాటు మరికొందరు సిబ్బంది ఉండనున్నారు. ఈ మేరకు రాష్ట్ర పోలీస్ శాఖ ఏర్పాట్లు చేస్తోంది. అయితే ఈ బృందానికి మాత్రం సిబిఐ నుంచి ఇద్దరు, రాష్ట్ర పోలీస్ శాఖ నుంచి మరో ఇద్దరూ నేతృత్వం వహించనున్నారు. ఆహార కల్తీ నియంత్రణ అధికారి సైతం ఉంటారు.

* ఏర్పాట్లు చేస్తున్న టిడిపి
టీటీడీ పరంగా తమకు గెస్ట్ హౌస్ ఏర్పాటు చేయాలని ఈ సిట్ బృందం కోరింది. కంప్యూటర్లు, ప్రింటర్లు, ఇతరత్రా పరికరాలను సైతం సమకూర్చాలని విన్నవించింది. రేపటి నుంచి సీట్ విచారణ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. అయితే ఈ లడ్డు వివాదం నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటుచేసిన సిట్ బృందం కొంతవరకు విచారణ చేపట్టింది. తిరుమలలో దర్యాప్తు చేపట్టింది. కీలక విభాగాలను పరిశీలించింది.