Homeఆంధ్రప్రదేశ్‌Nara Lokesh dinner meeting: క్రీడా పోటీలు, డిన్నర్ మీటింగులు.. వైసీపీ నేతల ఆవేదన అదే!

Nara Lokesh dinner meeting: క్రీడా పోటీలు, డిన్నర్ మీటింగులు.. వైసీపీ నేతల ఆవేదన అదే!

Nara Lokesh dinner meeting: ఏపీలో( Andhra Pradesh) రాజకీయ క్రీడ జరుగుతోంది. ఎత్తుకు పైఎత్తులు కొనసాగుతున్నాయి. అయితే ఈ క్రమంలో అధికార, విపక్షం మధ్య రాజకీయ క్రీడ జరుగుతుండగా.. క్రీడా పోటీల్లో రిలాక్స్ అవుతున్నారు కూటమి ప్రజాప్రతినిధులు. గత కొద్ది రోజులుగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల క్రీడా పోటీలు జరుగుతున్నాయి. ఉత్సాహ భరిత వాతావరణంలో ఇవి కొనసాగుతున్నాయి. ప్రొఫెసనల్స్ మాదిరిగా క్రీడలు ఆడుతున్నారు ప్రజాప్రతినిధులు. అయితే ఇప్పటికే సభకు హాజరుకాని వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఈ క్రీడలకు దూరంగా ఉన్నారు. అయితే వైసిపి నుంచి ఒక మాట వినిపిస్తోంది. సభ బాగుంది.. ఆటలు బాగున్నాయి.. కానీ తమకు ఆ అదృష్టం లేదన్న ఆవేదన వైసిపి ఎమ్మెల్యేలతో పాటు ఎమ్మెల్సీల్లో ఉన్నట్లు ప్రచారం నడుస్తోంది. అయితే ఒక్క క్రీడలే కాదు.. తమకు అధినాయకత్వం ఆదరణ కూడా లేదని వైసీపీ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం లోకేష్ డిన్నర్ మీటింగ్స్ విత్ ఫ్యామిలీస్ చూస్తుంటే ఎవరికైనా కంటగింపుగా ఉంటుంది.

సీఎం అపాయింట్మెంట్ సైతం
రాష్ట్ర ముఖ్యమంత్రి క్షణం తీరిక లేకుండా ఉంటారు. అది సహజం కూడా. ప్రస్తుతం సీఎం చంద్రబాబు( CM Chandrababu) సైతం బిజీగా ఉన్నారు. అమరావతి రాజధాని నిర్మాణం తో పాటు పోలవరం పై ఫుల్ ఫోకస్ పెట్టారు. విదేశీ పెట్టుబడులు తీసుకొస్తున్నారు. కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకుంటున్నారు. ఆయనకున్న తక్కువ కాలంలో ఎమ్మెల్యేలను కలిసేందుకు అవకాశం ఇస్తున్నారు. నియోజకవర్గాల సమస్యలపై తనను కలిసేందుకు వచ్చే ఎమ్మెల్యేలకు అవకాశం కల్పిస్తున్నారు. గతంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో ఈ పరిస్థితి లేదని స్వయంగా వైసిపి వర్గాలే చెబుతుంటాయి. జగన్మోహన్ రెడ్డిని కలవాలంటే సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి వారిని దాటి వెళ్లాల్సి వచ్చేదని స్వయంగా ఆరోపించిన వారు ఉన్నారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. కోరిందే తడువుగా ఎమ్మెల్యేలకు చాన్స్ ఇస్తున్నారు చంద్రబాబు.

Also Read: కూటమి బ్రహ్మాస్త్రం.. వైసీపీ తప్పించుకోలేదా?!

విందుకు ఆహ్వానించి..
ఇంకోవైపు మంత్రి నారా లోకేష్( Minister Nara Lokesh ) మంచి సంస్కృతిని ప్రారంభించారు. పార్టీ ఎమ్మెల్యేలతో పాటు ఎమ్మెల్సీలకు, ఎంపీలకు, ముఖ్య నేతల కుటుంబాలకు డిన్నర్ మీటింగ్స్ కు ఆహ్వానిస్తున్నారు. వారితో ఆత్మీయంగా గడుపుతున్నారు. అయితే గతంలో జగన్ విషయంలో అలా కాదు. ఎక్కడో వర్క్ షాప్ లు నిర్వహించినప్పుడు, ఏదైనా ఫంక్షన్లు జరిగినప్పుడు అంత దూరం నుంచి చూడడమే తప్ప.. దగ్గరకు వెళ్లి అధినేతను కలిసేందుకు కూడా అప్పట్లో అవకాశం లేదు. ఏదైనా పర్యటనలకు వెళితే చాలు ఏవేవో ఆదేశాలు వచ్చాయి. ఎప్పటికప్పుడు ఐప్యాక్ వెంటాడేది. స్థానికంగా అందుబాటులో ఉండడం లేదని కేంద్ర కార్యాలయానికి సమాచారం ఇచ్చేవారు. అయితే కూటమిలో ఆ పరిస్థితి లేదు. మరోవైపు ఎమ్మెల్యేలతో పాటు ఎమ్మెల్సీలకు క్రీడా పోటీలు జరుగుతున్నాయి. గతంలో ఎన్నడు ఈ పరిస్థితి లేదన్న ఆవేదన వైసీపీలో కనిపిస్తోంది.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version