ఏపీలోనూ బీజేపీ బలపడనుందా.?

దుబ్బాక ఎన్నిక ఫలితం రాగానే తెలంగాణలో బీజేపీ పుంజుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయిని చర్చించుకుంటున్నారు. దీంతో ఆంధ్రప్రదేశ్ బీజేపీలోనూ బీజేపీని బలోపేతంల చేయానలి ఆ పార్టీ నాయకులు భావిస్తున్నట్లు తెలుస్తోంది.  గత ఏపీ ఎన్నికల్లో కమలం పార్ఒటీ క్క సీటును కూడా గెల్చుకోలేకపోయింది. ఇప్పుడు దుబ్బాక ఎన్నికలో టీ బీజేపీ వ్యవహరించిన తీరు మాదిరిగానే ఏపీలో సైతం దూకుడుగా వ్యవహరించి పార్టీని బలోపేతం చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు […]

Written By: NARESH, Updated On : November 11, 2020 12:15 pm
Follow us on

దుబ్బాక ఎన్నిక ఫలితం రాగానే తెలంగాణలో బీజేపీ పుంజుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయిని చర్చించుకుంటున్నారు. దీంతో ఆంధ్రప్రదేశ్ బీజేపీలోనూ బీజేపీని బలోపేతంల చేయానలి ఆ పార్టీ నాయకులు భావిస్తున్నట్లు తెలుస్తోంది.  గత ఏపీ ఎన్నికల్లో కమలం పార్ఒటీ క్క సీటును కూడా గెల్చుకోలేకపోయింది. ఇప్పుడు దుబ్బాక ఎన్నికలో టీ బీజేపీ వ్యవహరించిన తీరు మాదిరిగానే ఏపీలో సైతం దూకుడుగా వ్యవహరించి పార్టీని బలోపేతం చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు పగ్గాలు చేపట్టిన నాటి నుంచే దూకుడు స్వభావాన్ని పెంచారు. ఇప్పడు తెలంగాణలో బీజేపీ పుంజుకోవడంతో ఏపీలోనూ తనదైన శైలిలో పార్టీని లీడింగ్ లోకి తీసుకురావడానికి ప్రయత్నాలు చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

Also Read: ఏపీలో సోము వీర్రాజు కూడా మొదలుపెట్టేశాడట!
`
మొన్నటి వరకు తెలంగాణ రాష్ట్రంలో కూడా బీజేపీ పెద్దగా చెప్పుకునే పార్టీ కాదు. కానీ గత పార్లమెంట్ ఎన్నికల నుంచి కాస్త ఉనికిని చాటుకుంది. తాజాగా దుబ్బాక ఎన్నిక తరువాత మరింత పుంజుకున్నట్లయింది. ఈ ఎన్నికలో భాగంగా కేసీఆర్ ప్రత్యేకంగా బీజేపీపై విమర్శలు చేయడంతో ప్రధాన ప్రతిపక్షంగా బీజేపీనే ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా నగదు పట్టివేత, పోలీసుల అండతో ఆ పార్టీని అణిచివేయాలని ప్రయత్నించింది. అయితే అణచివేతతోనే పార్టీ బలపడుతుందని దుబ్బాక ఎన్నికలో టీబీజేపీ నాయకులు నిరూపించారు.

Also Read: తెలంగాణలో కమల వికాసం.. ఏపీ బీజేపీపైనే ఒత్తిడి!

దుబ్బాక ప్రచారంలోనూ బీజేపీ నాయకులు ఒక్కతాటిపై ఉండి అభ్యర్థి రఘునందన్ రావు గెలుపునకు తీవ్రంగా ప్రయత్నించారు. ఎలాంటి భేద, తారతమ్యాలు లేకుండా ప్రచారంలో దూసుకెళ్లారు. దీంతో ప్రజలు సైతం బీజేపీ ప్రవర్తనను పరిగణలోకి తీసుకొని ఆ పార్టీపై నమ్మకం ఉంచారు.

మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్

ఈ పరిణామంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజుపై ఇప్పడు ద్రుష్టిని సారించారు. ఎలాగైనా వచ్చే ఎన్నికల్లో  బీజేపీని బలపరిచేవిధంగా క్రుషి చేయాలని సీనియర్ నాయకులు అంటున్నారు.  అయితే ఇప్పటికే అంతర్వేది, అమరావతి రైతుల విషయంలో బీజేపీ దూకుడుగా వ్యవహరిస్తోంది. దుబ్బాకలో దూకుడు స్వభావమే పనిచేసింది. ఇక్కడ కూడా అదే మాదిరిగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా  చేపట్టిన కార్యక్రమాలతో పార్టీ ప్రతిష్ట పెంచుకోవచ్చని రాష్ట్ర బీజేపీ నాయకత్వం భావిస్తోంది.