‘దుబ్బాక’పై కోట్లలో బెట్టింగ్ లు.. టీఆర్ఎస్ ను నమ్మకున్నవారు తీవ్రంగా లాస్..!

ఐపీఎల్ కంటే తీవ్ర ఉత్కంఠతో దుబ్బాక ఉప ఎన్నిక లెక్కింపు జరిగింది. రౌండ్ రౌండ్ కు తేడా వస్తూ టీఆర్ఎస్, బీజేపీ నాయకులను ముచ్చెమటలకు గురిచేసింది. చివరి రౌండ్ వరకు ఏ పార్టీ గెలుస్తుందే చెప్పలేని పరిస్థితి. దీంతో దుబ్బాక ప్రజలే కాకుండా తెలుగువారు ఎక్కడున్న ఈ పలితం కోసం కళ్లు కాయలు కాసేలా టీవీలు, సోషల్ మీడియాల్లో మునిగిపోయారు. ఇదే సమయంలో దుబ్బాక ఎన్నికపై జోరుగా బెట్టింగ్లు సాగాయని తెలుస్తోంది. ఏకంగా కోట్ల రూపాయల్లో బెట్టింగ్ […]

Written By: NARESH, Updated On : November 11, 2020 11:29 am
Follow us on

ఐపీఎల్ కంటే తీవ్ర ఉత్కంఠతో దుబ్బాక ఉప ఎన్నిక లెక్కింపు జరిగింది. రౌండ్ రౌండ్ కు తేడా వస్తూ టీఆర్ఎస్, బీజేపీ నాయకులను ముచ్చెమటలకు గురిచేసింది. చివరి రౌండ్ వరకు ఏ పార్టీ గెలుస్తుందే చెప్పలేని పరిస్థితి. దీంతో దుబ్బాక ప్రజలే కాకుండా తెలుగువారు ఎక్కడున్న ఈ పలితం కోసం కళ్లు కాయలు కాసేలా టీవీలు, సోషల్ మీడియాల్లో మునిగిపోయారు. ఇదే సమయంలో దుబ్బాక ఎన్నికపై జోరుగా బెట్టింగ్లు సాగాయని తెలుస్తోంది. ఏకంగా కోట్ల రూపాయల్లో బెట్టింగ్ లు జరగడం విశేషం.

Also Read: టీఆర్‌‌ఎస్‌ వల్లే బీజేపీ గెలిచిందా..!

దుబ్బాక పోలింగ్ పూర్తవగానే కొన్ని సర్వే సంస్థలు ఎగ్జిట్ పోల్స్ ప్రకటించాయి. ఇందులో ఒకటి, రెండు మినహా మిగతా సర్వే సంస్థలన్నీ టీఆర్ఎస్ గెలుస్తాయని ప్రకటించాయి. ఇక కొన్ని సర్వే సంస్థలు మాత్రం భారీ మెజారిటీ కూడా వస్తాయని తెలిపారు. కేసీఆర్ ను ఎప్పడు తిట్టిపోసుకునే మల్లన్న సైతం ఇక్కడ టీఆర్ఎస్ గెలుపు ఖాయమని ప్రకటించారు. దీంతో ఓవరాల్ గా టీఆర్ఎస్ దే విజయం అని అనుకున్నారు.

Also Read: టీఆర్‌‌ఎస్‌ను దెబ్బతీసిన సోషల్‌ మీడియా

ఈ నేపథ్యంలో కొందరు టీఆర్ఎస్ గెలుపుపై ఎక్కవ మొత్తంలో బెట్టింగ్ కట్టారు. బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు బంధువుల ఇంట్లో నగదు దొరికినప్పటి నుంచి బీజేపీ టీఆర్ఎస్ కు గట్టి పోటీనిచ్చింది. దీంతో కొందరు బీజేపీపై బెట్టు కట్టారు. కానీ పోలింగ్ పూర్తయిన తరువాత మాత్రం టీఆర్ఎస్ పై కోట్లలో బెట్లు కట్టినట్లు సమాచారం. ఇప్పడు ఫలితం తారుమారు కావడంతో వారంతా లబోదిబోమంటున్నారు.

మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్

పోలింగ్ తరువాత కంటే లెక్కింపు రోజు బెట్టింగ్ జోరుగా సాగింది. దుబ్బాకలో లెక్కింపు జరగగా విదేశాల్లో బెట్టింగ్ జరిగినట్లు విశ్వసనీయ సమాచారం. ఇతర దేశాల్లోని తెలుగువారు ఇక్కడి ప్రచార ఊపు చూసిన తరువాత బెట్టింగ్ లోకి దిగినట్లు సోషల్ మీడియా కోడై కూస్తోంది. మొదటి నుంచి ఐదు రౌండ్లలోపు టీఆర్ఎస్ కు బెట్టు కట్టిన వారు బీజేపీపై మక్కువ చూపారు. ఆ తరువాత సీన్ మారడంతో టీఆర్ఎస్ గెలుస్తుందని భావించి కోట్లలో బెట్టింగ్ నడిచినట్లు తెలుస్తోంది. ఇలా పెట్టిన తరువాత చివరి రౌండ్ వచ్చేసరికి అనుకున్న ఫలితం రాకపోవడంతో తీవ్ర నిరాశకు గురయ్యారు. ఇలా దుబ్బాక ఉప ఎన్నిక ఏ రేంజ్ లో ప్రభావితం చేసిందో చెప్పుకోవచ్చు.