https://oktelugu.com/

బీహార్ ఫలితం ఏయే రాష్ట్రాలపై ప్రభావం చూపనుంది..?

బీహార్ ఎన్నికల ఫలితాల్లో ఎన్టీయే కూటమి సత్తా చాటింది. ఈ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో జేడీయూతో కలిసి వెళ్లిన బీజేపీకి, జేడీయూ కంటే బీజేపీకే ఎక్కవ స్థానాలు వచ్చాయి. అయితే ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం నితీశ్ కుమార్ సీఎం అయ్యే అవకాశం కనిపిస్తోంది. అయితే బీహార్ ఎన్నికల  ఫలితాలు సమీప రాష్ట్రాలపై పడుతాయా..? అనే ప్రశ్న అందరిలో మొదలయింది. ముఖ్యంగా త్వరలో పశ్చిమ బెంగాల్ లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో బీహార్ పక్కన ఉండే […]

Written By:
  • NARESH
  • , Updated On : November 11, 2020 11:19 am
    Follow us on

    Bihar Elections

    బీహార్ ఎన్నికల ఫలితాల్లో ఎన్టీయే కూటమి సత్తా చాటింది. ఈ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో జేడీయూతో కలిసి వెళ్లిన బీజేపీకి, జేడీయూ కంటే బీజేపీకే ఎక్కవ స్థానాలు వచ్చాయి. అయితే ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం నితీశ్ కుమార్ సీఎం అయ్యే అవకాశం కనిపిస్తోంది. అయితే బీహార్ ఎన్నికల  ఫలితాలు సమీప రాష్ట్రాలపై పడుతాయా..? అనే ప్రశ్న అందరిలో మొదలయింది. ముఖ్యంగా త్వరలో పశ్చిమ బెంగాల్ లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో బీహార్ పక్కన ఉండే ఈ రాష్ట్రంలో బీజేపీ మార్క్ ను చాటుకుంటుందా..? అన్న చర్చ మొదలయింది.

    Also Read: బరిలో ఎంఐఎం.. బీజేపీకే లాభమైంది..

    దేశవ్యాప్తంగా ఆకర్షణీయ పథకాలు, బీహార్ రాష్ట్రంలో ఉచిత గ్యాస్, ఇళ్ల నిర్మాణం తదితర పథకాల హామీలతో ఎన్డీయే కూటమిపై ప్రజలు ఆశలు పెంచుకున్నారు. దేశవ్యాప్తంగా మోదీకి ఉన్న క్రేజ్ తో పాటు వ్యవసాయంపై చూపుతున్న శ్రద్ధ బీజేపీకి ఇక్కడ కలిసోచ్చింది. అయితే కూటమిలోని జేడీయూను మాత్రం ప్రజలు ఆదరించలేకపోయారు. చాలా స్థానాల్లో జేడీయూ స్వల్ప మెజారిటీతో గెలుపొందింది. అయితే ఎన్ని సీట్లు వచ్చినా నితిశ్ కుమార్ ముఖ్యమంత్రి అని బీజేపీ నాయకులు చెప్పడంతో మళ్లీ ఆయనే గద్దనెక్కే అవకాశం ఉంది.

    Also Read: బీహార్ ఫలితం ఏయే రాష్ట్రాలపై ప్రభావం చూపనుంది..?

    త్వరలో పశ్చిమ బెంగాల్ లో ఈ విధంగా ఏదో విధంగా ప్రాంతీయ పార్టీతో పొత్తు పెట్టకొని ఎన్నికల బరిలో దిగాలని బీజేపీ భావిస్తోంది. ఇక్కడ ఫైర్ బ్రాండ్ గా ఇమేజ్ తెచ్చుకున్న మమత ఇప్పటి వరకు కాంగ్రెస్ తో కలిసి వెళ్తోంది. అయితే ఎన్నికల వరకు ఎలాంటి మార్పులైనా జరుగొచ్చు. కానీ బీజేపీని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్రంలో అధికారంలోకి రానివ్వమని సందర్భం వచ్చినప్పుడల్లా  చెప్పుకొస్తోంది. కానీ బీహార్ ఫలితం చూసిన తరువాత త్రుణమూల్ నేతల్లో కొంత ఆందోళన మొదలైంది.

    మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయ పాలిటిక్స్

    మరోవైపు అసోంలో ప్రస్తుతం బీజేపీ అధికారంలో ఉండగా త్వరలో జరిగే ఎన్నికలపై బీహార్ ప్రభావం ఉండే అవకాశం ఉందని అంటున్నారు విశ్లేషకులు. ఇక కేరళలో ఏ కొంచెం అవకాశం లేకపోయినా మోడీ వ్యూహంతో ముందుకెళ్లే అవకాశం ఉంది. దక్షిణాది రాష్ట్రమైన తమిళనాడులో బీజేపీ మెల్లమెల్లగా బలపడుతోంది. అన్నాడీఎంకే తో పొత్తు ఉన్నా బీజేపీలో బలమైన నాయకులు చేరుతున్నారు. ఇటీవల సినీ నటి, కాంగ్రెస్ నాయకురాలు కుష్బూ బీజేపీలోకి వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో ఎన్నికల వరకు బలపడి అన్నాడీఎంకేతో కలిసి అధికారంలోకి రావడంలో ఆశ్చర్యమేమీలేదంటున్నారు.