https://oktelugu.com/

Pawan Kalyan : పవన్ కు చంద్రబాబు మామూలుగా ప్రాధాన్యత ఇవ్వడం లేదుగా.. ఇదిగో ఫ్రూఫ్

Pawan Kalyan రేపు బాధ్యతలు స్వీకరించిన నేపథ్యంలో పవన్ కళ్యాణ్ నేడు సచివాలయానికి వెళ్ళనున్నారు. రేపు ముహూర్తం ప్రకారం డిప్యూటీ సీఎంతో పాటు తనకు కేటాయించినశాఖలకు మంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తారు పవన్.

Written By:
  • NARESH
  • , Updated On : June 18, 2024 / 01:24 PM IST

    Pawan Kalyan

    Follow us on

    Pawan Kalyan : పవన్ కళ్యాణ్ కు చంద్రబాబు ఎనలేని ప్రాధాన్యమిస్తున్నారు.టిడిపి కూటమి ఇంతటి ఘన విజయానికి పవన్ కళ్యాణ్ కారణమన్న విశ్లేషణలు ఉన్నాయి.అందుకు తగ్గట్టుగానే టిడిపి నుంచి పవన్ కళ్యాణ్ కు గౌరవ మర్యాదలు అందుతున్నాయి.పవన్ కోరిన విధంగానే డిప్యూటీ సీఎం హోదా దక్కింది. ఆయనకు అత్యంత ఇష్టమైన శాఖలు దక్కాయి. దీంతో ఎంతో ఆనందంగా ఉన్నారు పవన్. రేపు సచివాలయంలో మంత్రిగా బాధ్యతలు తీసుకోనున్నారు. తనతో సమానంగా పవన్ కళ్యాణ్ కు గౌరవం దక్కాలన్నది చంద్రబాబు అభిమతం. అందుకు తగ్గట్టుగానే అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.

    తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు కష్టకాలంలో ఉన్నప్పుడు నేనున్నాను అంటూ ముందుకు వచ్చి సాయం చేశారు పవన్. అవినీతి కేసుల్లో అరెస్ట్ అయి రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న చంద్రబాబును పరామర్శించారు. తెలుగుదేశం పార్టీతో పొత్తును ప్రకటించారు. నాటి నుంచి ఎన్నికల వరకు ప్రతి విషయంలోనూ పవన్ కళ్యాణ్ సహకరిస్తూనే ఉన్నారు. చంద్రబాబు నుంచి పవన్ ను దూరం చేసేందుకు ఎన్ని రకాల ప్రయత్నాలు జరిగినా.. పవన్ ఎన్నడూ వారికి అవకాశం ఇవ్వలేదు. పైగా టిడిపితో కలిసేందుకు ఇష్టపడని బిజెపిని సైతం ఒప్పించారు. బిజెపి కోసం తన సీట్లను సైతం వదులుకున్నారు. తనకున్న బలాన్ని అంచనా వేసుకుని 21 అసెంబ్లీ, రెండు పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేశారు. శత శాతం విజయాన్ని సొంతం చేసుకున్నారు. పవర్ షేరింగ్, ముఖ్యమంత్రి పదవి కావాలని పవన్ ఎటువంటి షరతులు పెట్టలేదు. ఇవన్నీ చంద్రబాబుతో పాటు టిడిపి శ్రేణుల్లో పవన్ కళ్యాణ్ పై గౌరవ భావాన్ని పెంచాయి.

    చంద్రబాబు పవన్ విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. మునిపటిలా ఇద్దరినీ డిప్యూటీ సీఎం పదవి ప్రకటించలేదు. పవన్ కు గౌరవం ఇవ్వాలన్న భావనతో ఒక్కరికి డిప్యూటీ సీఎం హోదా కట్టబెట్టారు. సచివాలయంలో తనతో పాటు ప్రత్యేక చాంబర్ వేయించారు. ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో తనతో పాటు పవన్ ఫోటో ఉండాల్సిందేనని ఆదేశాలు జారీ చేశారు. అటు పవన్ కు చంద్రబాబు భద్రత పెంచారు. వై ప్లస్ సెక్యూరిటీని సమకూర్చారు. ప్రత్యేక ఎస్కార్ట్ తో పాటు బుల్లెట్ ప్రూఫ్ కారును కేటాయించారు. అటు పవన్ కోసం ప్రత్యేకంగా నివాసాన్ని కూడా ఏర్పాటు చేశారు. రేపు బాధ్యతలు స్వీకరించిన నేపథ్యంలో పవన్ కళ్యాణ్ నేడు సచివాలయానికి వెళ్ళనున్నారు. రేపు ముహూర్తం ప్రకారం డిప్యూటీ సీఎంతో పాటు తనకు కేటాయించినశాఖలకు మంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తారు పవన్.