Astrologer Venu Swamy Pub photos goes Viral
Venu Swamy: వేణు స్వామి వివాదాస్పద వ్యాఖ్యలతో తరచుగా వార్తల్లో ఉంటారు. ఆయన ఇంటర్వ్యూల కోసం యూట్యూబర్స్ క్యూ కడుతూ ఉంటారు. అందుకు కారణం… ఆయన కాంట్రవర్సీ రాజేస్తూ ఉంటాడు. జనాలు సదరు వీడియోలను ఎగబడి చూస్తుంటారు. ఇటీవల వేణు స్వామికి వరుస షాక్ లు తగిలాయి. కీలక విషయాల్లో ఆయన చెప్పిన జ్యోతిష్యం తప్పయింది. ఆయన అంచనాలు తలకిందులు అయ్యాయి. 2023 తెలంగాణా అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ మూడోసారి విజయం సాధిస్తాడని చెప్పాడు. కానీ ఆయన ఓడిపోయారు.
అనంతరం ఫైనల్ కి చేరిన హైదరాబాద్ టీమ్ టైటిల్ కొడుతుందని జోష్యం చెప్పాడు. అది కూడా ఫెయిల్ అయ్యింది. కేకేఆర్ జట్టు టైటిల్ సొంతం చేసుకుంది. ఇక మూడో ప్రిడిక్షన్ ఏపీలో మళ్ళీ జగన్ వస్తాడని చెప్పాడు. తీరా చూస్తే వైఎస్ జగన్ ఘోరంగా ఓడిపోయాడు. జగన్ ఓటమి అనంతరం వేణు స్వామి ఓ వీడియో విడుదల చేశాడు. ఇకపై తాను సినిమాలు, రాజకీయాల మీద ఓపెన్ గా జ్యోతిష్యం చెప్పనని వెల్లడించాడు.
కాగా స్టార్ హీరోయిన్స్ తో దేవుళ్ళకు పూజలు చేయించే వేణు స్వామి పెద్ద జల్సా రాయుడు అని తెలుస్తుంది. ఆయన బాగోతం తాజాగా బయటపడింది. ఓ బార్ లో కూర్చుని మిత్రులతో వేణు స్వామి మందు కొడుతున్న వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. బహిరంగంగా వేణు స్వామి మద్యం సేవించడం చర్చకు దారి తీసింది. వేణు స్వామి నిజ స్వరూపం ఇదంటూ జనాలు ఆయనను ట్రోల్ చేస్తున్నారు.
Also Read: Fahadh Faasil: పుష్ప నటుడు ఒక్క రోజుకు అంత తీసుకుంటాడా..? కండిషన్స్ కూడా భారీగానే ఉన్నాయిగా…
అయితే గతంలోనే వేణు స్వామి తనకు మద్యం అలవాటు ఉన్నట్లు చెప్పాడు. తనకు సొంత మద్యం దుకాణాలు, బార్లు కూడా ఉన్నట్లు ఆయనే చెప్పారు. నా ప్రొఫెషన్ వేరు, పర్సనల్ లైఫ్ వేరు. మాకు కూడా సరదాలు ఉంటాయని ఆయన అన్నారు. ఇక హీరోయిన్స్, సెలెబ్రిటీల కోసం చేసే పూజల్లో వేణు స్వామి మద్యం, మాంసం నైవేద్యంగా పెడతాడట. పూజ విలువను బట్టి మద్యం బాటిల్ రేటు ఉంటుందని చెప్పాడు. రష్మిక మందాన, నిధి అగర్వాల్, డింపుల్ హయాతి వంటి హీరోయిన్స్ వేణు స్వామి చేత ప్రత్యేక పూజలు జరిపించారు.