https://oktelugu.com/

Good News For Students: విద్యార్థులకు గుడ్ న్యూస్.. మూడు రోజులు సెలవులు..

తెలంగాణ ప్రభుత్వం విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పింది. ప్రపంచ వ్యాప్తంగా నిర్వహించుకునే క్రిస్మస్ పండుగ సందర్భంగా మూడు రోజుల సెలవులను ప్రకటించింది. ఈ నెల 24 నుంచి 26 వరకు సెలవులు ఉండనున్నాయి. తెలంగాణ దసరా పండుగల సందర్భంగా అధికంగా సెలవులు ఉంటాయి.

Written By:
  • Srinivas
  • , Updated On : December 11, 2024 / 10:08 AM IST

    School holiday

    Follow us on

    Good News For Students: తెలంగాణ ప్రభుత్వం విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పింది. ప్రపంచ వ్యాప్తంగా నిర్వహించుకునే క్రిస్మస్ పండుగ సందర్భంగా మూడు రోజుల సెలవులను ప్రకటించింది. ఈ నెల 24 నుంచి 26 వరకు సెలవులు ఉండనున్నాయి. తెలంగాణ దసరా పండుగల సందర్భంగా అధికంగా సెలవులు ఉంటాయి. ఆ తరువాత సంక్రాంతికి సెలవులు ప్రకటిస్తారు. అయితే క్రిస్మస్ పండుగ సందర్భంగా మూడు రోజుల సెలవులను ప్రకటించారు. గతంలో క్రిస్మస్ సందర్భంగా 5 రోజులు సెలవులు ఇచ్చారు. కానీ వీటిని మూడు రోజులకు కుదించారు. ఈ సెలవులు హైదరాబాద్ తో పాటు రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు వర్తించనున్నాయి.

    తెలంగాణ ప్రభుత్వం పాఠశాలకు సంబంధించి ఇప్పటికే 2025 సెలవుల క్యాలెండర్ ను జారీ చేసింది. కొత్త ఏడాదిలో జనవరి 1వ తేదీని ఆప్షనల్ హాలిడేను ప్రకటించారు. అలాగే 14న సంక్రాంతి పండుగ సందర్భంగా సెలవులు ప్రకటించనున్నారు. ఈ సమయంలో 5 నుంచి 6 రోజుల పాటు సెలవులు ఉండే అవకాశం ఉంది. మార్చి 30న ఉగాది, ఏప్రిల్ 6న శ్రీరామనవమి, జూలై 21న బోనాలు, ఆగస్టు 27న సంక్రాంతి, అక్టోబర్ 2న దసరా పండుగ, అక్టోబర్ 20న దీపావళి సెలవులను ప్రకటించనున్నాయి.

    ఈ ఏడాది క్రిస్మస్ సందర్భంగా మూడు రోజుల పాటు సెలవులు ఇవ్వనున్నారు. 24న క్రిస్మస్ ఈవ్, 25న క్రిస్మస్, 26న బాక్సిండ్ డేను నిర్వహించుకోవడానికి సెలువులు ప్రకటించారు. ప్రపంచ వ్యాప్తంగా జరుపుకునే క్రిస్మస్ వేడుకలను తెలంగాణలోనూ వైభవంగా నిర్వహించుకోనున్నారు. ఊరూ, వాడ ఏసు క్రీస్తు నామ స్మరణ చేస్తూ వేడుకలు నిర్వహించుకుంటారు. ఈరోజు క్రిస్టియన్లు పవిత్రంగా ఉంటూ ప్రార్థనలు చేస్తుంటారు. ఆ తరువాత కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు కలుసుకుంటూ శుభాకాంక్షలు చెప్పుకుంటూ ఉంటారు. క్రిస్మస్ సందర్భంగా దూర ప్రాంతాల్లో ఉన్న వారు తమ కుటుంబ సభ్యుల వద్దకు చేరుకుంటారు.

    క్రిస్మస్ సందర్భంగా తెలంగాణలోని వివిధ ప్రాంతాల్లోని చర్చిలు ముస్తాబవుతున్నాయి. ముఖ్యంగా ప్రతిష్టాత్మకమైన మెదక్ లోని చర్చి సర్వాంగ సుందరంగా తీర్చి దిద్దుతున్నారు. ఇక్కడికి వేల కొద్ది క్రిస్టియన్లు వచ్చే అవకాశం ఉన్నందున అందుకు సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే మిగతా ప్రాంతాల్లోని చర్చిల్లో కూడా వేడుకల కోసం క్రిస్టియన్లు సిద్ధమవుతున్నారు. కొందరు ఇతర మతస్థులకు చెందిన వారు సైతం క్రిస్టియన్లను కలిసి శుభాకాంక్షలు తెలిపేందుకు రెడీ అవుతున్నారు. పాఠశాలల్లో క్రిస్మస్ గురించి తెలిపేందుకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

    క్రిస్మస్ తరువాత 26న బాక్సింగ్ డేను నిర్వహించుకుంటారు. సాధారణంగా బాక్సింగ్ డే అనగానే ఏదైనా క్రీడకు సంబంధించినది అని అనుకుంటారు. కానీ బాక్సిండ్ డే అంటే ఈరోజు ఇతరులకు బహుమతులు ఇస్తారు. కొన్ని బహుతులు ఒక బాక్స్ లో ఉంచి ఇతరులకు పంచడం వల్ల దీనికి బాక్సింగ్ డే అని పేరు వచ్చింది. 1871లో నుంచి దీనిని అధికారికంగా నిర్వహిస్తున్నారు. స్కాట్లాండ్, ఐర్లాండ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వంటి దేశాల్లో దీనిని అధికారికంగా నిర్వహిస్తున్నారు. భారత్ లోనూ దీనిని అధికారికంగా గుర్తించారు. ఈ రోజును అన్ని ప్రభుత్వాలు సెలవును ప్రకటిస్తాయి.