Homeఆంధ్రప్రదేశ్‌Senior Actor Naresh: ఏపీపై సీనియర్ నటుడు సంచలన ట్వీట్!

Senior Actor Naresh: ఏపీపై సీనియర్ నటుడు సంచలన ట్వీట్!

Senior Actor Naresh: ఏపీలో మతపరమైన విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి అనేది వాస్తవం. మొన్నటి వరకు సామాజిక వర్గాలపరంగా విద్వేషాలు రెచ్చగొట్టేందుకు ప్రయత్నాలు జరుగుతూ ఉండేవి. ప్రతి ఎన్నికల్లోను అది కామన్. కానీ ఈసారి కులం కాకుండా మతం బయటకు వచ్చింది. ముఖ్యంగా క్రైస్తవ, దళిత అంశం తెరపైకి వచ్చింది. అయితే దీని వెనుక ఉన్న రాజకీయ శక్తుల గురించి దాదాపు ఒక అంచనాకు రావచ్చు. ఇప్పుడు ఈ విషయం పైనే సీనియర్ నటుడు నరేష్ స్పందించారు. ఈనెల 1న ఆయన చేసిన ట్వీట్ పొలిటికల్ వర్గాల్లో సంచలనంగా మారింది. రాష్ట్రంలో మతపరమైన విద్వేషాలు వస్తాయని.. దానికి రాజకీయ శక్తులు తోడవుతాయని.. వచ్చే ఎన్నికల్లో కూటమి ప్రభుత్వానికి ఇది సవాల్ అని.. దేశవ్యాప్తంగా ఇదే ఫార్ములాను అనుసరించి రాజకీయాలు చేయబోతున్నారు అంటూ నరేష్ సంచలన కామెంట్స్ చేశారు.

* గత కొద్ది రోజులుగా పరిణామాలతో..
కొద్దిరోజుల కిందట దళిత, క్రైస్తవ శంఖారావసభ జరిగింది. ఇదే సభలో ప్రశ్న రావణ్, జడ శ్రవణ్ కుమార్ చేసిన కామెంట్స్ పొలిటికల్ వర్గాల్లో హిట్ పుట్టించాయి. ప్రశ్న రావణ్ అలియాస్ జోసెఫ్ రావణ్ చేసిన అనుచిత వ్యాఖ్యల మూలంగా ఆయన అరెస్టు కూడా జరిగింది. ఉగ్రవాద చర్యలకు సంబంధించిన చట్టాల్లో ఉన్న కేసులు నమోదు చేశారు. ఆయన అరెస్టు తరువాత రాజకీయ పార్టీలు స్పందించాయి. ప్రధానంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ న్యాయ సహాయం అందించేందుకు సిద్ధపడింది. ఈ అరెస్టును తప్పుపడుతూ కొన్ని రకాల వ్యాఖ్యలు చేసింది. అయితే దీనిని ఊహించి నటుడు నరేష్ ఈనెల ఒకటిన సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టారు. రాష్ట్రంలో మతపరమైన గొడవలు సృష్టించేందుకు కుట్ర జరుగుతోందన్న అనుమానం అర్థం వచ్చేలా ఆయన పోస్ట్ ఉంది.

* మత రాజకీయాలకు దూరం..
ఏపీలో ఇప్పటివరకు కేవలం కుల రాజకీయాలు మాత్రమే నడిచాయి. మతపరమైన వివాదాలకు సంబంధించి ఎవరు అంతగా ప్రాధాన్యం ఇవ్వలేదు. ఏ రాజకీయ పార్టీ కూడా ప్రోత్సాహం అందించలేదు. ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్ పాతబస్తీలో మాత్రం మతపరమైన రాజకీయాలు నడిచేవి. కానీ ఇప్పుడు దళిత క్రైస్తవుల పేరుతో రాజకీయం మొదలైంది. దానికి ప్రేరేపిత రాజకీయ పార్టీలు తోడయ్యాయి. ఇప్పుడిప్పుడే దీనిపై స్పష్టత కూడా వస్తోంది. తెర వెనుక రాజకీయం నడుపుతున్న పార్టీలు సైతం వెలుగులోకి వస్తున్నాయి. అయితే దీనివల్ల దళితులతో పాటు క్రైస్తవుల ఓట్లు దక్కుతాయి అనేది ఒక ఆలోచన. ఒక ఏపీలోనే కాదు దేశవ్యాప్తంగా ఇదే ఫార్ములా తో ముందుకెళ్లే ఆలోచనతో కొన్ని శక్తులు ఉన్నట్లు సినీ నటుడు నరేష్ అనుమానిస్తున్నారు. అందుకే ఏపీ ప్రజలతో పాటు దేశ ప్రజలను ఆయన హెచ్చరిస్తున్నారు.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Most Popular

Electricity Complaint Number: మీ ప్రాంతంలో కరెంటు పోయిందా.. జస్ట్ ఈ నెంబర్ కు కాల్ చేయండి..

Electricity Complaint Number: ప్రస్తుతం చాలా ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో విద్యుత్ సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి. విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడితే చాలా ఇబ్బందులకు గురికావాల్సి వస్తుంది....

Ramayana Movie: రామాయణంలో రావణుడు.. యష్ బీభత్సకాండ కు రణబీర్ షాక్

Ramayana Movie: నితీష్ తివారీ డైరెక్షన్లో 'రామాయణ' అనే భారీ పౌరాణిక చిత్రం సిద్ధమవుతోంది. ఇందులో రాముడిగా రణబీర్ కపూర్.. రావణుడిగా యశ్ పాత్రను పోషించనున్నారు. సీతాదేవిగా సాయి పల్లవి నటిస్తున్నారు. హనుమంతుడి...

Haripriya Vasishta N Simha: ఈ భార్యభర్తలిద్దరూ ప్రముఖ నటులే.. కానీ ఈ విషయం ఎవరికీ తెలియదు..

Haripriya Vasishta N Simha: సినిమా అంటేనే రంగుల ప్రపంచం. ఇందులో ఒక్కసారి ఛాన్స్ వస్తే ఎవరు వదులుకోరు. ఒక కుటుంబంలో ఒకరికి అవకాశం వస్తే ఆ తర్వాత వారికి సంబంధించిన వారు...

Quality Content In Cinema: కంటెంటే కింగ్.. ఇప్పటికైనా తత్త్వం బోధపడిందా?

Quality Content In Cinema: గత కొంతకాలంగా సినిమా ఇండస్ట్రీకి గడ్డు పరిస్థితులు ఎదుర్కొన్నాయి. వెండితెరకు ఈ పరిస్థితి రావడానికి కారణం ఓటీటీలేనని చాలా మంది ఆరోపించారు. కోట్లు ఖర్చుపెట్టి సినిమాలు...

Adarsha Kutumbam: ‘ఆదర్శ కుటుంబం’ గ్లింప్స్ లో ఏముంది… అదొక్కటి తప్ప…

Adarsha Kutumbam: వెంకటేష్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'ఆదర్శ కుటుంబం' సినిమాకు సంబంధించిన గ్లింప్స్ కొద్ది సేపటి క్రితం రిలీజ్ అయింది. ఈ గ్లింప్స్ లో సినిమా యొక్క ఎంటైర్...
Oktelugu Epaper
Exit mobile version