Homeఎంటర్టైన్మెంట్Bandla Ganesh: బండ్ల గణేష్ కుమార్తె వివాహ ఆహ్వాన పత్రిక వైరల్!

Bandla Ganesh: బండ్ల గణేష్ కుమార్తె వివాహ ఆహ్వాన పత్రిక వైరల్!

Bandla Ganesh: సినీ, రాజకీయ రంగాల్లో తనకంటూ ఒక ముద్ర చాటుకున్నారు బండ్ల గణేష్. హిట్ చిత్రాల నిర్మాతగా పేరు తెచ్చుకున్నారు. ఆయన చేసిన కామెంట్స్ హాట్ గా ఉంటాయి. మీడియా డిబేట్లో సైతం సంచలన వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు. అటువంటి బండ్ల గణేష్ ఫ్యామిలీలో ఏది జరిగిన ఒక ట్రెండింగ్ గా నిలుస్తుంది.. తాజాగా ఆయన కుమార్తెకు సంబంధించిన వివాహ ఆహ్వాన పత్రికలో తన అభిమానాన్ని చాటుకున్నారు బండ్ల గణేష్. ఆయన కుమార్తె జననికి.. పశ్చిమగోదావరి జిల్లా కు చెందిన చిలుకూరి సూర్య తేజ తో త్వరలో వివాహం జరగనుంది. మే నెలలో నిశ్చితార్థ వేడుక కూడా జరిగింది . ఇప్పుడు వివాహ శుభ ముహూర్తం దగ్గర పడుతుండడంతో.. వివాహ ఆహ్వాన పత్రికను ప్రముఖులకు అందిస్తున్నారు బండ్ల గణేష్. ఇటువంటి తరుణంలో పెండ్లి శుభలేఖ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.

* చంద్రబాబు దంపతుల ఆశీస్సులతో..
సాధారణంగా పెళ్లి పత్రికల పైన దేవుళ్ళ పేర్లు.. ఇంట్లో పెద్దల పేర్లు వేయించడం చూస్తుంటాం. కానీ బండ్ల గణేష్ తన కుమార్తె వివాహ ఆహ్వాన పత్రిక పై భాగంలో.. శ్రీమతి నారా భువనేశ్వరి, శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీర్వాదాలు అని ప్రత్యేకంగా ముద్రించారు. నారా కుటుంబంతో బండ్ల గణేష్ కు విడదీయరాని వ్యక్తిగత అనుబంధం ఉంది. ఏకంగా శుభలేఖలో ముఖ్యమంత్రితో పాటు ఆయన సతీమణి పేరు రాయించడం మాత్రం గమనించదగ్గ విషయం. చంద్రబాబుకు వీరాభిమానిని అని మరోసారి నిరూపించుకున్నారు గణేష్.

* చంద్రబాబు కోసం మొక్కులు..
గతంలో చంద్రబాబు జైలు నుంచి విడుదల కావాలని.. మళ్లీ సీఎం గా ప్రమాణ స్వీకారం చేయాలని మొక్కుకున్నారు బండ్ల గణేష్. ఇటీవల షాద్నగర్ నుంచి తిరుమల కొండకు కాలినడకన పాదయాత్ర చేసి.. తన ముక్కును చెల్లించుకున్నారు. ఆ తర్వాత చంద్రబాబును కలిసి శ్రీవారి ప్రసాదాన్ని కూడా అందజేశారు. మొన్న మే నెలలో జరిగిన కుమార్తె నిశ్చితార్థ వేడుకలకు చంద్రబాబుతో పాటు సతీమణి భువనేశ్వరి హాజరయ్యారు. నూతన దంపతులకు ఆశీర్వాదం అందించారు. ఈ ప్రత్యేక బంధం తోనే కుటుంబ పెద్దల స్థానంలో చంద్రబాబు దంపతుల పేర్లను శుభలేఖ పై వేయించి అభిమానం చాటుకున్నారు బండ్ల గణేష్.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Most Popular

Ramayana Movie: రామాయణంలో రావణుడు.. యష్ బీభత్సకాండ కు రణబీర్ షాక్

Ramayana Movie: నితీష్ తివారీ డైరెక్షన్లో 'రామాయణ' అనే భారీ పౌరాణిక చిత్రం సిద్ధమవుతోంది. ఇందులో రాముడిగా రణబీర్ కపూర్.. రావణుడిగా యశ్ పాత్రను పోషించనున్నారు. సీతాదేవిగా సాయి పల్లవి నటిస్తున్నారు. హనుమంతుడి...

Haripriya Vasishta N Simha: ఈ భార్యభర్తలిద్దరూ ప్రముఖ నటులే.. కానీ ఈ విషయం ఎవరికీ తెలియదు..

Haripriya Vasishta N Simha: సినిమా అంటేనే రంగుల ప్రపంచం. ఇందులో ఒక్కసారి ఛాన్స్ వస్తే ఎవరు వదులుకోరు. ఒక కుటుంబంలో ఒకరికి అవకాశం వస్తే ఆ తర్వాత వారికి సంబంధించిన వారు...

Quality Content In Cinema: కంటెంటే కింగ్.. ఇప్పటికైనా తత్త్వం బోధపడిందా?

Quality Content In Cinema: గత కొంతకాలంగా సినిమా ఇండస్ట్రీకి గడ్డు పరిస్థితులు ఎదుర్కొన్నాయి. వెండితెరకు ఈ పరిస్థితి రావడానికి కారణం ఓటీటీలేనని చాలా మంది ఆరోపించారు. కోట్లు ఖర్చుపెట్టి సినిమాలు...

Adarsha Kutumbam: ‘ఆదర్శ కుటుంబం’ గ్లింప్స్ లో ఏముంది… అదొక్కటి తప్ప…

Adarsha Kutumbam: వెంకటేష్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'ఆదర్శ కుటుంబం' సినిమాకు సంబంధించిన గ్లింప్స్ కొద్ది సేపటి క్రితం రిలీజ్ అయింది. ఈ గ్లింప్స్ లో సినిమా యొక్క ఎంటైర్...

Zomato Anniversary Campaign: బిల్డప్ కోసం లోగో తీసేస్తే.. కోట్లు బొక్క..

Zomato Anniversary Campaign: క్రియేటివిటీ.. ఇది ఆకర్షించే విధంగా ఉండాలి. జనాలలో ఆలోచన తెచ్చే విధంగా ఉండాలి. ఒకరకంగా నూతనత్వం వైపు అడుగులు వేసే విధంగా ఉండాలి. అలాకాకుండా చదివేస్తే ఉన్న...
Oktelugu Epaper
Exit mobile version